
హైదరాబాద్ వేదికగా ఆకట్టుకుంటున్న నర్సరీ మేళా
హుస్సేన్‌సాగర్ - నెక్లెస్ రోడ్ చౌరస్తా అంబేదర్కర్ విగ్రహం ఓ వైపు, మరో వైపు వివిధ రకాల పూలమొక్కలు. వీటి కలయిక ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటోంది. విభిన్న రకాల మొక్కలు, కుండీలు, గార్డెనింగ్‌కు కావాల్సిన అన్ని రకాల వస్తువులతో నర్సరీ మేళా కనువిందు చేస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉద్యాన ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
"అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్, ఫ్రూట్స్, ఎక్సాటిక్ ప్లాంట్స్ తో పాటు పట్టణ ప్రాంతంలో గార్డెనింగ్ కు అవసరమైన పాట్స్ పాటింగ్ మెటీరియల్ ఇలా అన్ని వససతులకు వన్ స్టాప్ సొల్యూషన్ గా మేళాలో అందుబాటులో ఉన్నాయని," మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. "రైతులకు, బోన్సాయ్ గార్డెన్ కు సంబంధించి అర్నమెంటల్ మెటీరియల్ , డెకరేషన్ మెటీరియల్ ప్రదర్శిస్తున్నారు. దేశ వ్యాప్తంగా హర్యానా వెస్ట్ బెంగాల్ వంటి నార్తిండియన్ స్టేట్స్ , సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఈ మేళాలో ప్రదర్శిస్తున్నారని" ఖాలీద్ తెలిపారు.

