
వారణాసి: వారసత్వాన్ని బలిపెట్టి అభివృద్ధి చేస్తారా?
మణికర్ణికా ఘాట్ పునర్మిణాణం పై కాపిటల్ బీట్ లో తాజా ఎపిసోడ్ లో అభ్యంతరాలు
హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాలలో సుప్రసిద్ధమైన వారణాసి లోని మణికర్ణికా ఘాట్ లోని జరుగుతున్న కూల్చివేతల వివాదాన్ని ‘క్యాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ దృష్టి సారించింది.
ఈ ఎపిసోడ్ లో ప్యానలిస్టులుగా చరిత్రకారిణి మృదుల ముఖర్జీ, కాంగ్రెస్ ప్రతినిధి అనురామ్ ఆచార్య, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత షైరా నయీమ్ పాల్గొన్నారు.
పునర్మిర్మాణ పనుల విషయంలో జరుగుతున్న కూల్చివేతలను వీరు ప్రశ్నించారు. ఈ కూల్చివేతల్లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ కు సంబంధించిన ప్రసిద్ధి నిర్మాణం కూడా ఉంది. హిందువులు మరణిస్తే మణికర్ణికా ఘాట్ లోనే దహన సంస్కారాలు నిర్వహించాలని తలపొస్తారు. కానీ ఇక్కడ ఉన్న అన్నింటిని కూల్చివేయాలనే నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి.
హిందూ సంప్రదాయంలో అత్యంత పురాతన స్మశానం మణికర్ణిక ఘాట్. ఇది చారిత్రక ప్రాముఖ్యత, సంస్కృతికి కేంద్రంగా విరాజిల్లుతోంది. అహల్యాబాయ్ హోల్కర్ వారసులు ఆమెతో సంబంధం ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని నిరాకరిస్తున్నారు. కూల్చివేతలో దెబ్బతిన్న విగ్రహాలు, వారసత్వ కళా ఖండాలను గుర్తించి, తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వారసత్వ అభ్యంతరాలు..
భారత చరిత్రను ఫణంగా పెట్టి అభివృద్ధి జరగకూడదని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమైన వారసత్వ ప్రాంతంలో చేస్తున్న పునరాభివృద్ధి విషయంలో మరోసారి నిర్ణయం తీసుకోవాలని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
కూల్చివేతల వల్ల ఘాట్ చారిత్రక వారసత్వానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని, పునరాభివృద్ధి, పునరుజ్జీవనం, శుద్దీకరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలను అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
ఈ పునరాభివృద్ధి విషయంలోనే వివాదం నెలకొందని ముఖర్జీ అన్నారు. సబర్మతి ఆశ్రమం, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ల విషయంలోనూ ఇలాంటి నిరసనలను ఆమె ప్రస్తావించారు. చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాల సమగ్రతను దెబ్బతీసేలా అయ్యే అభివృద్ధి విషయంలో చరిత్రకారులు, వాస్తు శిల్పులు, పట్టణ ప్రణాళికదారులు, పౌరులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు.
అభివృద్ధి నమూనా..
వారణాసి పునరాభివృద్ధి విషయంలో స్థానిక మత ప్రముఖులు, ఆ ప్రాంతంతో సంబంధం ఉన్న మహంతులు ఇప్పటికే నిరసన తెలిపారని ఆమె వెల్లడించారు. స్థానికంగా ప్రాముఖ్యం ఉన్న అనేక దేవాలయాలు ఇప్పటికే ధ్వంసం అయ్యాయని ఆమె చెప్పారు.
అహల్యాబాయ్ హోల్కర్ వారసత్వం కారణంగా వివాదం తీవ్రంగా మారిందని, అయితే చిన్న దేవాలయాలకు ఇంతకుముందు జరిగిన నష్టాలు పెద్దగా ప్రాచుర్యం పొందలేదని పేర్కొన్నారు.
