ఠాక్రేల వారసత్వానికి చివరి రోజులు వచ్చేశాయా?
x

ఠాక్రేల వారసత్వానికి చివరి రోజులు వచ్చేశాయా?

బృహన్ ముంబై ఎన్నికలతో దేవేంద్ర ఫడ్నవీస్ తిరుగులేని నేతగా ఎదిగారా?


మహారాష్ట్రలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తాజాగా క్యాపిటల్ బీట్ తన దృష్టిని కేంద్రీకరించింది. రచయిత, పాలసీ నిఫుణుడు అయిన పుష్పరాజ్ దేశ్ పాండే, హర్డ్ న్యూస్ ఎడిటర్ సంజయ్ కపూర్ ఎన్నికల ధోరణి, రాజకీయాలు, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో మారుతున్న రాజకీయ కేంద్రాలను చర్చించారు.

బీజేపీ నేతృత్వంలోని మహయుతి కూటమి విజయం, ముంబైలో తగ్గిన శివసేన ఆధిపత్యం, ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ ఎపిసోడ్ లో చర్చ సాగింది.


తుది ఫలితాలు ఆలస్యం..
ఎన్నికల ఫలితాలు ఆలస్యం కావడానికి లెక్కింపు ప్రక్రియే కారణమని పుష్పరాజ్ దేశ్ పాండే అభిప్రాయపడ్డారు. ‘‘ ఎన్నికలలో 23 లెక్కింపు కౌంటర్లు ఉన్నాయి. ఒకసారి కేవలం రెండు వార్డులను మాత్రమే లెక్కిస్తున్నారు. అంటే 46 వార్డుల ఫలితాలు మాత్రమే వస్తున్నాయి’’.
పోస్టల్ బ్యాలెట్లు, యంత్రాలు లేకపోవడం ఫలితాల ఆలస్యానికి కారణం’’ అన్నారు. కార్పోరేషన్ ఆర్థిక బలం, అధిక జనాభా కారణంగా ఇక్కడి ఫలితాలు చాలా ముఖ్యమైనవని అన్నారు.
బీఎంసీ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లను మించిపోయిందని చెప్పారు. ఇది ముంబై ఆర్థిక శక్తిని తెలియజేస్తుందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ముంబై, థానే, పూణే, నవీ ముంబైలలో అత్యధిక ప్రజలు నివసిస్తున్నారని, ఇందులో ముంబైలో మాత్రమే 12 నుంచి 15 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘‘ఒక విధంగా చెప్పాలంటే.. మహారాష్ట్రలోని దాదాపు 40 శాతం మంది ప్రజలు ఈ ఎన్నికలలో ఓటు వేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.
శివసేన ఆధిపత్యానికి ముగింపు?
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై శివసేకు కు ఉన్న సుదీర్ఘ ఆధిపత్యం ముగింపు పలికిందని ప్యానెలిస్టులు చెప్పారు. ఈ ఫలితాలు ముంబై పౌర రాజకీయాలలో ఒక రాజకీయ శకంపై ముగింపుపై స్పష్టమైన తీర్పు ఇచ్చారని దేశ్ పాండే అన్నారు.
‘‘బీఎంసీపై 25 ఏళ్ల శివసేన పాలన ఇప్పుడు ముగిసింది’’ అని ఆయన అన్నారు. బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రధాన కూటములుగా ఉద్భవించాయి.
మహారాష్ట్ర అంతటా..
ఇవే ఫలితాలు కేవలం ముంబైలోనే కాకుండా ఇతర కీలక నగరాల్లో వస్తున్నాయని చెప్పారు. థానే, కళ్యాణ్, నవీ ముంబైలో బీజేపీ దాని మిత్రపక్షాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
‘‘ముంబై వెలుపల ఉన్న మున్సిపాలిటీలో ముఖ్యంగా ఎంఎంఆర్ ప్రాంతంలో బీజేపీ, బీజేపీ - శివసేన కూటమికి స్ఫష్టమైన విజయాలు దక్కాయి’’ అని ఆయన చెప్పారు. నాగ్ పూర్ లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించిందని చెప్పారు.
అయితే ఇదే సమయంలో ప్రతిపక్షం పూర్తిగా వెనకపడిపోలేదని చెప్పారు. లాతూర్ సహ కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో కాంగ్రెస్ విజయాలు సాధించింది. అయితే జనాభా పరంగా అవి చాలా చిన్న నగరాలని ఆయన వివరించారు.
