హోటళ్ల రాజకీయాలు ఎందుకు చేస్తున్నావ్? షిండేను ఎగతాళి చేసిన రౌత్
x
సంజయ్ రౌత్

హోటళ్ల రాజకీయాలు ఎందుకు చేస్తున్నావ్? షిండేను ఎగతాళి చేసిన రౌత్

బీజేపీని చీల్చే కుట్రకు షిండే పాల్పడుతున్నారని ఆరోపణ


బీఎంసీ ఎన్నికల్లో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన గ్రూప్ తన ఎన్నికైన కార్పొరేటర్లలో హోటళ్లకు తరలించడాన్ని సంజయ్ రౌత్ ఎగతాళి చేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవికి ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ అధికారం దక్కలేదని, ఎవరికి మేయర్ పదవి స్వంతంగా సాధించలేదని అన్నారు.

దేశంలోని అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ లో ఎన్నికైన వారికి పనితీరు గురించి అవగాహన కల్పించడానికి ఓరియంటల్ వర్క్ షాప్ కోసం శివసేన(షిండే వర్గం) తన 29 మంది సభ్యులను ముంబైలోని ఒక హోటల్ కు తరలించింది.
మహాయుతి మేయర్ పదవిని పొందడానికి బీజేపీ తన వ్యూహాన్ని రూపొందించడానికి శివసేన గెలుచుకున్న సీట్లు కీలకమైనవి కావడంతో షిండే గ్రూప్ ఈ చర్య తీసుకుంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ- షిండే నేతృత్వంలోని శివసేన కూటమి 227 మంది సభ్యులున్న బీఎంసీలో వరుసగా 89,29 స్థానాలు గెలుచుకున్నాయి. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) 65 స్థానాలు గెలుచుకుంది. దాని మిత్ర పక్షం ఎంఎన్ఎస్ ఆరు సీట్లు గెలుచుకుంది.
ఎవరికి భయం పట్టుకుంది?
‘‘షిండే ఇప్పుడు తన కార్పొరేటర్లను ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం బీజేపీ కూడా తన కార్పొరేటర్లను సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని యోచిస్తోంది.
ఎవరికి ఎవరూ భయపడుతున్నారు? మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను మార్చడానికి చూస్తున్నారు’’ అని రౌత్ విలేకరులతో అన్నారు.
మోదీ, ఫడ్నవీస్ పై విమర్శలు..
కాంగ్రెస్ పుట్టిన నగరంలో బీజేపీ దానిని ఓడించిందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ చరిత్రను విస్మరించారని ఆరోపించారు. గత 25 సంవత్సరాలుగా శివసేన ముంబైని నియంత్రించిందని, కాంగ్రెస్ ముంబై రాజకీయాల్లో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాటం సమయంలో ముంబైలో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. క్విట్ ఇండియా ఉద్యమం ఇక్కడే మొదలైందని రాజ్యసభ సభ్యుడు గుర్తు చేసుకున్నాడు. భారత్ లోని కీలక చరిత్రలో బీజేపీ అసలు ఉనికిలో లేదని చెప్పారు.
బీఎంసీలో ప్రతిపక్షంలో కూర్చోవాలని శివసేన(యూబీటీ) నిర్ణయించుకుందా? అని సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాంటి నిర్ణయం తాము తీసుకోలేదని, రాజకీయాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ‘‘మేము వాటిని ఆస్వాదిస్తున్నాము’’ అని చమత్కరించారు.
దావోస్ లో ముఖ్యమంత్రికి లభించిన స్వాగతం చూస్తే ఆయనే తరువాత ప్రధానమంత్రి అయ్యే మార్గంగా ఉందని చెప్పారు. మహారాష్ట్ర నాయకుడు ఆ పదవిని అధిష్టిస్తే తాను సంతోషపడతానని వివరించారు. ఉద్దవ్ ఠాక్రేతో ఫడ్నవీస్ చర్చలు జరుపుతారనే వార్తలను రౌత్ తోసిపుచ్చారు.
పొరుగున ఉన్న కళ్యాణ్- డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్(థానే) లోని బీజేపీ కార్పొరేటర్ల మధ్య చీలిక తీసుకురావడానికి ఏక్ నాథ్ షిండే ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముంబైలో కూడా ఇలాంటి చర్యలు జరగవచ్చని చెప్పారు. షిండే గతంలో హోంమంత్రి అమిత్ షా మద్దతుతో శివసేనను చీల్చారని ఆయన ఆరోపించారు.
Read More
Next Story