ఈ తుపానుకు మిగ్‌జాం పేరెందుకు పెట్టారు!

ఈ పేరెవరు పెట్టారు? ఇంతకీ దానర్థం ఏమిటో!!


ఈ తుపానుకు మిగ్‌జాం పేరెందుకు పెట్టారు!
x
తుఫాన్‌ అలజడి

పిల్లలకు పేర్లు పెట్టడం తెలుసు, వస్తువులకు పేర్లుండడం తెలుసు. ఇలా ప్రతి దానికీ ఏదో పేరుంటుంది. మరి తుపాన్లకు ఎందుకు? వాన కురిసి పోయే దానికి పేర్లేమిటీ? వాటి మతలబు ఏమిటో.. ప్రస్తుతం దక్షిణ కోస్తాను వణికిస్తున్న తుపానుకు మిచాంగ్‌ అని పేరు పెట్టారు. ఈ తుపాను బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును వణికిస్తోంది.

ఏమిటీ మిచాంగ్‌..
తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం సరిగ్గా 23 ఏళ్ల కిందట మొదలైంది. తుపాన్లకు కూడా పేరు పెట్టాలని 2000వ సంవత్సరంలో ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ పసిఫిక్‌’, ప్రపంచ వాతావరణ సంస్థలు కలిసి ప్రతిపాదించాయి. చర్చోప చర్చలు జరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2004లో ఈ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఇప్పటి తుపానుకు మిచాంగ్‌ అని పేరు పెట్టారు. ఈ పేరును ఓనాటి బర్మ ఈనాటి మయన్మార్‌ ఈ పేరును సూచించింది. దీనర్థం ఏమిటంటే ’దఢత్వం లేదా బలం’ అని ఎదురొడ్డి నిలబడడం అని కూడా చెబుతున్నారు. ఈ ఏడాది హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఆరో తుపాను కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన నాలుగోది.
పేరెందుకు పెడతారు?
తుపాన్లకు పేరు పెట్టడం వెనుక చాలా ప్రయోజనాలున్నాయట. హెచ్చరికలకు ఉపయోగపడుతుంది. ఆ తుపాను నష్టం గురించి చర్చించేందుకూ, పరిశోధకులు అధ్యయనం చేసేందుకు సులువుగా ఉంటుంది. అయితే గంటకు కనీసం 61 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తుపాన్లు వచ్చినప్పుడు పేర్లు పెడతారు. గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణ హుద్‌హుద్‌ తుపాను వచ్చి పోయి చాలా ఏళ్లు అయినా ఆ పేరు ఇంకా గుర్తుంది కదా.
W
ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌ దేశాలూ ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్‌ తుపాన్లకు ముందే పేర్లను నిర్ణయిస్తుంది. ఈ పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. జాబితాలో మొదటిపేరు బంగ్లాదేశ్‌ కాగా, భారత్‌ది రెండోపేరు. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు పేర్లను భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటిస్తుంది. భారత్‌ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తుపాన్లకు సామాన్య ప్రజలూ పేరు సూచించొచ్చు. ఈ పేర్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఆసక్తి ఉన్నవారు దిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేరు సూచించవచ్చు.


Next Story