ప్రతిపక్ష విజయాలు..
కొత్త కూటములకు ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని మరో అనలిస్ట్ సంజయ్ కపూర్ చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించి, గతంలో ఉనికి లేని అనేక పాక్షిక గ్రామీణ, పట్టణ కేంద్రాలలో తమ ప్రభావం చూపాయని చెప్పారు. ఇవన్నీ మహారాష్ట్రలో ఉద్బవిస్తున్న రాజకీయ గొంతుకలకు ప్రొత్సాహాకరమైన సంకేతం అన్నారు.
ముంబైలో కూటమికి సవాళ్లు..
ముంబైలో కాంగ్రెస్- వంచిత బహుజన్ అఘాడీ ఒప్పందం చాలా ఆలస్యంగా జరిగినప్పటికీ ముఖ్యమైన రాజకీయ ప్రయోగంగా పేర్కొన్నారు. ఈ కూటమి గురించి చాలా రోజులుగా చర్చలు ఉన్నప్పటికీ ఎన్నికల దగ్గర అవి సాధ్యమయిందని చెప్పారు.
‘‘ఈ కూటమి గురించి చర్చలు జరగలేదు. కానీ కొంచెం ఆలస్యంగా జరిగింది.’’ అని ఆయన అన్నారు. ప్రచారంలో వాటికి ప్రజా స్పందన వచ్చినప్పటికీ ఆ మద్దతును ఓట్లుగా మార్చడాన్ని లోతుగా పరిశీలించాలని పేర్కొన్నారు.
కూటమిలో ఓట్ల బదిలీలను కూడా ఆయన ప్రస్తావించారు. కొంతమోతాదులో ఓట్ల ఏకీకరణ జరిగిందని, కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరిందని కపూర్ పేర్కొన్నారు.
పెరిగిన బీజేపీ ప్రభావం.. కానీ
ముంబైలో వచ్చిన ఫలితాలు అంచనాల కంటే భిన్నంగా ఉన్నాయని ప్యానెలిస్టులు ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ, వారు అనుకున్న అఖండ విజయంతో అది సరిపోలేదని కపూర్ అన్నారు.
‘‘బీజేపీ 150 సీట్లు దాటుతుందని నేను ఊహించాను. కానీ దాని సీట్లు కేవలం 120 నుంచి 125 కే పరిమితం అయ్యాయి. ముంబైలో మేయర్ కోసం తన కూటమి భాగస్వామిపై ఆధారపడాలని చెప్పారు.
క్షేత్ర స్థాయిలో వనరులు తక్కువగా ఉన్నప్పటికీ శివసేన(యూబీటీ) చాలా అంచనాల కంటే మెరుగ్గా రాణించిందని, తన స్థానాలను నిలుపుకుందని పేర్కొన్నారు.
ఎంఐఎం కారకం..
ప్రతిపక్షాల ఓట్లను చీల్చడంలో ఎంఐఎం కూడా కీలకపాత్ర పోషించిందని ప్యానెలిస్టులు అభిప్రాయపడ్డారు. ఎంఐఎం పోటీ వల్ల ముంబైతో సహ అనేక చోట్ల కాంగ్రెస్ ఓట్లను దెబ్బతీసిందని కపూర్ పేర్కొన్నారు.
బీజేపీ, ఎంఐఎం అనేక ప్రాంతాలలో పరోక్షంగా సాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. పోటీ ఎక్కువగా ఉన్న వార్డులలో ఓట్ల విభజన జరిగి బీజేపీకి లాభం చేకూర్చిందని చెప్పారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుగుదల..
క్యాపిటల్ బీట్ తాజా ఎపిసోడ్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ ఎదుగుదల గురించి కూడా చర్చించాయి. ఆయన రాష్ట్ర నాయకుడి స్థాయి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగాడని సంకేతాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
‘‘ముంబై రాజకీయ నైఫుణ్యానికి నిలయం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషిచారు.
నాగపూర్ కేంద్రంగా ఉన్న నాయకుడు దశాబ్ద కాలంలోనే అఖిల భారత స్థాయికి ఎదగడం ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన ప్రయాణాన్ని సూచింస్తుందని కపూర్ అన్నారు. ‘‘ఇవి మహారాష్ట్రలో తిరుగులేని బీజేపీ నాయకుడిగా చేసింది.’’ అని కపూర్ పేర్కొన్నారు.
Read More
Next Story