సౌరాష్ట్ర లో కాంగ్రెస్ పతనానికి కారణాలు ఏంటీ?
x
భావ్ నగర్ మార్కెట్, సౌరాష్ట్ర, గుజరాత్

సౌరాష్ట్ర లో కాంగ్రెస్ పతనానికి కారణాలు ఏంటీ?

గుజరాత్.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. ఇక్కడ 26 ఎంపీ సీట్లున్నాయి. ఇందులో ఏడు స్థానాలు సౌరాష్ట్ర పరిధిలోవి. 2014,2019 నాటి ఎన్నికల్లో బీజేపీ గాలి బలంగా వీసింది.


ఇప్పుడు 2024 ఎన్నికల్లోనే ఇదే ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది. కచ్, మోర్నీ, సురేంద్ర నగర్, రాజ్ కోట్, భావ్ నగర్, జామ్ నగర్, ద్వారక, గిర్ సోమ్ నాథ్, అమ్రేలి, పోర్ బందర్ జిల్లాలు ఉన్నాయి. ఒక వైపు అరేబియా సముద్రం,మరో వైపు గిర్ నేషనల్ పార్క్, వన్యప్రాణుల అభయారణ్యం సౌరాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి.

ఓబీసీల ఓటు బ్యాంక్
ఇక్కడ ఏడు స్థానాల్లో కోస్టల్ బెల్ట్ లో ఎక్కువగా పాటిదార్లు, కోలీ, అమిత్, క్షత్రియులు(దర్భార్) ఆధిపత్యం వహిస్తున్నారు. ఓబీసీలు కాంగ్రెస్ కు, పటేళ్లు బీజేపీకి మద్ధతు ఇస్తున్నారు. అయితే 2017 నుంచి కాంగ్రెస్ ఇక్కడ తన ప్రాబాల్యాన్ని కోల్పోతూ వస్తోంది. అంతర్గత తగాదాలు, ఫిరాయింపులే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వీరంతా కోలీ, పాటిదార్, అహిర్ కులాలకు చెందిన నాయకులు. దీనివల్ల కాంగ్రెస్ బలహీనపడుతోంది.
2019 నుంచి ఫిరాయింపుల ట్రెండ్
2019 నుంచి ఎన్నికలకు ముందు ఫిరాయింపులు మొదలయ్యాయి. కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన చావ్డా మంత్రి వర్గంలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈయన తండ్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు పెథాల్జీ కి కూడా ఓబీసీ వర్గంలో మంచి పట్టు ఉండేది. ఇప్పుడు ఇదే పట్టును చావ్దా కూడా కొనసాగిస్తున్నారు. అందుకే బీజేపీ తాజాగా ఓబీసీ ప్రాబల్యం సంపాదించేకు చావ్డాకే బాధ్యతలు అప్పగించింది.
ఐదుసార్లు గెలిచిన బవలియా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈమధ్య ప్రముఖ దర్భార్ నాయకుడు అర్జున్ ఖత్రియా కూడా బీజేపీలో చేరారు. ఈయనకు కాంగ్రెస్ తో 25 సంవత్సరాల అనుబంధం ఉంది.
కాంగ్రెస్ పేటేంట్ అయిన వర్గపోరు
కాంగ్రెస్ కే పార్టీ పేటెంట్ అయిన వర్గపోరుతోనే చాలామంది నాయకులు పార్టీని వీడుతున్నారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికలలో మొదటిసారిగా ఆరు తాలూకా పంచాయతీలను బీజేపీ గెలుచుకోవడానికి సహాయపడింది. ఈ ఎన్నికల్లో పరాజయం తరువాత పాటిదార్ వర్గం చూపును కాంగ్రెస్ కోల్పోయింది. తరువాత హర్ధిక్ పటేల్ బీజేపీలో చేరి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించాడు.
సౌరాష్ట్ర లోని అన్ని స్థానాలపై పటేల్ ప్రభావం ఉంది. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేష్ పటేల్, కర్దా పటేల్ లాంటి పారిశ్రామిక వేత్తలను కాంగ్రెస్ బరిలోకి దింపడానికి ప్రయత్నించింది. అయితే వారు దీనికి స్పందించలేదు. ఫలితంగా కాంగ్రెస్ ఇక్కడ ఎడ్జ్ ను కొల్పోయింది.



