మహారాష్ట్ర ప్రభుత్వ కొత్త బిల్లు పౌరహక్కులను కాలరాస్తుందా?
x

మహారాష్ట్ర ప్రభుత్వ కొత్త బిల్లు పౌరహక్కులను కాలరాస్తుందా?

అర్భన్ నక్సల్స్ ను నిరోధించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై పలు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.


మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీ లో కీలక బిల్లు ప్రవేశ పెట్టింది. అర్భన్ నక్సలిజాన్ని అరికట్టడానికి అసెంబ్లీలో ‘మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు- 2024 ’ ను తీసుకొచ్చింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లు, వ్యక్తులు, సంస్థలు, 48 నిషేధిత సంస్థల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిరోధించాలని ప్రతిపాదించింది.

చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఆమోదించిన ప్రజా భద్రతా చట్టం తరహాలో నక్సల్ సంస్థలు లేదా ఇలాంటి వాటికి మద్ధతు ఇచ్చే సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ బిల్లు రూపొందించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ పదవీకాలం మరో ఆరు నెలల్లో తీరిపోనున్న తరుణంలో బిల్లు పురోగతి, తదుపరి ప్రభుత్వం ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బిల్లును ప్రవేశపెట్టిన మరుసటి రోజే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు సభ మళ్లీ సమావేశమయ్యే అవకాశం లేదు. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కొత్త బిల్లు ఏం ప్రతిపాదిస్తోంది?
బిల్లు చట్టంగా మారితే ఏదైన అనుమానిత సంస్థను చట్టవిరుద్దమైన సంస్థగా ప్రకటించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. అలాగే ఇది ఒక వ్యక్తి శిక్షించబడే నాలుగు నేరాలను నిర్దేశిస్తుంది: (i) చట్టవిరుద్ధమైన సంస్థలో సభ్యుడిగా ఉన్నందుకు, (ii) సభ్యుడు కానప్పటికీ, చట్టవిరుద్ధమైన సంస్థ కోసం నిధులను సేకరించినందుకు, (iii) నిర్వహణ లేదా నిర్వహణలో సాయం కోసం చట్టవిరుద్ధమైన సంస్థల ఏర్పాటు , (iv) "చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు" చేసినందుకు.
ఈ నాలుగు నేరాలకు రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. చట్టవిరుద్ధ కార్యకలాపానికి సంబంధించిన నేరానికి అత్యంత కఠినమైన శిక్ష అంటే 7 సంవత్సరాల జైలు శిక్ష రూ. 5 లక్షల జరిమానాను చట్టం ప్రతిపాదించింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం నేరాలు గుర్తించదగినవి, అంటే వారెంట్ లేకుండా అరెస్టులు చేయవచ్చు. అరెస్ట్ లను నాన్ బెయిలబుల్ చేయవచ్చు.
ప్రభుత్వం ఏమంటోంది..
ప్రస్తుతం ఉన్న చట్టాలు అసమర్థమైనవి. నక్సలిజం ముప్పును ఎదుర్కోవడానికి సరిపోవు కాబట్టి సమర్థవంతమైన చట్టపరమైన మార్గాల ద్వారానే అర్భన్ నక్సలిజం రూపుమాపవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ‘‘ పట్టణాల్లో పెరుగుతున్న అర్భన్ నక్పలిజాన్ని అరికట్టడం, ముఖ్యంగా సాయుధులైన వారికి లాజిస్టిక్స్, ఆశ్రయం ఇవ్వకుండా నిరోధించడం, నక్సల్స్ సాహిత్యం వ్యాప్తి కాకుండ అడ్డుకోవడం ఈ బిల్లు గురించి పేర్కొంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు సిద్ధాంతాన్ని ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, సాధారణ ప్రజలలో అశాంతి సృష్టించకుండా కాపాడటం వంటివి ఉన్నాయి.
