
మోటార్ వాహనాల చట్టాన్ని కేంద్రం మరోసారి సవరించబోతుందా?
గతంలో చట్టాన్ని అమలు చేయడానికి నిరాకరించిన రాష్ట్రాలు
మోటార్ వాహానాల చట్టాన్ని మరోసారి సవరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా బీమా లేని వాహనాలు, సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ ల లభించకుండా కఠినమైన నియమాలతో సహ మోటార్ వాహనాల చట్టంలో ప్రతిపాదిత మార్పులపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.
మోటార్ వాహనాల చట్టాలకు ఇంతకుముందు ఒకసారి చేసిన సవరణల వల్ల బీజేపీయేతర రాష్ట్రాల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది.
ప్రతిపాదిత నిబంధనలపై అభిప్రాయాలు తెలపాలని, మార్పులు ఆమోదం వచ్చే ముందు రాజ్యాంగపరమైన సమస్యలను పరిష్కరించుకోవాలని బెంగాల్ సహ దేశంలోని ఇతర రాష్ట్రాలలో కేంద్రం ప్రత్యేకంగా లేఖలు రాసినట్లు తెలిసింది.
రాజ్యాంగం ప్రకారం రవాణా అంశంపై ఇటు కేంద్రానికి అటూ రాష్ట్రాలకు కేంద్రం అధికారం కల్పించింది. అయితే చట్టం అమలు మాత్రం రాష్ట్రాలే చేస్తుంటాయి.
2019 మోటార్ వాహానాల చట్టం సవరణ నుంచి నేర్చుకున్న అంశాల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రాలను సంప్రదిస్తున్నారు. ఇంతకుముందు అనేక రాష్ట్రాలు ఈ నిబంధనలు అమలు చేయడానికి నిరాకరించాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు బాగా పెంచారు. 2019 నాటి సవరణలను బెంగాల్ వ్యతిరేకించింది.
మమతా బెనర్జీ వీటిని అమలు చేసేది లేదని ప్రకటించారు. జరిమానాల వల్ల సాధారణ పౌరులపై తీవ్రంగా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. చట్టంలోని కొన్ని భాగాలను కఠినంగా ఉన్నాయన్నారు.
ఇక్కడ రాష్ట్ర చట్టాలే అమలు చేస్తున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ఉండేవాటికి భారీ జరిమానాలు పాత చట్టంలో ఉన్నాయి. కఠినమైన జరిమానాలు విధిస్తున్నప్పటికీ రోడ్డు భద్రతా సరైన పద్దతిలో లేవు.
గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక 2023 ప్రకారం.. ప్రమాదాలు, మరణాల విషయంలో బెంగాల్ మొదటి పది రాష్ట్రాలలో లేదు.
2024లో కోల్ కతలో 188 ప్రమాదాలు జరిగాయి. 191 రోడ్డు మరణాలు నమోదు అయ్యాయి. ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ సహ భారత్ లోని ఆరు అతిపెద్ద మెట్రో ప్రాంతాలలో అత్యల్పంగా కోల్ కతలోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిప్రకారం భారీ జరిమానాల వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించలేము.
‘‘ప్రతిచోట భారీ జరిమానాలు విధించడం సమస్యకు పరిష్కారం కాదు. దీనివల్ల పౌరులు బాగా నష్టపోతున్నారు. ప్రమాదాలు తక్కువగా ఉండే గ్రామీణ, చిన్న పట్టణాలలో’’ అని రాష్ట్ర రవాణా మంత్రి స్నేహాసిస్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు సంప్రదింపుల చర్యలు తీసుకున్నారని చెప్పారు.
బీమా లేని వాహనాల నియంత్రణ
కొత్త సవరణలో బీమా లేని వాహనాల నియంత్రించే నిబంధనలు కఠినంగా చేయాలని అనుకుంటున్నారు. ఇది దేశంలో ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలలో అధికంగా ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం పోలీసులకు రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్లు లేని వాహనాలను సీజ్ చేసే అధికారం ఉన్నప్పటికీ బీమా లేనప్పుడూ ఇవి పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల పునరావృత నేరాలకు కూడా భారీగా జరిమానా విధిస్తున్నారు.
ఇది వాహనాలదారులను నిరోధించడంలో విఫలమైందని, రోడ్లపై బీమాలేని వాహనాలు నిరంతరం అధిక స్థాయిలో ఉండటానికి దోహదపడిందని కేంద్రం వాదిస్తోంది. దీనిని పరిష్కరించడానికి చెల్లుబాటు అయ్యే బీమా కవర్ లేకుండా దొరికిన వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు అధికారం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది.
