లాయర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
x
రాహుల్ గాంధీ

లాయర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

తనను సంప్రదించకుండా గాడ్సె, సావర్కర్ అనుచరుల వల్ల ప్రాణహాని ఉందని పిటిషన్ వేసిన మిలింద్ డీ పవార్


వీడీ సావర్కర్, నాథూరామ్ గాడ్సే భావజాల అనుచరుల వల్ల తనకు హాని కలిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పుణెలోని కోర్టుకు చెప్పిన వార్తలు వచ్చాయి. అయితే ఈ పిటిషన్ ను ఓ న్యాయవాదీ రాహుల్ గాంధీని సంప్రదించకుండానే దాఖలు చేసినట్లు తేలింది. ఈ పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి గురువారం అధికారికంగా దరఖాస్తు దాఖలు చేస్తానని న్యాయవాదీ తెలిపారు.

న్యాయవాదీ మిలింద్ డి పవార్ దాఖలు చేసిన దరఖాస్తు తెలుసుకున్న రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారని రాహుల్ గాంధీ సన్నిహిత వర్గాలు ‘ది ఫెడరల్’కు చెప్పారు. ‘‘ ఆ దరఖాస్తు ఆయన ఎల్లప్పుడూ తన రాజకీయాల్లో బోధించే, ఆచరించే దారో మత్(భయపడకండి) సందేశానికి పూర్తిగా విరుద్దంగా ఉంది’’ అని అన్నారు.
పర్సీలను వెంటనే ఉపసంహరించుకున్నారని న్యాయవాదీ కోరారు. భవిష్యత్ లో రాహుల్ తరఫున ఎటువంటి అభ్యర్థన ప్రకటన చేయకూడదని గట్టిగా చెప్పారు.
అప్లికేషన్..
పుణేలోని ప్రత్యేక ఎమ్మెల్యే- ఎంపీ కోర్టులో సమర్పించిన దరఖాస్తులో కాంగ్రెస్ నాయకుడు సావర్కర్, గాడ్సే అనుచరుల నుంచి హానీ ఎదుర్కొనే ప్రమాదం ఉందని, నివారణ.. రక్షణ అందించడం రాష్ట్ర రాజ్యాంగ బాధ్యత అని పేర్కొంది.
2023 మార్చిలో లండన్ లో సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్నారు. సావర్కర్ ఒక పుస్తకంలో తాను, అతని ఐదుగురు స్నేహితులు ఒకసారి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టారని, అప్పుడు తాను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనితో వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ రాహుల్ పై ఈ కేసు దాఖలు చేశారు.
ఫిర్యాదుదారుడు సావర్కర్ ప్రత్యక్ష వారసుడు..
జ్యూడీషియల్ మేజిస్ట్రేట్(ఫస్ట్ క్లాస్) అమోల్ షిండే ముందు దాఖలు చేసిన దరఖాస్తు ప్రకారం.. ఫిర్యాదుదారుడు సత్యకి సావర్కర్ తాను మహత్మా గాంధీ హత్యలో ప్రధాన నిందితులైన నాథూరాం గాడ్సే, గోపాల్ గాడ్సేల తల్లి వంశం ద్వారా ప్రత్యక్ష వారసుడినని అంగీకరించాడు.
రాహుల్ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడని, ఇటీవల న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ మోసానికి సంబంధించిన ఆధారాలను దేశం ముందు ఉంచారని కూడా ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ‘ఓటు చోర్ సర్కార్’ వంటి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారని ఆ దరఖాస్తులో పేర్కొన్నాడు.
‘‘ఇంకా హిందూత్వ అంశంపై పార్లమెంటరీ చర్చ సందర్భంగా ప్రధానమంత్రి, శ్రీ రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు ఆయన ముత్తాతలు వినాయక్ సావర్కర్ భావజాలంలో సంబంధం ఉంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న సావర్కర్ అనుచరులు గాంధీ పట్ల శత్రుత్వం లేదా ఆగ్రహాన్ని కలిగి ఉండవచ్చని సందేహం లేదు’’ అని జాతీయ మీడియా ఉటంకించినట్లు అది తెలిపింది.
రాజ్యాంగ వ్యతిరేక ధోరణులు..
ఫిర్యాదుదారుడి వంశపారంపర్యంగా హింసాత్మక, రాజ్యాంగ వ్యతిరేక ధోరణుల డాక్యుమెంట్ చరిత్రను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుంటే రాహుల్ గాంధీకి హానీ, చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనికి గణనీయమైన భయం ఉంది’’ అని దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సత్యకి సావర్కర్ స్పందిస్తూ ఇది పనికిమాలినదని, విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో దాఖలు చేశారని అన్నారు.
Read More
Next Story