‘మహా సర్కార్’ లో లుకలుకలు.. బీజేపీ మంత్రిపై, షిండే గ్రూపు విమర్శలు
x

‘మహా సర్కార్’ లో లుకలుకలు.. బీజేపీ మంత్రిపై, షిండే గ్రూపు విమర్శలు

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రి పనికిరాడని వాడని శివసేన షిండే గ్రూపుకు చెందిన..


మహారాష్ట్ర లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన షిండే గ్రూపుకు చెందిన నాయకుడు, బీజేపీ నాయకుడిపై విమర్శలు చేయడంతో వివాదం రాజుకుంది. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు.

వివారాల్లోకి వెళితే.. ముంబై - గోవా రహదారి వర్షాలకు తీవ్రంగా గుంతలు పడి ఉంది. ప్రస్తుతం ఈ శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన రవీంద్ర చవాన్ ఉన్నారు. ఆయన పనికి రాని మంత్రి అని శివసేన నాయకుడు రాందాస్ కదమ్ సోమవారం విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కలకలం రేగింది. వెంటనే స్పందించిన ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్.. ఈ వ్యాఖ్యలు మహాయుతి కూటమి సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు.

థానేలో విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి కదమ్, మహారాష్ట్రలోని కోస్తా జిల్లాల గుండా వెళ్లే ముంబై-గోవా హైవేపై అసంపూర్తిగా ఉన్న పనులపై చవాన్‌పై విరుచుకుపడ్డారు.
"14 ఏళ్ల నిరీక్షణ తర్వాత, రాముడి వనవాసం (అజ్ఞాతవాసం) కూడా ముగిసింది, కానీ ముంబై-గోవా హైవేపై సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మనకు ఇప్పటికీ మంచి రోడ్లు లేవు. రాష్ట్ర PWD మంత్రి రవీంద్ర చవాన్ పూర్తిగా పనికిరానివాడిగా కనిపిస్తున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ, చవాన్‌ రాజీనామా చేయాలని దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరతారని, ఇది నేను బహిరంగంగా చేస్తానని వ్యాఖ్యానించారు.
రోడ్ల పరిస్థితి ఇంకా మెరుగుపడనప్పుడు మంత్రి సమీక్షా సమావేశాలు, పర్యటనల వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. శివసేన నాయకుడి వ్యాఖ్యలపై ఫడ్నవీస్ స్పందిస్తూ, "కదమ్ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఏ కూటమి సూత్రానికి కట్టుబడి ఉంటాడు?
అతను తన ఆందోళనలను మాతో అంతర్గతంగా పరిష్కరించుకోవచ్చు. అయినప్పటికీ, అతను లేవనెత్తిన అంశాలను నేను పరిశీలిస్తాను" అని అన్నారు. ముంబై-గోవా హైవే దుస్థితిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు కళ్యాణ్‌కు చెందిన శివసేన నాయకులు ఇటీవల ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేను కలిశారు. ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.
Read More
Next Story