కొరడాతో కొట్టుకున్న బిజెపి తమిళనాడు అధ్యక్షుడు
ఎందుకంత శిక్ష వేసుకున్నారు? ఆయనకు వచ్చిన ఆపదఏమిటి?

తమిళనాడు బిజెపి అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అధికారి అన్నామలై తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కోయంబత్తూరులోని తన ఇంటి నుంచి చొక్కా లేకుండా ఉత్త పయిన బయటకు వచ్చి ఆరు సార్లు కొరడాతొ కొట్టుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయపాలనకు ఈ కొరడా దెబ్బలు ప్రాయశ్చిత్తం అన్నారు.
తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో డిఎంకె పాలనను దించేస్తానని శపథం చేశారు. ముఖ్య మంత్రి స్టాలిన్ ప్రభుత్వం దిగిపోయే వరకు చెప్పులు కూడా వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు.
చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అత్యాచారాలమీద నిరసన తెలిపితే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. ఒక ప్రదర్శనలేమిటి ఇక ముందు ప్రతి ఇంటి ముందు ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తాము ప్రారంభించిన పోరాటం రానున్న రోజుల్లో మరింత ఉధృతమవుతుందని చెప్పారు. రాబోయే తరం తమ కళ్లముందే నశించిపోవడం చూల్లేక ఈ శపథం చేస్తున్నానని అన్నారు.
తమిళనాడులో మహిళలపై తల్లులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆరు కొరడా దెబ్బలు మురుగన్ స్వామికి నివేదన అన్నారు. అంతేకాదు, నేటి నుంచి 48 రోజుల పాటు ఉపవాసం ఉండబోతున్నానని, డీఎంకేను అధికారం నుంచి తొలగించే వరకు మళీ చెప్పులు వేసుకోనని అన్నామలై అన్నారు.