‘‘మీరు అభివృద్ధి చేసే విధానం ఇది కాదు’’ అని ముఖర్జీ వివరించారు. పునరాభివృద్ధి విషయంలో ఇది వరకూ జరిగిన అంతర్జాతీయ అంశాలను ఆమె ప్రస్తావించారు. పవిత్ర ప్రదేశాలకు సమీపంలో పెద్ద మాల్స్, వాణిజ్య భవనాల వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుందని అన్నారు.
ప్రామాణికత..
పునరుద్దరణ వాస్తవికతను కాపాడాలని ముఖర్జీ చెప్పారు. స్థలం సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచే విధంగా మీరు పునరాభివృద్ధి చేయాలి’’ అని ముఖర్జీ డిమాండ్ చేశారు.
సుందరీకరణ కోసం వారసత్వాన్ని నాశనం చేయకూడదని కూడా అన్నారు. 2 వేల సంవత్సరాల కంటే పాత నిర్మాణాలను వాటి చారిత్రక పొరలకు భంగం కలగకుండా పునరుద్దరణ చేసే రోమ్ నగరాన్ని ఆమె ఉదాహారణగా చెప్పారు. భారత్ కూడా అలా చేసే సత్తా ఉందని అన్నారు.
చారిత్రక విలువను నాశనం చేసే విధానంపై ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ భవనాలు, సంస్థలు ఒకసారి నాశనం చేయబడిన తరువాత తిరిగి సృష్టించలేమని పేర్కొన్నారు.
రాజకీయం అయిన అభివృద్ధి..
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనురామ్ ఆచార్య కూల్చివేతను సాధారణంగా పునరాభివృద్ధి విషయంగా కాకుండా నాగరికతకు సంబంధించిన సమస్యగా అభివర్ణించారు.
‘‘మణికర్ణికా ఘాట్ సాధారణ ఘాట్ కాదు’’ అని ఆయన అన్నారు. దీనిని భారత నాగరికతకు చిహ్నంగా పేర్కొన్నారు. కూల్చివేసిన నిర్మాణాలను పునర్మించడం వల్ల కోల్పోయిన వాటిని పునరుద్దణ చేయలేమని ఆచార్య అన్నారు.
‘‘వారసత్వాన్ని విచ్చిన్నం చేసినప్పుడూ మీరు చరిత్రను పునరుద్దరించలేరు’’ అని చెప్పారు. వారసత్వ ప్రదేశాలలో బుల్డోజర్లను ఉపయోగించడం సాంస్కృతిక హెచ్చరిక సంకేతం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయడం ప్రామాణికతను పునరుద్దరించగలడా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘వారు విగ్రహాలను తిరిగి ఇన్స్టాల్ చేయవచ్చు. కానీ ప్రామాణికతను తిరిగి తీసుకురాలేరు’’ అని ఆచార్య అన్నారు.
కారిడార్ సంస్కృతి
ఏకరీతి పునరాభివృద్ధి నమూనాను ఆచార్య విమర్శించారు. కాశీకి పున: రూపకల్పన కంటే రక్షణ అవసరమని అన్నారు. కూల్చివేతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల తెలిపారని, మణికర్ణికా ఘాట్ పవిత్రత దాని స్వభావంలోనే ఉందని ఆయన అన్నారు.
‘‘దాన్ని అతిగా అభివృద్ధి చేయడం వల్ల ఆత్మను దూరం చేసినట్లు అవుతుంది’’ అన్నారు. సుందరీకరణ పేరుతో జరుగుతున్న విచ్చిన్నతపై సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ సహ ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన చర్చలో ప్రస్తావించారు.
నష్ట నియంత్రణ..
రాజకీయ నష్ట నియంత్రణ ఇప్పటికే ప్రారంభమైందని సీనియర్ జర్నలిస్ట్ షైరా నయీమ్ అన్నారు. అహల్యాబాయి హోల్కర్ తో సంబంధం ఉన్న సంఘాలు మెయిన్ పురిలో నిరసనలు చేశాయని ఆమె వివరించారు. ఇందులో దిష్టి బొమ్మలు దహనం చేశారని, తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రదర్శనకారులు చెప్పారని ఆమె అన్నారు.