బిల్లు ప్రకారం చట్టవ్యతిరేక చర్య అంటే ఏమిటి?
మహారాష్ట్ర బిల్లు కింద రాసిన లేదా మాట్లాడే క్రింది చర్యలు చట్టవిరుద్ధమైనవి ఉన్నాయి:
“(i) పబ్లిక్ ఆర్డర్, శాంతి- ప్రశాంతతకు ఇది ప్రమాదం లేదా ముప్పుగా ఉండటం లేదా
(ii) పబ్లిక్ ఆర్డర్ నిర్వహణలో ఇవి జోక్యం చేసుకుంటాయి లేదా అంతరాయం కలిగిస్తుందని భావించినప్పుడు; లేదా
(iii) చట్టం లేదా దానిచే స్థాపించబడిన సంస్థలు, సిబ్బంది పరిపాలనలో జోక్యం చేసుకోవడం, లేదా
iv) ప్రభుత్వ సేవకుడు, బలగాల చట్టబద్ధమైన అధికారాలను అమలు చేయడంలో అవరోధాలు కల్పించడం లేదా
(v) హింసకు పాల్పడడం లేదా ప్రచారం చేయడం, హింసాత్మక చర్యలు, విధ్వంసం చేయడం లేదా ప్రజల్లో భయం కలిగించడం, భయాన్ని కలిగించే ఇతర చర్యలు, లేదా ప్రేరేపించడం లేదా ప్రోత్సహించడం, తుపాకీలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర పరికరాలను ఉపయోగించడం లేదా రైలు, రహదారి, గాలి లేదా నీటి ద్వారా కమ్యూనికేషన్‌లకు అంతరాయం కలిగించడం ; లేదా
(vi) చట్టం, దాని సంస్థలకు అవిధేయతను ప్రోత్సహించడం లేదా బోధించడం; లేదా
(vii) పైన పేర్కొన్న ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి డబ్బు లేదా వస్తువులను సేకరించడం…”
నిబంధనలపై అభ్యంతరాలు ఎందుకు?
బిల్లులోని నిబంధనలు "కఠినంగా" ఉన్నాయని వివిధ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. వాటితో పాటు దాని విస్తృత నిర్వచనాలపై కూడా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ బిల్లు నిరసనలను మూటగట్టుకోవడానికి తప్ప మరొకటి కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) ఈ బిల్లు "రాజ్యాంగ విరుద్ధమైనది, అసమ్మతిని అణచి వేయడానికే తీసుకొచ్చారని విమర్శించింది" అని పేర్కొంది. ప్రతిపాదిత చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. "అర్బన్ నక్సల్" అంటే విస్తృత, వివరణ లేని లేబుల్ లో నిర్వచించారని పేర్కొంది. సాధారణ పౌరులను సైతం ఎలాంటి అసమ్మతి వ్యక్తం చేయకుండా చట్టం చేశారని విమర్శించింది.
“ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, అసమ్మతి వ్యక్తం చేసే పౌరులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థుల నేరాలను అణచి వేయడానికే ప్రయత్నిస్తుందని పీయూసీఎల్ పేర్కొంది.
బిల్లు ముసాయిదా ప్రజల పరిశీలన లేదా అభ్యంతరాల కోసం అందుబాటులోకి తీసుకురాలేదు. న్యాయనిపుణులు పరిశీలించలేదని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టడాన్ని పీయూసీఎల్ తప్పుపట్టింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) వంటి ప్రస్తుత చట్టాలు ఇప్పటికే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఉగ్రవాదాన్ని పరిష్కరిస్తున్నాయని సంస్థ నొక్కి చెప్పింది.
ఈ కొత్త బిల్లును హింసాత్మక లేదా తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా కాకుండా రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా నిరసనలు, ప్రజా ఉద్యమాలు, పౌర సమాజం, మానవ హక్కుల కార్యకర్తలను అణచివేయడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోందని పీయూసీఎల్ వ్యాఖ్యానించింది.
Read More
Next Story