జుబీన్ మృతి కేసులో అస్సాం డీఎస్పీ అరెస్ట్..
x
జుబెన్ గార్గ్‌తో సందీపన్ గార్గ్‌ (ఫైల్)

జుబీన్ మృతి కేసులో అస్సాం డీఎస్పీ అరెస్ట్..

ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ


Click the Play button to hear this message in audio format

అస్సాం(Assam) ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్(Zubeen Garg) సింగపూర్‌(Singapore)లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న CID.. ఇప్పటికే నలుగురి అరెస్టు చేసింది. తాజాగా గార్గ్ సమీప బంధువు అస్సాంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తోన్న సందీపన్ గార్గ్‌ను బుధవారం (అక్టోబర్ 8) అరెస్టు చేశారు. ఈ విషయాన్ని CID స్పెషల్ DGP మున్నా ప్రసాద్ గుప్తా ధృవీకరించారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. జుబిన్ నీటిలో మునిగిపోతూ చనిపోవడానికి కొన్ని నిముషాల ముందు సందీపన్ గార్గ్ ఆయనతో ఉన్నాడని DGP గుప్తా చెప్పారు. గార్గ్ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులను తన వెంట తెచ్చాడని కూడా చెప్పారు.

అక్టోబర్ 2న పోలీసులు జుబీన్ గార్గ్ బ్యాండ్ సహచరుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకుడు అమృత్ప్రవ మహంతను అరెస్టు చేశారు. వీరికంటే ముందుగా గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, సింగపూర్‌లో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మేనేజర్ శ్యామ్‌కాను మహంతను అరెస్టు చేసి ప్రశ్నించారు.

‘విషమిచ్చారు?..’

శేఖర్ జ్యోతి గోస్వామి, మహంతలను పోలీసులు ఇటీవల విచారించారు. గార్గ్‌కు విషమిచ్చి ఉంటారన్న వీరిద్దరూ అనుమానం వ్యక్తం చేశారు. మరో బ్యాండ్‌మేట్ పార్థ ప్రతిమ్ గోస్వామి విచారణలో మరోలా చెప్పారు. దుర్ఘటనకు ముందు రోజు రాత్రి గార్గ్ మద్యం తాగాడని, మూర్ఛ సమస్య ఉన్న గార్గ్‌కు విశ్రాంతి ఇవ్వకుండా శేఖర్ జ్యోతి గోస్వామి, మేనేజర్ శర్మ "నిర్లక్ష్యంగా" ఆయనకు ఈతకు తీసుకెళ్లారని చెప్పారు.

గార్గ్ విశ్రాంతి తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గార్గ్ మృతదేహాం పోస్టుమార్టం రిపోర్టును ఇటీవల పోలీసులు ఆయన భార్యకు సమర్పించారు.

Read More
Next Story