
'సింగరేణి'లో అవినీతి మరకలా? పొలిటికల్ ప్రయోగశాలగా 'నైనీ గని'
తెలంగాణ విద్యుత్ సంస్థల బొగ్గు అవసరాల కోసం, సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని దక్కించుకుంది. అయితే, ఈ గనిలో తవ్వకాలు జరిపేందుకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నైనీ బ్లాక్‌ను తన వాళ్లకు కట్టబెట్టడానికి ప్రయత్నించి కేసీఆర్ విఫలమయ్యారు. ఇప్పుడు అదే బ్లాక్ నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించిన ఓ మంత్రి, ఓ టీవీ ఛానల్ అల్లరిపాలయ్యారు. కాంగ్రెస్ హై కమాండ్‌కు కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
నైనీ బొగ్గు టెండర్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచుతోంది. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వెంకట్‌రెడ్డిలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నాయకత్వం ఖండిస్తున్నప్పటికీ, రాజకీయ దుమారం మాత్రం తగ్గడం లేదు. ఈ పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రాంచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్రతో ఫెడరల్ తెలంగాణా చిట్ చాట్....

