
కునాల్ కమ్రా
కునాల్ కమ్రా కు పోలీసుల నోటీసులు..
షిండే పై ‘ద్రోహి’ అని వ్యాఖ్యలు చేసిన కమెడియన్, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న వివరణ
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ఖార్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నిన్న జరిగిన ఒక షో లో కమ్రా ఒక హిందీ సినిమాలోని ఒక పాటను మార్చి షిండేను గద్దర్ (దేశద్రోహి) అని అభివర్ణించారు. దీనితో ఇది మహారాష్ట్రలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది.
షో జరిగిన హోటల్ పై సేన కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఉదయం 11 గంటలకు స్టేషన్ కు రావాలని నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం కామ్రా తమిళనాడులో ఉన్నట్లు భావిస్తున్నప్పటికీ, ముంబైలోని అతని ఇంటికి సమన్లు పంపినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.
‘‘ఈరోజు ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కునాల్ కమ్రా ఇంటికి ఖార్ పోలీసులు నోటీస్ పంపారు. కునాల్ ప్రస్తుతం ముంబైలో లేడు.
స్టాండ్ ఆప్ కామెడీ షో సందర్భంగా కునాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎంఐడీసీ పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిని తదుపరి దర్యాప్తు కోసం ఖార్ పోలీసులకు బదిలీ చేశారు’’ అని ముంబై పోలీసులను ఉటంకిస్తూ జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది.
కామ్రా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వెంటనే క్షమాపణ చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా డిమాండ్ చేశారు. అయితే కామ్రా మాత్రం తను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, రాజకీయాల గురించి జోక్ చేయడం నేరంకాదని ఎక్స్ లోని ఓ పోస్ట్ లో పేర్కొన్నారు.
ధిక్కార స్వరం..
ధిక్కార స్వరం వినిపిస్తున్న కామ్రా.. తన నెంబర్ సోషల్ మీడియాలో లీక్ చేశారని, తనను ద్వేషించే వారు ఫోన్ చేస్తే అది తన వాయిస్ మెయిల్ కు వెళ్తుందని, అక్కడ వారు నిన్నటి పాటను మళ్లీ వింటారని చెప్పారు.
‘‘నేను క్షమాపణ చెప్పను. ఈ గుంపుకు నేను భయపడను. నేను నా మంచం కింద దాక్కుని ఉండను’’ అని కామ్రా ఎక్స్ లో రాశారు. తన ప్రకటన అజిత్ పవార్, ఏకనాథ్ షిండే గురించే చెప్పినట్లు అని వ్యాఖ్యానించారు.
ఆయనకు మద్దతుగా కాంగ్రెస్, సీపీఎం మద్దతును తెలిపాయి. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని అవి సమర్థించాయి. శివసేన యూబీటీ నేతలు మాట్లాడుతూ.. ఖార్ లోని హాబిటాట్ కామెడీ క్లబ్ ను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయితే వేదికను ధ్వంసం చేయడం అర్థరహితం, అని కామ్రా అన్నారు.
బటర్ చికెన్ నచ్చకపోతే.. టమోటాలు తీసుకెళ్తున్న లారీని ఎవరో తిప్పికొట్టడంతో సమానమని అన్నారు. షో వేదికను ధ్వంసం చేసినందుకు శివసేన కార్యకర్త రాహుల్ కనాల్ తో పాటు మరో 11 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
Next Story