
గుజరాత్ లోని గిప్ట్ సిటీలో మద్యపాన నిబంధనలు సడలింపు
గుజరాత్ లో మద్యపాన నిబంధనల సడలింపు
గుజరాతీయుడు కాకుండా వేరే రాష్ట్రాలకు చెందినవారు, విదేశీయులు మద్యం సేవించవచ్చన్న బీజేపీ సర్కార్
గుజరాత్ ప్రభుత్వం మద్యపాన నిబంధనలు సడలించింది. అయితే అది గుజరాతీయులకు మాత్రం కాదు. కేవలం విదేశీయుల కోసం మాత్రమే. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. గుజరాత్ కు చెందిన వ్యక్తి కాకుండా వేరే రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వ్యక్తులు అయినా ఇప్పుడు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(గిప్ట్ సిటీ) లోని హోటళ్లు లేదా రెస్టారెంట్ లలో ఫోటో ఐడీకార్డు చూపించి మద్యం సేవించవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం గాంధీనగర్ లోని గిప్ట్ సిటీలో మద్యం సెవించడానికి పర్మిట్ నిబంధనలు వర్తించవు. గుజరాత్ హోం శాఖ డిసెంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులు ప్రకటించింది. గిప్ట్ సిటీలో మద్యం వినియోగ నియమాలను మరింత సడలించింది.
మద్య నిషేధ విధానం..
గుజరాత్ తీవ్ర వర్షాభావ జోన్ లో ఉంది. అక్కడ చాలా రోజులు పొడివాతావరణం ఉంటుంది. ఇక్కడ మద్యం తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ప్రభుత్వం 2023 లో ప్రత్యేకంగా గిప్ట్ సిటీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. కొన్ని షరతులతో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో మద్యం అమ్మకం, వినియోగాన్ని అనుమతించింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం గుజరాత్ కు చెందిన వారు కానీ విదేశీయులు కానీ ఏ బాహ్య వ్యక్తి అయిన చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డును చూపించి గిప్ట్ సిటీలో ఉన్న మద్యశాలలో మధుపానం చేయవచ్చు. ఈ కొత్త నియమం మునుపటి షరతులను సడలించినట్లు అయింది. దీనికింద అటువంటి కొత్త వ్యక్తులు తాత్కాలికంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మినహయింపులు..
మద్యం అందించే, వినియోగించే ప్రదేశానికి సంబంధించిన మార్పులు సైతం ప్రస్తుతం చోటు చేసుకున్నాయి. గతంలో గిఫ్ట్ సిటీలోపల మద్యం విక్రయించడానికి అనుమతి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలోని పర్మిట్ ప్రాంతాలలో మాత్రమే మద్యం సేవించడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు పచ్చిక బయళ్లు, ఫూల్ సైడ్ ప్రదేశాలు, టెర్రస్ వంటి ప్రాంతాలలో కూడా మద్యం సేవించవచ్చు.
లిక్కర్ యాక్సెస్ పర్మిట్ ఉన్న గిఫ్ట్ సిటీ ఉద్యోగులు, నియమించబడిన ప్రదేశాలలో ఒకేసారి 25 మంది సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వవచ్చు. హోస్ట్ ఉద్యోగి వారితో పాటు ఉంటే సందర్శకులకు తాత్కాలిక అనుమతులు లభిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది.
Next Story

