పశ్చిమబెంగాల్‌లో దీదీకి కొత్త  తలనొప్పి..
x

పశ్చిమబెంగాల్‌లో దీదీకి కొత్త తలనొప్పి..

మమతా 2011లో ముఖ్యమంత్రి అయినపుడు ఆమెకు, ప్రజలకు ముఖ్యంగా మహిళా ఓటర్లకు మధ్య ఉన్న బలమైన భావోద్వేగ సంబంధం ఇప్పుడు బలహీనపడుతున్నట్లు కనిపిస్తుంది.


మమతా బెనర్జీ 2011లో తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు.. ఆమెకు, ప్రజలకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని మహిళా ఓటర్లకు మధ్య ఉన్న బలమైన భావోద్వేగ సంబంధం ఇప్పుడు బలహీనపడుతున్నట్లు కనిపిస్తుంది.

కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు 9నట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతో మమత ఇకముందు రాజకీయ సవాళ్లు ఎదుర్కోవాల్సిందేనన్న అనుమానం కలుగుతోంది. ఒకప్పుడు బలమైన సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా పోరాడి, సంపాదించుకున్న నమ్మకాన్ని ఆమె ఇప్పుడు నిలుపుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

ట్రైనీ డాక్టర్‌పై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆసుప్రతుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాలు మమత ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

జనం అల్టిమేటం ఇచ్చారా?

ట్రైనీ డాక్టర్ హత్యోదంతం తర్వాత పశ్చిమ బెంగాల్ జనం కోరుతున్నది తమను రక్షణ కల్పించాలనో.. విచారణ సరిగా జరిపించాలనో కాదు. మెరుగైన పాలన కావాలని కోరుకుంటున్నారు. అసహనానికి గురైన ప్రజానీకం యువ వైద్యులకు, నగరంలోని ఆర్‌జి కర్, ఇతర బోధనా ఆసుపత్రుల వద్ద సమ్మెకు దిగిన సీనియర్లకు పూర్తి మద్దతునిచ్చారని మమతకు కూడా తెలుసు. ఆగస్ట్ 14 రాత్రి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోకి ప్రవేశించి ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది సాధారణ జనం కాదన్న విషయం మమతకూ తెలుసు. కళ్లముందు విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర మమత ప్రభుత్వంపై వేలెత్తి చూపుతోంది. ఈ వైఫల్యాలన్నింటికీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

భట్టాచార్య ప్రభుత్వాన్ని కుదిపేసిన రెహమాన్ ఘటన..

ఇప్పుడు రిజ్వానూర్ రెహమాన్ ఘటనను మమత గుర్తుచేసుకోవాలి. హిందూ పారిశ్రామిక వేత్త కూతురుని పెళ్లి చేసుకున్నందుకు రెహమాన్ హత్యకు గురయ్యాడు. రిజ్వానూర్ హత్యోదంతంతో జనం వీధుల్లోకి వచ్చి సీఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 2007లో జరిగిన ఈ ఘటనతో అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రతిష్ట దెబ్బతీంది. దీంతో ఆయన ఐదుగురు పోలీసు అధికారులను తొలగించవలసి వచ్చింది. ప్రజానీకం, లెఫ్ట్ ఫ్రంట్ మధ్య చీలిక ఇక్కడే మొదలైంది. గతంలో సుదీర్ఘకాలం పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏలిన లెఫ్ట్ ఫ్రంట్ పతకం ప్రారంభమైంది.

“మా-మతి-మనుష్”

మమత రాజకీయ విజయానికి మహిళలే కీలకం. 2008లో సీపీఐ(ఎం)కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆమె నినాదం “మా-మతి-మనుష్” - మహిళలు, భూమి, ప్రజలు. 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్యోదంతం మమత రాజకీయ సవాళ్లను విసిరే అవకాశం ఉంది. జనం మనస్సుల్లోంచి అధికార వ్యతిరేకతను దూరం చేస్తే తప్ప మమత గట్టెక్కె పరిస్థితులు కనిపించడం లేదు.

(ఫెడరల్ స్పెక్ట్రమ్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితకు చెందినవి. ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు.)

Read More
Next Story