పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల పర్యటన సందర్భంగా టీఎంసీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘించిందనే ఆరోపణలపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రపతిని టీఎంసీ అగౌరవపరిచిందనే మాటలను తోసిపుచ్చుతూ, బీజేపీ ఇది వరకూ చేసిన వాటి ఫొటో ఆధారాలను బయటపెట్టింది. దీనికి కౌంటర్ గా బీజేపీ కూడా పలు వీడియోలను వదిలిపెట్టింది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షుడు ముర్మును అగౌరవపరిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న ఆరోపించారు. దీనికి కౌంటర్ గా టీఎంసీ ఎల్ కే అద్వానీ తో పాటు మోదీ కూర్చున్నట్లు ఉన్న వీడియోను బయటకు తీసింది. ఇందులో రాష్ట్రపతి ముర్ము చేతులు కట్టుకుని నిల్చున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ కూడా మార్చి 31, 2024 నాడు అద్వానికి భారత రత్న ప్రధానం చేసిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో సమాధానం ఇచ్చింది.
రాష్ట్రపతిని ఎవరూ అవమానించారు?
శనివారం ప్రోటోకాల్ ఉల్లంఘించారనే అంశంపై మమతా బెనర్జీ స్పందించారు. ఈ కార్యక్రమంలోనే ఫొటోను పట్టుకుని ‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి, ఇది మీ కోసం, మీరు రాష్ట్రపతిని గౌరవిస్తారా? ఒక మహిళా గిరిజన నాయకురాలు నిలుచున్నప్పుడూ మీరు ఎందుకు కూర్చుని ఉన్నారు.
నేను మీ అందరికి ఇది చూపిస్తున్నాను. మేము (అధ్యక్షుడిని) గౌరవిస్తాము, కానీ వారు గౌరవించరని సీఎం అన్నారు. ప్రధానమంత్రి మోదీ, మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించిన తరువాత ఇది జరిగింది. దేశ అధ్యక్షుడిని "అవమానించడం" "సిగ్గుచేటుగా ఖండించారు.
అయితే బీజేపీ దీనిని ఖండించింది. భారత రత్న అవార్డుల ప్రధానోత్సవంలో అవార్డు గ్రహీతలు కూర్చుంటారని, వారికి రాష్ట్రపతి స్వయంగా అందజేస్తారని ఎక్స్ లో ట్వీట్ చేసింది. దానితో పాటు అప్పటి వీడియోను కూడా షేర్ చేసింది. టీఎంసీ నకిలీ వార్తల కర్మాగారంగా మారిందని ఆరోపించింది.
‘‘భారతరత్న అవార్డు ప్రదానోత్సవ సమయంలో అధికారిక ప్రోటోకాల్ ప్రకారం, అవార్డు ప్రదానం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇతరులు కూర్చుని ఉన్నారు. మర్యాద ఉల్లంఘన జరగలేదు…” అని బీజేపీ పశ్చిమ బెంగాల్ యూనిట్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.