అయితే కూల్చివేతలకు సంబంధించిన అన్ని ఫోటోలు ఏఐ ద్వారా కొంతమంది అదేపనిగా ప్రచారం చేస్తున్నారని యూపీ సీఎం ఆదిత్యనాథ్ తరువాత చెప్పారని ఆమె వెల్లడించారు.
‘‘కూల్చివేత తాత్కాలికంగా నిలిపివేశారు’’ అని నయీమ్ అన్నారు. శిథిలాలు మట్టితో ఉన్నాయని, పని ఆగిపోయిందని అన్నారు. ఏఐ విజువల్స్ సంగతి సరే, అక్కడ స్థానిక ప్రజలు తమ కళ్లతో చూసిన వాటిని ఎలా మారుస్తారని నిలదీశారు.
స్థానికంగా ప్రభావం..
వారణాసిలో ప్రధాన వాణిజ్య ప్రాంతం అయిన దాల్ మండి లో ఉన్న ఆర్థిక అవాంతరాలను నయీమ్ లేవనెత్తారు. నిరసనలకారణంగా అక్కడ రోజుల తరబడి దుకాణాలు మూసివేయబడ్డాయి. 1200 నుంచి 1400 దుకాణాలు ప్రభావితమయ్యాయని, ఇది జీవనోపాధిపై ప్రభావం చూపిందని ఆమె అన్నారు.
వారణాసి ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమని, ఇంతకుముందు జరిగిన పునరాభివృద్ధి ఆయనకు విజయం మార్జిన్లపై ప్రభావం చూపిందని ఆమె అన్నారు. ఈ ఆందోళనలు మధ్యప్రదేశ్ కు వ్యాపించాయని నయీమ్ అన్నారు. కూల్చివేత ప్రారంభానికి ముందు తమకు ఎందుకు సమాచారం అందించలేదని హోల్కర్ ట్రస్ట్ సభ్యులు ప్రశ్నించారు.
వాణిజ్యీకరణ చర్చ..
మతపరమైన ప్రదేశాల వాణిజ్యీకరణ జరగడం పై ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. పునరాభివృద్ధి ప్రాజెక్ట్ లు పవిత్ర నగరాలను మతపరమైన పర్యాటక కేంద్రాలుగా మార్చాయని నయీమ్ అన్నారు.
ఘాట్ ల దగ్గర ఫుడ్ కోర్టులు, వాణిజ్య సౌకర్యాలను ఉదహరించారు. ‘‘ప్రజలు భక్తి కోసం వస్తారు. ఆహర ప్లాజాల కోసం కాదు’’ అని ఆమె అన్నారు. అయోధ్య, ప్రయాగ్ రాజ్, ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా ఇలాంటి వ్యాపార నమూనాలు కనిపించాయని ఆమె పేర్కొన్నారు.
బుల్డోజర్లు లేకుండా పరిశుభ్రత, ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచవచ్చని ముఖర్జీ అన్నారు. వారసత్వాలను నాశనం చేయకుండా స్థలాలను శుభ్రంగా ఉంచుకోవచ్చని సూచించారు.
గుర్తింపు..
కాపిటల్ బీట్ లో చర్చ వారసత్వం, జాతీయ చిహ్నాలను ప్రతీకాత్మకంగా ఉపయోగించడం వరకు వెళ్లింది. చరిత్ర, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, కాంక్రీట్ నిర్మాణాలు తేలేవని పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున స్మారక చిహ్నాలు, ప్రాజెక్ట్ ల వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని ముఖర్జీ ప్రశ్నించారు. కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు మీడియా నివేదికల్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని అనురామ్ ఆచార్య పునరుద్ఘాటించారు. అవి కల్పితమనే ప్రచారాలను ఖండించారు. ఇవన్నీ భారత గుర్తింపు అని ప్యానెలిస్టులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఎపిసోడ్ ముగిసింది.
Next Story

