
బడ్జెట్ రాష్ట్రాలను ఎలా మార్చబోతోంది?
ప్రపంచ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అంచనా వేసి బడ్జెట్ తీసుకొచ్చారా?
భారత్ బడ్జెట్ 2026-27 లో సంచలనాత్మక విషయాలు ఏవి లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపైనే దృష్టిపెట్టింది.
2047 నాటికి భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడంపైనే ఫోకస్ చేస్తుందని, సంస్కరణల ప్రయాణంలో ఇది మరో అడుగు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. అయితే వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక గమనాన్ని అందుకోవడానికి సరైన రోడ్ మ్యాప్ ను తీసుకురావడంలో విఫలమైందని విమర్శలు అభిప్రాయపడుతున్నారు.
"ఇది పనివాడిలాంటి బడ్జెట్, కొత్త పుంతలు తొక్కడం కంటే ఖాళీలను పూరించడం లాంటిది" అని ‘ది ఫెడరల్’ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్. శ్రీనివాసన్ టాకింగ్ సెన్స్ విత్ శ్రీని లో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం బిగ్-బ్యాంగ్ ఉద్దీపన చర్యలను అమలు చేయడం కంటే ఆర్థిక క్రమశిక్షణ, స్థిరత్వాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు.
బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 4.3 శాతం ఆర్థిక లోటును లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 4.4 శాతంగా ఉంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధిని 7 శాతంగా అంచనా వేసింది. మౌలిక సదుపాయాల వ్యయం సుమారు లక్ష కోట్లు పెరిగింది. మొత్తం మూలధన వ్యయం రూ. 12 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేశారు. రక్షణ వ్యయం 15 శాతం పెరిగింది, మూలధన సేకరణ దాదాపు 22 శాతం పెంచారు.
ప్రపంచ పరిస్థితులు..
బడ్జెట్ లోని సంఖ్యలు ప్రభుత్వ స్థూల ఆర్థిక బలం వాదనను బలపరుస్తున్నాయని శ్రీనివాసన్ అన్నారు. “కానీ ప్రపంచవ్యాప్తంగా బలమైన ఎదురుగాలి వీస్తున్నప్పుడు ఇది సరిపోతుందా అనేది ప్రశ్న” ఆ ఎదురుగాలిలో పశ్చిమ దేశాలలో పెరుగుతున్న రక్షణవాదం, రోజు రోజుకి పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కృత్రిమ మేధ ద్వారా నడిచే వేగవంతమైన సాంకేతిక అంతరాయాలు ఉన్నాయి. భారతదేశ ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) “గోల్డిలాక్స్” గా అని పిలుస్తుంది. అయితే స్థిరత్వం మాత్రమే స్థిరమైన వృద్ధిని అందించకపోవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
“ఈ రోజు ఆర్థిక వ్యవస్థ బాగానే కనిపిస్తోంది, కానీ అది రేపటికి అది తనంత తానుగా మనల్ని సిద్ధం చేయదు” అని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ ఆర్థికవేత్త కలైయరసన్ అభిప్రాయపడ్డారు.
“బడ్జెట్ స్వల్పకాలిక స్థూల స్థిరత్వాన్ని ప్రస్తావిస్తుంది, కానీ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి దీర్ఘకాలిక వ్యూహంపై ఇది స్పష్టంగా లేదు”
ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య అంతరం..
ఆర్థిక సర్వే బడ్జెట్ మధ్య అంతరం కలైయరసన్ ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య డిస్‌కనెక్ట్‌ను సూచించింది. సాంకేతిక పరిజ్ఞానం అప్‌గ్రేడ్, తయారీ విస్తరణ, సంస్థాగత సామర్థ్య నిర్మాణం, అవసరాన్ని సర్వే హైలైట్ చేసినప్పటికీ, ఈ లక్ష్యాలను ఎలా సాధించాలనే దానిపైనే బడ్జెట్ సరిగా నిర్వచించలేదు.
"భారత్ నిర్మాణాత్మక బలహీనతలలో ఒకటి విదేశీ మారక నిల్వలు ఎగుమతి మిగులుపై కాకుండా మూలధన ప్రవాహాలపై నిర్మించబడ్డాయి" అని ఆయన అన్నారు."
ఇది స్థిరమైన తయారీ ఎగుమతుల ద్వారా నిల్వలను కూడబెట్టిన చైనా మాదిరిగా కాకుండా, ఆకస్మిక మూలధన ప్రవాహాలకు ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుంది’’ అని చెప్పారు.
చిన్న తరహ పరిశ్రమలు..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (MSMEలు)పై ప్రాధాన్యత పునరుద్దంచబడిన బడ్జెట్ లలో ఇది ఒకటి. ప్రభుత్వం రూ. 10,000 కోట్ల ఈక్విటీ నిధిని ప్రకటించింది. క్రెడిట్ హామీలను విస్తరించింది. కొన్ని ప్రత్యేక ఎన్నుకున్న "MSME ఛాంపియన్లకు" ప్రొఫెషనల్, టెక్నాలజీ అందిస్తామని పేర్కొంది.
"MSMEలకు అన్నింటికంటే రెండు విషయాలు అవసరం, ఫైనాన్స్ యాక్సెస్, టెక్నాలజీ యాక్సెస్," అని శ్రీనివాసన్ అన్నారు. "బడ్జెట్ ఫైనాన్సింగ్‌ను ప్రస్తావిస్తున్నప్పటికీ, టెక్నాలజీ ప్రశ్న పరిష్కారం కాకుండానే ఉంది." అని శ్రీని అభిప్రాయపడ్డారు.
కలైయరసన్ మాట్లాడుతూ.. "సూక్ష్మ సంస్థలు చిన్న, మధ్యస్థ, చివరికి పెద్ద సంస్థలుగా పెరిగే మార్గాన్ని బడ్జెట్ పునరావృతం చేయలేకపోయింది" అని ఆయన అన్నారు.
"MSMEలు, పెద్ద సంస్థలు, విదేశీ పెట్టుబడిదారుల మధ్య లోతైన సంబంధాలు లేకుండా, ఉత్పాదకత తక్కువగా ఉంటుంది." శ్రీనివాసన్, కలైయరసన్ ఇద్దరూ భారతదేశం ఎదుర్కొంటున్న సవాలు సెమీకండక్టర్లు లేదా రక్షణ వంటి ఉన్నత స్థాయి వ్యూహాత్మక రంగాలలో స్వావలంబన మాత్రమే కాదు, తక్కువ ధరకు వినియోగదారుల వస్తువుల భారీ స్థాయిలో తయారీ కూడా అని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. "బడ్జెట్ ఉద్దేశ్యాన్ని ఇదే సూచిస్తుంది" అని కలైయరసన్ అన్నారు. "కానీ స్పష్టమైన దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్ లేకుండా తీసుకొచ్చిన ప్రతిపాదనలు అంతగా ఉపయోగపడవని అన్నారు.
Next Story

