ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే.. ఐస్ క్రీంతో పాటు వచ్చిన మానవ..
x

ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే.. ఐస్ క్రీంతో పాటు వచ్చిన మానవ..

ఆన్ లైన్ ఆర్డర్ లో ఓ వైద్యుడు ఐస్ క్రీం కు ఆర్డర్ ఇవ్వగా, అందులో నిర్వాహకులు ఐస్ క్రీంతో పాటు..


కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది. మొన్నటి మొన్న హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ హోటలల్లో ఫుడ్ సేప్టీ అధికారులు జరిపిన దాడుల్లో కుళ్లిన మాంసం, కూరగాయాలు, పిండి, ఇతర సరంజామాతో ఆహారాన్ని వండి ప్రజలకు వడ్డిస్తున్న ఘరానా గాళ్లను చూశాం. కానీ ముంబైలో ఓ ప్రబుద్దుడు ఏకంగా మనుషుల వేళ్లను ఐస్ క్రీంలో పెట్టి పంపించాడు.

ముంబై లో ఓ వైద్యుడు ఆన్ లైన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తింటుండగా అందులో మనిషి వేలు కూడా రావడంతో షాక్ అయ్యారు. ఆ తరువాత తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు.. ముంబై సబర్బన్‌లోని మలాడ్‌కు చెందిన ఓర్లెమ్ బ్రాండన్ సెర్రావ్ అనే వ్యక్తి యమ్మే బ్రాండ్ యాప్ నుంచి మూడో కోన్ ఐస్ క్రీం లను ఆర్డర్ చేశాడు.

భయంకరమైన పరిస్థితి

"ఐస్ క్రీం ఆర్డర్ చేసి దానిలో సగం తిన్న తర్వాత, నా నోటిలోకి ఏదో గట్టి ముక్క వచ్చింది. ఇది గింజ లేదా చాక్లెట్ ముక్క కావచ్చు అని నేను అనుకున్నాను, కానీ ఎంతసేపటికీ నోటీలో నలగకపోవడంతో బయటకు ఉమ్మి వేశాను," అని డాక్టర్ సెర్రావ్ వీడియో ప్రకటనలో తెలిపారు. అది ఏమిటో కనుక్కోగానే ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
"నేను డాక్టర్‌ని కాబట్టి శరీర భాగాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దానిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, దాని కింద ఉన్న గోర్లు, వేలిముద్రలు గమనించాను. అది బొటనవేలును పోలి ఉంది. నేను బలవంతంగా కొరకడంతో నోరులో కాస్త బ్లడ్ కూడా వచ్చింది" అని అతను చెప్పాడు.
పోలీసు కేసు
ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఫోటోలో కోన్ ఐస్ క్రీం నుంచి ఒక మనిషి వేలు బయటికి వచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులకు చూపించడానికి ఆ డాక్టర్ ఈ వేలి ముక్కను ఐస్ ప్యాక్ లో ఉంచాడు. ఆహార పదార్థాలను కల్తీ చేసి మానవ ప్రాణాలకు హాని కలిగించినందుకు యమ్మో బ్రాండ్‌పై కేసు నమోదైంది. పోలీసులు ఐస్‌క్రీమ్‌ను విచారణ కోసం వేలిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు.
Read More
Next Story