ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి పోలీసు కమిషనర్‌ను ఏమని కోరారు?
x

ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి పోలీసు కమిషనర్‌ను ఏమని కోరారు?

ఢిల్లీలో తాగునీటి కొరతకు కారణమేంటి? ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఎందుకు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. అందులో ఆమె ఏం కోరారు?


ఢిల్లీ జలమంత్రిత్వశాఖ మంత్రి అతిషి ఆదివారం (జూన్ 16) పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. దేశ రాజధానిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో.. రాబోయే 15 రోజుల పాటు ప్రధాన పైప్‌లైన్‌ల వద్ద పోలీసులను భద్రతగా ఉంచాలని అభ్యర్థించారు.

‘నీటి కొరత కారణంగా యమునా నదిలో నీటి ఉత్పత్తి దాదాపు 70 ఎంజిడిలకు పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. సోనియా విహార్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ నుంచి దక్షిణ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌లో పెద్ద లీకేజీని పెట్రోలింగ్ బృందం కనిపెట్టింది. ఎవరో కావాలని పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులో ప్రతినీటి బొట్టు విలువైనది.’ ఆని లేఖలో పేర్కొన్నారు అతిషి.

గతంలో ఖాళీ మట్టి కుండలతో నిరసన..

దేశ రాజధానిలో నీటి కొరత అంశం గతంలో రాజకీయ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నాయకులు ఢిల్లీ వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ ఆధర్వంలో పార్టీ కార్యకర్తలు తలపై ఖాళీ మట్టి కుండలు పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత కుండలను పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిపై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా ఈ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కూడా.

కాగా ఢిల్లీలో నీటి ఎద్దడిపై హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమని అతిషి గతంలో ఆరోపించారు. యమునా నదిలో నీరు తక్కువగా ఉండడం వల్ల నీటి కొరత తలెత్తిందని ఆమె పేర్కొన్నారు. హర్యానా ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి రావాల్సిన నీటి కోటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Read More
Next Story