ఏకరీతి జరిమానా వాహనం బీమా ప్రీమియంతో అనుసంధానించబడిన వేరియబుల్ పెనాల్టీతో భర్తీ చేయడాన్ని కూడా ఇది పరిశీలిస్తోంది. ఈ చర్య నిబంధనలను పాటించకపోవడం వల్ల కలిగే ఖర్చును గణనీయంగా పెంచుతుంది.
ఈ వారం ప్రారంభంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర రవాణా మంత్రులు, రవాణా కమిషనర్లతో ఈ ప్రతిపాదనలను పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు లిఖిత పూర్వక సమాచారాలు కూడా పంపారు.
బీమా లేని వాహనాలు సకాలంలో ప్రమాద పరిహారం అందజేయడానికి ప్రధాన అడ్డంకిగా, రహదారి భద్రతకు విస్తృత ప్రమాదంగా జాతీయ రహదారి భద్రతా మండలి సిఫార్సులను అనుసరించి ఈ చొరవ తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రోడ్డు ప్రమాదాల బాధితులు తరుచుగా నష్టపరిహరంలో జాప్యం తో పాటు వివాదాలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. ప్రతిపాదిత అమలు అధికారాలు, జరిమానా నిర్మాణం రాజ్యాంగ సవాళ్లను ఎదుర్కోగలదా లేదా ప్రస్తుత రాష్ట్ర చట్టాలతో విభేదిస్తుందా అని ప్రత్యేకంగా అంచనా వేయమని రాష్ట్రాలను కోరారు.
బీమా, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలలో మార్పులు..
ముసాయిదా సవరణలలో బీమా ధర, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు విస్తృత మార్పులు ఉన్నాయి. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 147 ను సవరించడం ముఖ్యమైన ప్రతిపాదన.
దీని ద్వారా బీమా నియంత్రణ సంస్థ, భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ వాహనం వయస్సు, యజమాని ట్రాఫిక్ ఉల్లంఘన చరిత్ర వంటి అదనపు పారామితులను ఉపయోగించి ప్రాథమిక బీమా ప్రీమియంలను నిర్ణయించవచ్చు.
ప్రస్తుతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభుత్వం ఐఆర్డీఐ సంప్రదించి నిర్ణయిస్తుంది. ప్రతిపాదితన మార్పు ఆధారిత ధరలను మరింత కచ్చితంగా నిర్ణయించడంలో సహాయపడుతుందని, అదే సమయంలో సురక్షితమైన డ్రైవింగ్ ను ప్రొత్సహిస్తుందని వారు అన్నారు.
ఇతర ప్రతిపాదిత మార్పులు..
ఇతర ప్రతిపాదిత మార్పులలో వాహన యజమానులు, డ్రైవర్ల, వ్యక్తిగత వాహనాలలో ప్రయాణించేవారిని స్పష్టంగా చేర్చడానికి తప్పనిసరి థర్డ్ పార్టీ బీమా కవరేజీని విస్తరించడం ఉన్నాయి.
వాణిజ్య డ్రైవర్లలో రోడ్డు భద్రత ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా భారీ వాహనాలను నడపడానికి గ్రేడెడ్ అర్హత ప్రమాణాలను కూడా కేంద్రం పరిశీలిస్తోంది.
వైద్య ఫిట్ నెస్ సర్టిఫికేషన్ అవసరమయ్యే వయస్సు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతుందని మారుతున్న జనాభా ఆరోగ్య విధానాలకు అనుగుణంగా ఈ నియమాన్ని సమలేఖనం చేస్తుందని అధికారులు సమాచారం ఇచ్చారు.
రాష్ట్రాలను సమన్వయం చేసుకోవడం..
రాష్ట్రాలు కొత్త నిబంధనలను అమలు చేయడానికి వ్యతిరేకిస్తే అమల్లో ఎదురయ్యే అడ్డంకులను నివారించడానికి ముసాయిదాను తుదిరూపం ఇచ్చి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
‘‘కేంద్ర- రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టంభనకు దారితీయకుండా రోడ్డు భద్రతను మెరుగుపరచడమే దీని ఉద్దేశం’’ అని చర్చలతో పరిచయం ఉన్న ఒక అధికారి అన్నారు. ‘‘కేంద్రం రాష్ట్రాలను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి రాజకీయంగా దృఢంగా ఉండే రాష్ట్రాలను సమన్వంయ చేసుకోగలదా లేదా అనేది ఈ ప్రతిపాదిత సంస్కరణల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది’’ అని మరొక అధికారి చమత్కరించారు.
Next Story

