ఆ రాష్ట్రంలో మహిళా మణులనే నమ్ముకున్న నాయకులు
x

ఆ రాష్ట్రంలో మహిళా మణులనే నమ్ముకున్న నాయకులు

ఈ ఏడాది చివరికి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి చేతిలో పరాభవం పొందిన ఎన్డీఏ నాయకత్వం తాజాగా తన వ్యూహాన్ని మార్చి..


వచ్చే కొన్ని నెలల్లో దేశంలోనే రెండో అతిపెద్ద(జనాభా) రాష్ట్రమైన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మరోసారి మహారాష్ట్రలో విజయ దుందుభి మోగించాలని ఆరాటపడుతోంది. అందుకోసం ఓటర్లను ఆకర్షించడానికి ప్రణాళికలు వేస్తోంది.

నెల రోజుల క్రితం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేలవమైన పనితీరును కనపరిచింది. ఇండి కూటమి నుంచి ఎన్డీఏకు బలమైన ప్రతిఘటన ఎదురైంది. దీనితో అధికారంలో ఉన్న కూటమి ఓటర్లకు ఆకట్టుకోవడానికి నేరుగా మహిళల చేతుల్లోకి డబ్బు ఇవ్వాలని నిర్ణయించింది.
మధ్య ప్రదేశ్ లోని ప్రభుత్వం ఇలాంటి పథకాన్నే ప్రవేశపెట్టి లబ్ధి పొందింది. అక్కడ లాడ్లీ బెహనా పథకం ద్వారా మహిళలకు చేరువైంది. ఇది ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ లో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి కారణమైంది. ఇదే తరహా విధానాన్ని మహారాష్ట్రలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
మహిళలకు రూ.1,500
"మధ్యప్రదేశ్‌లో మొట్టమొదట అమలయిన ఈ పథకం, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేస్తుందో జనాభాలోని ఎక్కువ భాగానికి అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది పేదల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం. బీజేపీ ఎల్లప్పుడు మహిళల సంక్షేమం కోసం పని చేస్తుంది. ఈ పథకం నేరుగా మహిళలకు అనుకూలంగా పని చేస్తుంది, ”అని మహారాష్ట్ర బిజెపి ఇన్‌ఛార్జ్ జైభన్ సింగ్ పవయ్య ది ఫెడరల్‌తో అన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని అధికార NDA ప్రభుత్వం రాష్ట్రంలో ఎదురుదెబ్బతింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండి కూటమి సభ్యులు మెజారిటీ లోక్‌సభ నియోజకవర్గాలను గెలుచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2024లో ఎన్నికలకు వెళ్తుంది. ఈ ప్రభావం అక్కడ పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే మహిళలకు రూ. 1,500 ఇవ్వాలని నిర్ణయించింది.
ఆర్థిక వ్యవస్థకు ఊతం
“రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను రాజకీయాల కోణంలో మాత్రమే చూడకూడదు. మహిళలను ఆర్థికంగా, స్వతంత్రంగా, స్థిరంగా ఉంచడం రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తుంది. ఈ పథకం మహిళలు ఇళ్లు నడపడానికి ఉపయోగపడుతుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ఇంత పెద్ద జనాభా చేతిలో డబ్బు ఉన్నప్పుడు, అది చిన్న వ్యాపారాలకు సాయం చేస్తుంది. అది అభివృద్ధి దిశలో ఒక అడుగు మాత్రమే, ” అని పావయ్య అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలవడంతో ఎన్డీఏ ప్రభుత్వం యువతను సైతం ఆకర్షించే పనిలో పడింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల మందికి పైగా యువతకి ఆరు నెలల పాటు పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు నెలవారీ రూ.10,000 స్టైఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. లోక్ సభ లో రాహుల్ గాంధీ తరుచుగా యువత నిరుద్యోగం గురించి మాట్లాడటం వల్లే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
మరాఠా కోటా అడ్డంకి..
ఓబీసీ హోదా కోసం మరాఠా కమ్యూనిటీ చేస్తున్న డిమాండ్ బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ ఫార్ములాకి అడ్డంకిగా మారింది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, ఎన్డీఏ భాగస్వాముల వ్యూహంలో మార్పు జరుగుతోంది. మరాఠాలు రిజర్వేషన్లు డిమాండ్ చేయడంతో, తమకు అనుకూలంగా వివిధ OBC వర్గాల ఏకీకరణ జరుగుతుందని BJP, NDA నాయకత్వం భావించాయి.
బిజెపి OBC ఓట్లలో గణనీయమైన వాటాను పొందగలిగినప్పటికీ, ఇండి కూటమికి అనుకూలంగా జరుగుతున్న సామాజిక సమీకరణను ఎదుర్కొవడానికి ఇది సరిపోదని గత ఎన్నికల్లో అనుభవ పూర్వకంగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉన్నందున, ఇతర రాష్ట్రాలలో అమలు చేయబడిన ప్రజాకర్షక పథకాలు ఎన్నికలల్లో తమకు లబ్ధి చేకూరుస్తాయని, మరోసారి మహారాష్ట్రలో అధికారంలోకి వస్తామని ఎన్డీఏ భావిస్తోంది.
కుల సమీకరణాలు
ఎన్నికల్లో గెలవడానికి కీలకమైన సామాజిక సమీకరణల పునాదిని కాపాడుకోవడానికి ఇండి కూటమితో బలంగా పోరాడవలసి ఉంటుందని గ్రహించింది. అందుకే ఇటీవల బీజేపీ నాయకత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంకజా ముండేని పోటీకి దింపింది. ముండే ఎంపిక చాలా ముఖ్యమైంది. ఎందుకంటే మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన అతిపెద్ద ఓబీసీ నాయకుడు గోపినాథ్ ముండే కుమార్తెనే ఈ పంకజా ముండే.
“ప్రభుత్వంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా. అధికారంలో ఉంటే ఎన్నో పథకాలు ప్రకటించవచ్చు. మహిళల చేతుల్లో డబ్బులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి చర్య, ఇది మహిళలకు ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు, కానీ ఎన్నికల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటనలు చేస్తోందని ప్రజలు కూడా గ్రహించారు,” అని పంజాబ్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, అశుతోష్ కుమార్ ఫెడరల్‌తో అన్నారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇద్దరూ మరాఠా వర్గానికి చెందిన వారు కాగా, ఇతర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు కావడంతో పంకజా ముండే ఎన్నిక కూడా ముఖ్యమైనదని కుమార్ తెలిపారు.
Read More
Next Story