
BJP కంటే RJDకే ఎక్కువ ఓట్లు.. కానీ..
మొత్తం మీద ఆర్జేడీకి 1,15,46,055 ఓట్లు పడగా.. బీజేపీ 1,00,81,143 ఓట్లు పడ్డాయి. తేడా 15 లక్షల ఓట్లు..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Assembly Polls) వెలువడ్డాయి. ఎన్డీఏ( NDA) కూటమికి అధికారం దక్కింది. కాంగ్రెస్‌తో కలిసి మహాఘట్‌బంధన్ (Mahagathbandhan)కి నాయకత్వం వహించిన రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పేవలమైన ప్రదర్శన ఇచ్చింది. సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్డేజీ 143 స్థానాల్లో పోటీచేసి కేవలం 25 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. సీట్ల సంఖ్య నిరాశపరిచినా RJDకి ఓట్ షేరింగ్ మాత్రం కాస్త ఓరటనిచ్చింది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే అత్యధిక ఓట్ షేర్ నమోదు చేసింది.
కాస్త ఊరట..
ఆర్జేడీ మొత్తం ఓట్లలో 23 శాతం ఓట్లను సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే (23.11 శాతం) కాస్త తగ్గింది. అదే సమయంలో బీజేపీ ఓట్ షేరింగ్ గత ఎన్నికల కంటే (19.46 శాతం) ఒక శాతానికి (20.07) పెరిగింది. మొత్తంమీద ఆర్జేడీకి 1,15,46,055 ఓట్లు వచ్చాయి, బీజేపీ 1,00,81,143 ఓట్లు సాధించింది.
భాగస్వాములది కూడా పేలవ ప్రదర్శనే..
కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీచేసి ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచింది. సీపీఐ(ఎంఎల్) రెండు, సీపీఐ(ఎం) ఒక సీటు దక్కించుకుంది. సీపీఐ ఒక్కటి కూడా గెలువలేదు. దీంతో కూటమి మొత్తం గెలిచిన సీట్లు 35 మాత్రమే.
మరోవైపు..ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకుంది. వాటిలో బీజేపీ 89, JD(U) 85, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 19, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) ఐదు స్థానాలను గెలుచుకుంది. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా నాలుగు స్థానాలను దక్కించుకుంది.

