జమ్మూ కాశ్మీర్‌లో సీట్ షేరింగ్‌పై ఒమర్ అబ్దుల్లా ఏమన్నారు?
జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు సెప్టెంబర్ 18 (24 స్థానాలకు), 25న (26 స్థానాలకు), అక్టోబర్ 1న (40 స్థానాలకు) పోలింగ్ నిర్వహించనున్నారు.
భారత ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం (ఆగస్టు 16) జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 , అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. హర్యానాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న జరగనుంది.
జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు సెప్టెంబర్ 18 (24 స్థానాలకు), 25న (26 స్థానాలకు), అక్టోబర్ 1న (40 స్థానాలకు) పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు.
ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధమైంది. పొత్తుకు రాహుల్ గాంధీ సిద్ధంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే ప్రకటించారు. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా కూడా శుక్రవారం (ఆగస్టు 23) దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైంది. ఎవరెవరు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్నది చర్చించాల్సి ఉంది. ఇప్పటివరకు 90 సీట్లలో ఏకాభిప్రాయం కుదిరింది. కొన్ని స్థానాల్లో మేం మొండిగా ఉన్నాం. మరికొన్నింటిపై కాంగ్రెస్ పట్టుగా ఉంది. ఈరోజు కూడా సమావేశాలు జరుగుతాయి.’ అని దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో అబ్దుల్లా విలేఖరులతో అన్నారు.
ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు NC, కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల కూటమిని గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.