ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలేవి? భారత్ స్థానమెంత?
x

ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలేవి? భారత్ స్థానమెంత?

ప్రపంచ దేశాల్లో అవినీతి స్థాయిని లెక్కగట్టింది సీపీఐ (Corruption Perceptions Index ). స్కోర్ ఎక్కువగా ఉన్నవి తక్కువ అవినీతి ఉన్న దేశాలు. అవేంటో పరిశీలిద్దాం..


Click the Play button to hear this message in audio format

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన 2024 అవినీతి అంచనా సూచిక CPI (Corruption Perceptions Index ) ప్రకారం.. ప్రపంచంలో అతి తక్కువ అవినీతి దేశం డెన్మార్క్. ఇక రెండు, మూడు స్థానాల్లో ఫిన్‌లాండ్, సింగపూర్ ఉన్నాయి. మరోవైపు సౌత్ సూడాన్ అత్యంత అవినీతిమయ దేశంగా నిలిచింది. ఈ నివేదికలో భారత స్థానాన్ని కూడా వెల్లడించారు. ఇండియాకు 96వ ర్యాంక్‌కు పడిపోయింది.

2024 ర్యాంకింగ్స్‌లో..డెన్మార్క్ అత్యల్ప అవినీతి దేశంగా 90/100 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఫిన్‌లాండ్ (88/100), ఆపై సింగపూర్ (84/100), న్యూజిలాండ్ (83/100), లక్సెంబర్గ్ (81/100) ఉన్నాయి. ఇండియా 2023లో 93వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 96వ స్థానానికి పడిపోయింది. భారత్ స్కోర్ 38/100 కాగా.. గాంబియా, మాల్దీవులది కూడా ఇదే స్కోర్‌. పాకిస్థాన్ 135వ స్థానంలో (స్కోర్ 27/100), బంగ్లాదేశ్, శ్రీలంక 151వ స్థానం (స్కోర్ 21/100)లో నిలిచింది.

2023లో భారత్ స్కోర్ 39 ఉండగా..ఈసారి అది 38కి తగ్గింది. 2020 నుంచి 2022 వరకు భారత్ స్కోర్ 40.

సౌత్ సూడాన్ అత్యంత అవినీతిమయ దేశం..

8 పాయింట్ల స్కోర్‌తో 180వ స్థానంలో అత్యధిక అవినీతి దేశంగా నిలిచింది సౌత్ సూడాన్. ఇక సిరియా (12), వెనిజులా (10), సోమాలియా (9) చివరి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

2024 అవినీతి అంచనా సూచిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అవినీతి పెద్ద సమస్యగా తయారైంది. అయితే చాలా దేశాల్లో కాస్త అవినీతి తగ్గినా కొన్ని దేశాలు ఇంకా మెరుగుదల కనిపించాల్సిఉంది.

స్కోర్ ఎలా ఇస్తారు?

“ప్రతి దేశ స్కోర్ కనీసం 3 డేటాల ఆధారంగా రూపొందిస్తారు. అవినీతి అంచనా సర్వేలు, విశ్లేషణలు, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల నుంచి కూడా డేటా తీసుకుంటాం” అని సీపీఐ తెలిపింది.

నివేదిక ప్రకారం.. 2012 నుంచి 32 దేశాలు తమ అవినీతి స్థాయిని గణనీయంగా తగ్గించుకున్నాయి. గ్లోబల్ సరాసరి స్కోర్ 43గా ఉంది. మూడింట రెండు వంతుల దేశాలు 50 కంటే తక్కువ స్కోర్ సాధించాయి.” అని నివేదిక పేర్కొంది.

‘తూర్పు యూరప్, మధ్య ఆసియాలో ఎక్కువ అవినీతి’

“తూర్పు యూరప్, మధ్య ఆసియాలో విస్తృత అవినీతి కొనసాగుతోంది” అని సీపీఐ తెలిపింది. రష్యా 154వ స్థానంలో (22 స్కోర్) ఉండటం గమనార్హం. “ఇక్కడ భారీగా అవినీతి, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనం కారణంగా నియంత్రణ వ్యవస్థ గాడితప్పింది.

రష్యా (22) స్థానం కూడా పడిపోయింది. ఉక్రెయిన్‌పై దాడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే స్వరాలను అణచివేసి, సైనిక అవసరాలకు వనరులను మళ్లించి, స్వతంత్ర గొంతుకలను అణచివేసింది” అని నివేదిక పేర్కొంది.

“అవినీతి అభివృద్ధిని అడ్డుకోవడమే కాదు – ప్రజాస్వామ్యం క్షీణించడానికి, అస్థిరత పెరగడానికి, మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రధాన కారణమైంది. అంతర్జాతీయ సమాజం, ప్రతి దేశం దీన్ని అరికట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

“అధికారం కేంద్రీకరణను అడ్డుకోవడం, శాంతి, స్వేచ్ఛను కాపాడుకోవడం చాలా అవసరం. 2024 అవినీతి అంచనా సూచిక వెలుగులోకి తెచ్చిన ప్రమాదకర ధోరణులు.. పరిష్కారానికి కఠిన చర్యలు అవసరమని సూచిస్తున్నాయి” అని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ చైర్ ఫ్రాంకోయిస్ వాలేరియన్ పేర్కొన్నారు.

ర్యాంకుల వారీగా పరిశీలిస్తే..

టాప్ 10లో ఉన్న తక్కువ అవినీతిమయ దేశాల జాబితా..

(స్కోర్ ఎక్కువగా ఉన్నవి ..తక్కువ అవినీతి దేశాలు)

Rank1: Denmark (Score: 90)

Rank 2: Finland (Score: 88)

Rank 3: Singapore (Score:84)

Rank 4: New Zealand (Score:83)

Rank 5: Luxembourg (Score:81)

Rank 5: Norway (Score: 81)

Rank 5: Switzerland(Score:81)

Rank 8: Sweden (Score:80)

Rank 9: Netherlands (Score: 78)

Rank 10: Australia (Score: 77)

===========================

టాప్ 10లో ఉన్న ఎక్కువ అవినీతిమయ దేశాల జాబితా..

(స్కోర్ తక్కువగా ఉన్నవి.. ఎక్కువ అవినీతి దేశాలు)

Rank 170: Sudan (Score: 15)

Rank 172: Nicaragua(Score: 14)

Rank 173: Equatorial Guinea(Score: 13)

Rank 173: Libya (Score: 13)

Rank 173: Yemen (Score: 13)

Rank 177: Syria (Score: 12)

Rank 178: Venezuela(Score: 10)

Rank 179: Somalia (Score: 9)

Rank 180: South Sudan (Score:8)

=============================


Read More
Next Story