
ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే
ఓడిపోయిన మా వైఖరి మాత్రం ఇదే: ఠాక్రే సోదరులు
మరాఠాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం దక్కల్సిందే అంటున్న ఠాక్రేలు
బీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీలు ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ మరాఠీల కోసం చేస్తున్న మా పోరాటం ఆగిపోదని ఠాక్రే సోదరులు చెప్పారు. తమ మరాఠీ రాజకీయాల విధానంలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని కూటమి విజయాలు సాధించాయి.
ముంబైలో గత మూడు దశాబ్ధాలుగా శివసేనదే పూర్తి ఆధిపత్యం. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వారి పవర్ కు బ్రేక్ పడింది.
ఈ సారి ప్రతికూల పరిస్థితులను ముందే ఊహించిన శివసేన(ఉద్దవ్ ఠాక్రే గ్రూప్), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన్ కలిసి పోటికి దిగాయి. అయినప్పటికీ వారికి కనీస స్థానాలు మాత్రమే దక్కాయి.
థాకరేల కోటకు బీటలు..
‘‘మా పోరాటం ఇంకా ముగియలేదు’’ అని శివసేన్(యూబీటీ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠాలకు ముఖ్యనాయకుడైన దివంగత బాలా సాహెబ్ ఠాక్రే ఫొటో కింద రాసుకొచ్చారు.
ముంబైకు, మరాఠీలకు తాము మాత్రమే రక్షకులని, భవిష్యత్ అంతా మరాఠాలదే ఎన్నికల ముందు వారు ప్రకటనలు ఇచ్చారు. అయితే తాజా ఫలితాల్లో మాత్రం ఎక్కడా వీరి ప్రభావం కనిపించలేదు.
227 వార్డులలో థాకరే సోదరులు 65 మాత్రమే గెలుచుకున్నారు. అయినప్పటికీ తమ విధానం మాత్రం ఇదే అని వారు పేర్కొంటున్నారు.
మరాఠీలకు నిజమైన గౌరవం లభించాల్సిందే అని, అప్పటి వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. తమ ఓటమి చేసే పోరాటాలపై ప్రభావం చూపదని అన్నారు.
‘‘మరాఠాలకు ప్రజలకు వ్యతిరేకంగా ఏదైన జరిగితే మా కార్పొరేటర్లు అధికారంలో ఉన్నవారిని మోకరిల్లేలా చేస్తారు’’ అని రాజ్ ఠాక్రే ప్రతిజ్ఞ చేశారు.
‘‘మా పోరాటం మరాఠీ ప్రజల కోస, మరాఠీ భాష కోసం, మరాఠీ గుర్తింపు కోసం, సంపన్న మహారాష్ట్ర కోసం. ఈ పోరాటమే మన ఉనికి నిర్వచిస్తుంది’’ అని ఆయన అన్నారు. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక పోరాటాలు అని చెప్పారు.
మహాయుతీ- మరాఠాలను లక్ష్యంగా చేసుకుంది
మహాయుతి కూటమి మరాఠీలను వేధించి, దోపిడి చేస్తుందని రాజ్ థాక్రే ఆరోపించారు. ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఇప్పుడే ఉందని అన్నారు. ‘‘ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అయినా లేదా రాష్ట్రవ్యాప్తంగా అయిన అధికారంలో ఉన్నవారు, వారి కింద ఉన్నవారు మరాఠీలను వేధించడానికి దోపిడి చేయడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు.
ఎన్నికలు వస్తాయి, పోతాయి కానీ మన శ్వాస మాత్రం మరాఠీ అని ఎప్పటికీ మర్చిపోకూడదు’’ చెప్పారు. ఎన్నికల్లో జరిగిన లోపాలను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన్ సమీక్షిస్తుందని,పార్టీని పున: నిర్మిస్తుందని ఆయన చెప్పారు.
Next Story

