పవర్ కోసం కలిసిపోయిన ‘పవార్ కుటుంబం’
x
బారామతి లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించిన శరద్ పవార్, అజిత్ పవార్ తో గౌతమ్ అదానీ

పవర్ కోసం కలిసిపోయిన ‘పవార్ కుటుంబం’

పింప్రి- చించ్ వాడ్ స్థానిక ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ప్రకటించిన అజిత్ పవార్


మహారాష్ట్రలో రెండు చీలిపోయిన ఎన్సీపీ గ్రూప్ తిరిగి మున్సిపల్ ఎన్నికల కోసం కలవబోతున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు. పింప్రి- చించ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎన్సీపీ (ఎస్పీ)- ఎస్సీపీ మధ్య పొత్తు కుదిరినట్లు చెప్పారు.

జనవరి 15న జరగనున్న ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం పింప్రి- చించ్ వాడ్ లో పర్యటనలో అజిత్ పవార్ ఈ ప్రకటన చేశారు. ‘‘పింప్రి- చించ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం గడియారం- తుటారి(బాకా) ఒక్కటయ్యాయి. పరివార్ కలిసి వచ్చిందని ఆయన అన్నారు.

అభివృద్ధి కోసం..
పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని పవార్ కోరారు. ‘‘మేము అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ను అప్పుల్లో నెట్టడానికి ప్రయత్నించిన వారిని మేము బయటకు తీస్తాము’’ అని ఆయన హెచ్చరించారు.
అలాగే పుణే కార్పొరేషన్ ఎన్నికలకు పొత్తుకోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు రోజు పవార్ కుటుంబం బారామతిలో కలిసి ఉన్నారు. అక్కడ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ శరత్ చంద్ర పవార్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ప్రారంభించారు.
మున్సిపల్ ఎన్నికలు..
పింప్రి- చించ్వాడ్, పుణే పౌర సంస్థలు సహ మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జనవరి 15న జరుగుతాయి. మరుసటి రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 30.
మహారాష్ట్రలో ఎన్సీపీ రెండు కూటములుగా చీలిపోయింది. ఒక కూటమి అజిత్ పవార్ నేతృత్వంలో ఉండగా, మరొకటి పార్టీ వ్యవస్థాపకుడు అయిన శరద్ పవార్ నేతృత్వంలో ఉంది.
మరో వైపు శివసేన కూడా రెండుగా చీలిపోయింది. శివసేన(ఏక్ నాథ్ షిండే వర్గం), శివసేన(యూబీటీ)గా ఉన్నాయి. ఇవి రెండు విడిపోయిన కూటములు ప్రస్తుతం ఎన్డీఏ తో కలిసి అధికారం పంచుకుంటున్నాయి.
మరోవైపు ఠాక్రేల కుటుంబం కూడా మున్సిపల్ ఎన్నికల కోసం చేతులు కలిపారు. ఉద్దవ్ వర్గం, రాజఠాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన్ కలిసి బృహన్ ముంబై ఎన్నికల కోసం బరిలోకి దిగుతున్నాయి.
Read More
Next Story