ఇదే అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకుడు మనీషి జానీ మాట్లాడుతూ.." కాంగ్రెస్ ప్రతి ఎన్నికల్లో బలహీనపడుతూ ఉంది. బీజేపీ బలం రోజు రోజుకూ పెరుగుతోంది. 2020 స్థానిక ఎన్నికలు, 2021 పౌర ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు అన్ని ఇవే సూచిస్తున్నాయి. ప్రతి ఓబీసీ నాయకుడు గెలవడం, తరువాత బీజేపీలోకి చేరడం ఇదే సాంప్రదాయం " అని వివరించారు. గుజరాత్ లో పార్టీ చివరిగా మాధవ్ సింగ్ సోలంకీ హయాం లోనే వైభవంగా ఉందని, తరువాత అంతా క్షీణ దశలోనే ఉందని అభిప్రాయపడ్డాడు.
అధికార వ్యతిరేకత
నిజానికి 2016 తరువాత సౌరాష్ట్రలో అధికార బీజేపీపై వ్యతిరేకత ప్రబలింది. ఇక్కడ సాంప్రదాయ వ్యవసాయదారులు ఎక్కువ. సౌరాష్ట్రలో సంభవించిన కరువులు, పాటిదార్ ఉద్యమం తరువాత బీజేపీ బలహీనపడింది. అందుకే నిదర్శనమే 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందింది. ఈ దెబ్బతో బీజేపీ తన లోపాలను గుర్తించి సరిచేసుకోగలిగింది. 2021 లో రాష్ట్ర ప్రభుత్వం, రైతులను ఆదుకునేందుకు రూ. 600 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులను మాఫీ చేసింది. 2022 లో దాదాపు 100 నర్మదా ఉప కాల్వలకు నీళ్లు వదిలారు. వీటి వల్ల కరువు పీడిత నీరు అందించింది. ఫలితంగా ఇక్కడ జరిగిన వ్యవసాయ మార్కెట్ లో బీజేపీ మెజారీటీ సీట్లు సాధించింది.
బీజేపీ ఆందోళన చెందట్లేదు
"సౌరాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ కు పట్టు ఉండవచ్చు. కానీ బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు పడతాయో లేదో" అని మాజీ ప్రొఫెసర్ రాజకీయ విశ్లేషకుడు హేమంత్ షా అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో పెద్దగా చెప్పుకునే సమస్యలు లేవు. బీజేపీ వ్యతిరేక పవనాలు కూడా ఎక్కువగా లేవని ఆయన విశ్లేషించారు. కాంగ్రెస్ కు ఇప్పటికే ఆప్ కు భావ్ నగర్ సీటు ను కేటాయించింది. ఇక్కడ శక్తి సిన్హ్ గోహిల్ కు మంచి పట్టు ఉంది.
అప్పట్లో కాంగ్రెస్ బలం పుంజుకుంది.
కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యాక, 2002 నాటి ఉప ఎన్నికల్లో రాజ్ కోట్ 2 అసెంబ్లీ స్థానం నుంచి నరేంద్ర మోదీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత బీజేపీ అర్భన్ ప్రాంతాల్లో తన ప్రాభావాన్ని పెంచుకుంది. అయితే ఇదే సమయంలో సౌరాష్ట్రలో మాత్రం వెనకంజ వేసింది. ఇక్కడ వేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ బలం కొద్దికొద్దిగా పెరిగింది ఇదే సమయంలో. కానీ దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయింది.
సౌరాష్ట్రలో ఎక్కువ భాగం ఓబీసీల కింద ఉన్నప్పటికీ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ భిన్నమని రాజకీయ విశ్లేషకుడు జానీ అంటున్నారు. పాటిదార్, కోలీ, దర్భార్ , క్షత్రియ, వాఘర్ వంటి కమ్యూనిటీలు ఉన్న వాటి మధ్య స్థాయి బేధాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఇక్కడ హిందూ కులాంతర ఏకీకరణను బీజేపీ కూడా తీసుకురాలేకపోయిందని అంటున్నారు. ఇక్కడ కులాల మధ్య సమతుల్యత సాధిస్తేనే గెలుపు గుర్రం ఎక్కవచ్చని చరిత్ర చెబుతున్న సత్యం


Read More
Next Story