మహారాష్ట్ర: సీట్ల షేరింగ్ లో చిక్కుముడి వీడేదెలా?
x
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర: సీట్ల షేరింగ్ లో చిక్కుముడి వీడేదెలా?

మహారాష్ట్రలో సీట్ల షేరింగ్ అన్ని పార్టీలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎన్డీఏ మిత్రపక్షాలు సీట్ల కోసం సిగపట్లకుదిగే సూచనలు కనిపిస్తున్నాయి.


ఈ నెలలో తొలి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే ఎన్డీఏ కూటమి 33 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. బీజేపీ దాని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. మహారాష్ట్రలో దాదాపు మూడింట ఒక వంతు సీట్లు అంటే దాదాపు 24 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎనిమిది సీట్లలో పోటీకి దిగింది. అయితే ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం బారామతి నుంచి మాత్రమే పోటికీ దిగింది. మిగిలిన స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

సై అంటున్న సవాళ్లు
నాసిక్, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, థానే, ఉస్మానాబాద్, పాల్ఘర్, ముంబై సౌత్ వంటి నియోజకవర్గాల్లో అధికార కూటమికి సీట్ల షేరింగ్ కష్టంగా ఉంది. అలాగే పర్భానీ, ఔరంగాబాద్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, రాయ్‌గఢ్, షిరూర్, కళ్యాణ్, యావత్మాల్-వాషిమ్ నియోజకవర్గాల నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది.
సతారా లోక్‌సభ నియోజకవర్గంపై బీజేపీ, అజిత్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీలు కన్నేశాయి. ఛత్రపతి శివాజీ వారసుడు కూడా అయిన తన రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భోసలేను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది. ఎన్‌సిపి కూడా ఈ సీటుపై ఆశలు పెట్టకుంది. తను కూడా ఉదయన్ రాజే భోసలేనే సంప్రదించాయి. అయితే ఎన్సీపీ ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ఇదే సమస్యపై ఆయన హోంమంత్రి అమిత్ షాను కలవనున్నాడని తెలుస్తోంది.
సతారాకు ప్రస్తుతం ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) ఎంపి శ్రీనివాస్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని పార్టీ అధినేత శరద్ పవార్‌కు చెప్పారు. ఆసక్తికరంగా, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇక్కడి నుంచి పోటీ చేయించాలని మహా వికాస్ అఘాడి (MVA) ఆలోచిస్తోంది.
మీడియా నుంచి సమాచారం ప్రకారం, బిజెపి సతారాను తీసుకుని, నాసిక్‌ని ఎన్‌సిపికి ఇవ్వాలని నిర్ణయించుకుంది, ఇది నియోజకవర్గం నుంచి తన సీనియర్ నాయకుడు ఛగన్ భుజబల్‌ను పోటీకి దింపవచ్చు. అయితే, సేనకు చెందిన నాసిక్ సిట్టింగ్ ఎంపీ హేమంత్ గాడ్సే ఈ విషయంపై చర్చించడానికి సిఎం షిండేతో వరుస సమావేశాలు నిర్వహించడంతో ఈ చర్య కూడా అధికార కూటమిలో ఇబ్బందిని కలిగించింది.
శివసేనకు కంచుకోటగా భావించే పాల్ఘర్ నియోజకవర్గంపై బీజేపీ కన్నేసింది. తనకు ఆ స్థానం కావాలని కోరుకుంటోంది. అయితే ఇది శివసేను సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఎంపీ గజేంద్ర గవిట్ ను శివసేన నుంచి కాకుండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని కమలదళం ఆలోచనగా ఉంది.
సీఎం గడ్డపై పోరు
