షర్మిలమ్మ.. చంద్రబాబు చిలకమ్మ!
x
వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్యలో సజ్జల

షర్మిలమ్మ.. చంద్రబాబు చిలకమ్మ!

సొంత అన్న జగన్ ను విమర్శించినందుకు వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డితో వైఎస్ జగన్ చెప్పించాలనుకున్న విషయాలన్నింటినీ చెప్పించారు.


ఊహించినట్టే వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. షర్మిల చెప్పిన ప్రతి మాటకు బదులిచ్చారు. పార్టీ పెట్టింది కుటుంబంలో పదవులు పంచుకోవడానికా? అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇంకో అడుగుముందుకు వేసి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే షర్మిల చదివారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలపై ఆమెకు అవగాహన లేదన్నారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలని నిలేశారు. పదవుల కోసమే అప్పట్లో జగన్‌ కోసం షర్మిల నిలబడ్డారా? అన్నారు సజ్జల. కుటుంబం పదవులు పంచుకుంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయన అసలు ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఎల్లో మీడియా స్క్రిప్ట్ అది...

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాలపై ఏమాత్రం అవ¬గాహన లేని షర్మిల.. టీడీపీ అధ్యక్షుడు చంద్ర¬బాబు, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్‌నే పోటీ ప¬రీక్షలకు విద్యార్థి సిద్ధమైనట్లుగా బట్టీ పట్టి చదు¬వుతున్నారు.


వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చిందే సోనియా..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత ఆ కుటుంబంలోని వైఎస్‌ వివేకానందరెడ్డిని మంత్రిని చేసిన సోనియా.. వైఎస్సార్‌సీపీ స్థాపించాక పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్‌ విజయమ్మపై వివేకానందరెడ్డిని పోటీ పెట్టడం ద్వారా కుటుంబాన్ని చీల్చిన విషయాన్ని జగన్‌ గుర్తుచేశారు. ఇప్పుడూ అదే రీతిలో కుటుంబాన్ని చీల్చి షర్మిలను పీసీసీ చీఫ్‌గా చేశారని జగన్‌ ఎత్తిచూపారు. ప్రజలు జగనే వైఎస్‌కు సరైన వారసుడు అనుకున్నారు కాబట్టే వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. సీఎం జగన్‌ వైఎస్సార్‌ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా సాగుతోంది.

16నెలలు జైల్లో ఉన్నా చలించని మహామనిషి...

ఆనాడు అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడూ జగన్‌ చలించలేదు. ఇలా సొంతంగా ఎదిగిన వ్యక్తి జగన్‌. జగన్‌ తండ్రి వైఎస్‌ అని చెప్పుకోవడం ఏ తండ్రికైనా గర్వకార¬ణమే. వైఎస్‌ బిడ్డగా, జగన్‌ సోదరిగా షర్మిలకు అభి¬మా¬నులు గౌరవం ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు.

ఏం అన్యాయం జరిగిందో షర్మిలే చెప్పాలి

జగన్‌ కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీని స్థాపించినప్పుడు లక్షలాది కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. త్యాగాలు చేశారు. అందరూ కష్టపడ్డారు. జగన్‌ జైలులో ఉన్న సమయంలోనే కదా షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ ఎంతో కష్టపడ్డారు. అందరికీ రకరకాల బాధ్యతలు అప్పజెప్పారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించారు. షర్మిల పాదయాత్ర చేశారు. అన్యాయం జరి¬గిందని షర్మిల అంటు¬న్నారు.

ఆమెకు ఏం అన్యా¬యం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. పదవి కోసమే ఆమె ఆరోజు జగన్‌ కోసం నిలబడ్డానని స్పష్టంగా చెప్పగలిగితే సమాధానం చెప్పొచ్చు. పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? అధికారంలో భాగస్వా¬మ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి అర్హమైన-దేనా? కుటుంబం పదవులు పంచుకొంటే ప్రజా¬స్వా¬మ్యం ఎలా అవుతుంది?

వైఎస్సార్‌టీపీ కార్యకర్తలకు షర్మిల ఏం న్యాయం చేశారు?


తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్‌టీపీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా. వారికి షర్మిల ఏం న్యాయం చేశారు? వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు? వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాష్ట్రానికి వచ్చిన షర్మిలను భుజానికెత్తుకుని మోస్తున్న ఎల్లో మీడియా.. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపులో షర్మిలకు భాగముందని ఎందుకు రాయలేదు? అప్పుడూ ఇప్పుడూ జగన్‌పై షర్మిల బాణాలు ఎక్కుపెట్టినప్పుడే వాటినే ఎల్లో మీడియా ప్రచురిస్తోంది. వైఎస్‌ మరణంపై రేవంత్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు షర్మిల ఎందకు స్పందించలేదు?

వైఎస్‌ పథకాలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు?

వైఎస్‌ పథకాలను తీసేశారని షర్మిల మాట్లాడితే ఏమనాలో అర్థం కావడంలేదు. చంద్రబాబు, రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి యజమాని) వద్ద నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి చెప్పినప్పుడు వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండక¬పోవచ్చు. అప్పట్లో వైఎస్‌ అమలుచేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా ఇప్పుడు షర్మిల లేవంటున్నారు. రైతులకు నేడు ఇస్తున్నంత భరోసా దేశంలో మరెక్కడైనా ఉందా? అసలు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ లేదంటున్నారు. తీసుకు¬న్న రైతులంతా ఏమనుకుంటారు? పాపం ఆమె తెలి¬యక ఇంత అబద్ధం మాట్లాడి ఉండొచ్చు.

మణిపూర్‌పై అప్పుడెందుకు మాట్లాడలేదు?

మణిపూర్‌ అంశం షర్మిలమ్మ వైఎస్సార్‌టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు మాట్లాడ¬లేదు? ఎందుకు పోరాడలేదు? ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్‌ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో ఆంతర్యం తెలియ¬డం¬లేదా? ఇదంతా ఆమె అనుకున్నది కాదు... చంద్ర¬¬బాబు అనుకున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్సార్‌¬సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు.

భావోద్వేగంతో స్పందించిన మాటలపై చిల్లర రాజకీయమా?

సీఎం జగన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఏదీ ఆయన హక్కు అనుకోరు. చంద్రబాబు అధికారం ఆయన హక్కు అనుకుంటాడు. చంద్రబాబు ఎప్పుడూ బాధ్యతతో అధికా¬రంలోకి రాలేదు. అందుకే ఆయన అధి¬కారంలోకి రాగానే.. మరో 50 ఏళ్ల తర్వాత ఏం చేస్తాడో ఇప్పుడే చెబుతుంటాడు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ జగన్‌కు ఉంది. ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలని గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లి దీవెనలు కోరాలని భావిస్తారు. ఆమాటల్నీ తప్పు పట్టిన వీళ్లని ఏమనాలి అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఏదైతేనేం ఏపీలో రాజకీయ మంటలు రగులుతున్నాయి. మాటలు తూలుతున్నాయి. ఎన్నికల వేళ మరెన్ని చిత్రాలను చూడాల్సివస్తుందో..

Read More
Next Story