ద్వారకాలో స్కూబా డైవింగ్ ను ఆస్వాదిస్తున్న ప్రధాని ‘మోదీ’
x
బేట్ ద్వారకాలో స్కూబా డైవింగ్ అనంతరం ప్రధాని మోదీ

ద్వారకాలో స్కూబా డైవింగ్ ను ఆస్వాదిస్తున్న ప్రధాని ‘మోదీ’

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆదివారం సరదాగా గడిపారు. సముద్రంలో మునిగిన ద్వారక ను స్కూబా డైవింగ్ ద్వారా దర్శించారు.


ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సొంత రాష్ట్రం గుజరాత్ లో సరదసరదాగా గడిపారు. సముద్ర ద్వారకాధీశుడిని దర్శించుకున్న ప్రధాని, అనంతరం అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ ను ఆస్వాదించారు. అంతకుముందు రోజు ఆయన ద్వారకాధీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ద్వారకాలోని అరేబియా సముద్ర తీరంలో గల పంచకుయ్ బీచ్ లో స్కూబా డైవింగ్ చేశారు. ద్వాపర యుగంలో సముద్రంలో మునిగి, ఇప్పటికీ సముద్రం అట్టడుగున ఉన్న పురాతన ద్వారాకాను ప్రధాని వీక్షించారు. నీటిలో మునిగిపోయిన ద్వారకా ను చూడడం, అక్కడ భగవంతుడిని వేడుకోవడం తనకు దివ్యమైన అనుభూతిని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.
" నీటిలో మునిగిన ద్వారకా ను చూడడం, ప్రార్థనలు చేయడం దివ్యమైన అనుభూతి. నేను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీతమైన భక్తితో ముడిపడి ఉన్నానా అని ఆ క్షణాన అనిపించింది. భగవంతుడు శ్రీ కృష్ణుడు మనందరిని ఆశీర్వదిస్తాడు." అని స్కూబా డైవింగ్ అనంతరం ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ద్వారకలోని ఒక పబ్లిక ఫంక్షన్ కు హజరయ్యే ముందు మోదీ నీటిలో స్కూబా డైవింగ్ చేస్తున్న ఫొటోలను కూడా సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా పంచుకున్నారు.
ఈ రోజు ఉదయం దేవభూమి ద్వారక జిల్లాలోని బేట్ ద్వారక ద్వీపాన్ని ప్రధాన భూభాగామైన ఓఖా తో కలుపుతూ అరేబియా సముద్రంలో నిర్మించిన ‘సుదర్శన్ సేతును ’ ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇది దేశంలో సముద్రంపై నిర్మించిన పొడవైన తీగల వంతెనగా రికార్డులకెక్కింది. కాగా బేట్ ద్వారక ద్వీపం సమీపంలోని ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్విన పురాతన ద్వారక యొక్క నీటి అడుగున అవశేషాలను చూడవచ్చు.


Read More
Next Story