సీజేఐ ఇంట్లో గణపతి పూజకు ప్రధాని హాజరుపై ప్రతిపక్షాల మండిపాటు
x

సీజేఐ ఇంట్లో గణపతి పూజకు ప్రధాని హాజరుపై ప్రతిపక్షాల మండిపాటు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో నిర్వహించిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరుకావడంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు కాషాయ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

మాకు న్యాయం జరుగుతుందా?

``రాజ్యాంగ పరిరక్షకులు ఇలా రాజకీయ నేతలను కలవడం అనుమానాలకు తావిస్తోంది'' అని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ``మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కేసు ప్రధాన న్యాయమూర్తి ముందు పెండింగ్‌లో ఉంది. ఆ కేసులో ప్రధాని కూడా ఉన్నారు. మాకు న్యాయం జరుగుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. కేసు నుంచి ఉపసంహరించుకునే అంశాన్ని సీజేఐ పరిశీలించాలి’’ అని అన్నారు. గణపతిని పూజించే ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే మోదీ ఎన్ని ఇళ్లకు వెళ్లారో తెలియడం లేదని రావత్ విమర్శించారు.

శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కూడా వ్యంగ్యగా పోస్ట్‌ చేశారు.‘‘ సరే. పండుగ తర్వాత మహారాష్ట్రలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ఉల్లంఘన కేసు విచారణను CJI పూర్తి చేస్తారని ఆశిద్దాం. ఎన్నికలు ఉన్నందున మరోరోజు వాయిదా వేయవచ్చు' అని రాశారు.

ప్రధాని మోదీ సుప్రీం న్యాయమూర్తి ఇంటికి వెళ్లడం న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు చెడు సంకేతాలను పంపుతుందన్నారు. అందుకే కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య విభజన ఉండాలి’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ రెండింటి మధ్య అధికార విభజనను ప్రధాన న్యాయమూర్తి బలహీనపరిచారని న్యాయవాది, కార్యకర్త ఇందిరా జై సింగ్ ఆరోపించారు. ‘‘సీజేఐ స్వతంత్రతపై నాకు నమ్మకం పోయింది.’’ అని పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ.. ``సుప్రీం లొంగిపోతే, దేశం నష్టపోతుంది.’’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మోదీ పర్యటన ప్రార్థనలకే పరిమితమైందని, అది మన సంస్కృతిలో భాగమని సమర్థించుకుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. బిజెపి రాజకీయ లబ్ధి కోసం పూజను ఉపయోగించుకుంటోందని స్పష్టమైందని ఆరోపించారు.

ప్రత్యర్థి శివసేన నాయకుడు మిలింద్ దేవరా మోదీ పర్యటనను సమర్థిస్తూ.. `` తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పుడు, ప్రతిపక్షాలు సుప్రీం కోర్టు విశ్వసనీయతను ప్రశంసిస్తాయి. అనుకున్నట్లు జరగనప్పుడు న్యాయపరమైన రాజీ కుదిరిందని అంటున్నారు’’ అని చురకలంటించారు.

Read More
Next Story