ముఖ్యంగా సీఎం షిండేకు కంచుకోట అయిన థానేలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. రెండు పార్టీలు కూడా ఈ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. తమకు మంచి సంస్థాగత పునాది ఉందని, గణేష్ నాయక్ రూపంలో తమకు మంచి అభ్యర్థి ఉన్నారని బిజెపి తన వాదిస్తోంది. అయితే, తన సన్నిహితుడు రవి ఫాటక్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగాడని తాను వెనక్కి తగ్గలేని సీఎం షిండే స్పష్టం చేశారు.
ప్రతిష్టాత్మకమైన ముంబై సౌత్ లోక్‌సభ నియోజకవర్గాన్ని వదులుకోవడానికి బీజేపీ సుముఖంగా లేదు. బీజేపీకి చెందిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్, రాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా ఈ స్థానంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో ఈ సీటు ఉమ్మడి శివసేనకు దక్కింది. ఇక్కడ అరవింద్ సావంత్ సిట్టింగ్ ఎంపీ. ఈ స్థానం తనకు కావాలని షిండే వర్గం పట్టుబడుతోంది.
అదేవిధంగా, సింధుదుర్గ్-రత్నగిరి లోక్‌సభ స్థానం నుంచి శివసేనది. నియోజకవర్గానికి ప్రస్తుతం శివసేన (యుబిటి) నాయకుడు వినాయక్ రౌత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బీజేపీ ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను పోటీకి దింపాలని బిజెపి యోచిస్తోంది.
అవన్నీ మాకే కావాలి
ఇదిలా ఉంటే, మరాఠ్వాడా ప్రాంతంలో, మరాఠా కోటా ఆందోళన కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నియోజకవర్గాలు కూడా రెండు హిందూత్వ పార్టీలు మాకే కావాలని పట్టుబడుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో AIMIM గెలిచిన ఏకైక నియోజకవర్గం ఔరంగాబాద్. AIMIMకి చెందిన ఇంతియాజ్ జలీల్ 2019లో అవిభక్త సేనకు చెందిన చంద్రకాంత్ ఖైరేను ఓడించారు. ఉస్మానాబాద్ స్థానం శివసేన ఉద్దవ్ వర్గం ఆధిపత్యం నడుస్తోంది. ఇక్కడ ఎవరు పోటీకి నిలిచినా గెలుపు కష్టమనే వాదన ఉంది.
మూడు కూటమి భాగస్వామ్య పక్షాల్లో ఎన్సీపీకీ, షిరూర్, రాయగడలను కూడా కేటాయించినప్పటికీ, ఎన్‌సిపి హై ప్రొఫైల్ సీటు అయిన బారామతి నుంచి మాత్రమే తన అభ్యర్థిని ప్రకటించింది. సీట్ల షేరింగ్ ఫార్మూలా ముగిశాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో పార్టీ ఉంది.
మరింత ఇబ్బంది
మహాదేవ్ జంకర్ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పార్టీ (RSP), రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)తో ఎన్డీఏ కూటమి చర్చలు జరుపుతోంది. అవి కూడా ఇందులో చేరితే సీట్ల షేరింగ్ ఇంకా సిగపట్లు పెరిగే అవకాశం ఉంది. రాజ్ ఠాక్రే ముంబై సౌత్ నియోజకవర్గంపై కన్నేశాడు. అదేవిధంగా పర్భాని స్థానం నుంచి పోటీ చేసేందుకు జంకర్ ఆసక్తిగా ఉన్నారు. అయితే సీటు దక్కని ఆశావహూలు పార్టీలపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు.
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ జాదవ్ నాలుగోసారి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా, అమరావతి లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన తర్వాత, NDA మిత్రపక్షం అచల్‌పూర్ ఎమ్మెల్యే బచ్చు కడు ఆమెకు వ్యతిరేకంగా మాజీ సేన (UBT) కార్పొరేటర్ దినేష్ బబ్‌ను రంగంలోకి తీసుకొచ్చింది. మాజీ జిల్లా సేన (UBT) చీఫ్ ఇప్పుడు కడు యొక్క ప్రహార్ జనశక్తి పార్టీ (PJP) గుర్తుపై పోటీ చేయనున్నారు.


Read More
Next Story