ట్రంప్ మనస్తత్వాన్ని పెట్టుబడిదారులు గమనించారా?
x

ట్రంప్ మనస్తత్వాన్ని పెట్టుబడిదారులు గమనించారా?

సుంకాలు ప్రకటించడం, వెనక్కి తగ్గడం, కొత్త ఫ్రేమ్ వర్క్ ల అర్థం ఏంటంటే..


అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక మార్కెట్లు అనిశ్చితంగా మారాయి. నిజానికి మార్కెట్లకు ఇలాంటి పరిణామాలు అంతగా నచ్చవు. కానీ ప్రస్తుతం వినియోగదారులు వారితో జీవించడం నేర్చుకున్నారు.

వాల్ స్ట్రీట్ ఈ వాణిజ్య సమరానికి కొత్త పేరు పెట్టుకుంది. అదే టాకో(టీఏసీఓ)..‘‘ ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్’’ అనే దానికి పూర్తి రూపం. తెలుగులో చెప్పాలంటే చెప్పిన మాటపై నిలబడడు. సుంకాల బెదిరింపులు చేస్తే మార్కెట్లు పడిపోతాయి.


ఆయన నిశ్శబ్దంగా ఉంటే ర్యాలీ చేస్తాయి. చైనా నుంచి గ్రీన్ లాండ్ వరకూ ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ ఇవే తెలియజేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 2025 లో చైనా మినహ అన్ని దేశాలపై సుంకాలకు 90 రోజుల విరామం ఇచ్చారు.

దీనితో మార్కెట్లు వెంటనే ఫుంజుకున్నాయి. ఎస్ అండ్ పీ లో దాని వాటా 9.5 శాతం పెంచుకుంది. గంటల్లోనే దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ పెరిగింది.

బెదిరింపు.. విరామం..
మే 28, 2025న ఓవల్ లో జరిగిన ప్రెస్ కాన్పరెన్స్ లో సీఎన్బీసీ ప్రతినిధి ‘టాకో’ ట్యాగ్ ను ప్రస్తావించగా దీనిని ఆయన దుర్మార్గంగా తోసిపుచ్చారు. సుంకాల రాయితీలను పొందాలంటే కచ్చితంగా చర్చలు అవసరమని చెప్పారు.
తన వాదనకు మద్దతుగా చైనాతో జరుగుతున్న చర్చలను ఎత్తి చూపారు. ఇక్కడ సుంకాలను 30 శాతం తగ్గిన సంగతి చెప్పారు. అంతకుముందు 145 అని 125 వరకూ ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తరువాత కూడా స్క్రిప్ట్ మార్చలేదు. అదే అస్థిరతను కొనసాగించారు.
ఉత్తర అమెరికా, యూరప్
కెనడా, మెక్సికోలపై కూడా ట్రంప్ 25 శాతం సుంకాలు విధించాడు. ఇక్కడ నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ ఎక్కువగా వస్తున్నాయని ఆయన ఆరోపిస్తూ ఈ సుంకాలు విధించారు. తరువాత వీటిని 30 రోజుల పాటు నిలిపివేశారు. కొన్ని రోజులకు తిరిగి కెనడా, మెక్సికోలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా అమెరికాకు అనుకూలంగా.
తన మిత్రదేశం యూరప్ పై కూడా 50 శాతం సుంకాలు ప్రతిపాదించారు. తరువాత జూలై 9, 2025 వరకూ అమలు నిలిపివేశారు. ఈ చర్య మార్కెట్లకు ఉపశమనం కలిగించింది.
యూఎస్ సోర్స్ కంటెంట్ ఆధారంగా తయారీదారులు ఖర్చులను భర్తీ చేసుకోవడానికి అనుమతించే కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా ఆటో సుంకాలను కూడా తగ్గించారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రకటించబడిన సుంకం కంటే గడువు ముఖ్యమైనదనే సంకేతాలు ఇచ్చింది.
కొలంబియాపై కూడా ఇదే విధమైన నమూనా అనుసరించారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలపై మొదట 90 రోజులకు, తరువాత జూలై కి, తరువాత ఆగష్టుకు మార్చుకుంటూ వెళ్లిపోయారు.
ఇవి కూడా అస్థిరత వ్యూహంలోనే భాగమేనా అని చర్చలు లేవనెత్తింది. ట్రంప్ అస్థిరమైన సుంకాల ప్రకటన వాణిజ్యాన్ని పున: నిర్మించడానికి తక్కువగా రూపొందించబడి, మార్కెట్ ప్రవర్తనను ప్రభావితం చేయడానికి ఎక్కువగా రూపొందించబడ్డాయా? అని పరిశీలకులు భావిస్తున్నారు.
సైకిల్ స్టాండ్లు..
ట్రంప్ ప్రకటన ఇవ్వడంతో తరుచుగా మార్కెట్లలో భయాందోళనలు వస్తున్నాయని వ్యాపారులు గమనించారు. ఆదివారం సాయంత్రం నాటికి ఫ్యూచర్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.
అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. కానీ బుధవారం నాటికి కొనుగోలుదారులు రంగంలోకి దిగుతారు. ఇక్కడ ఊహ సులభం సుంకాలు వారాల దూరంలో ఉన్నాయి. చరిత్ర విరామం వస్తుందని చెబుతుంది. ప్లేబుక్ వర్తకానికి ఇది ఊహించినట్లు సాగుతోంది.
భరోసా దశ
సుంకాలు ప్రకటించడం తరువాత అమెరికా కీలక అధికారులు టీవీల్లో కనిపించి ఆందోళనలను శాంతపరుస్తారు. ఇందులో ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలకంగా మారారు. చర్చలు కొనసాగుతాయని, ఫలితాలు నిర్మాణాత్మకంగా ఉంటాయని హమీ ఇస్తారు.
ఫ్రేమ్ వర్క్ లేదా ఒప్పందాలు వస్తాయి. మార్కెట్లు తిరిగి కోలుకుంటాయి. గ్రీన్ ల్యాండ్, ఈయూ సుంకాల ప్రకటింపు ట్రంప్ నమూనా మరోసారి కనిపించింది.
నాటో, గ్రీన్ లాండ్..
నాటో తో చర్చల తరువాత ఫిబ్రవరి 1న నిర్ణయించిన సుంకాలను రద్దు చేశాడు. తమ మధ్య ఒప్పందం కుదిరిందని ఇదే గొప్ప ఫ్రేమ్ వర్క్ గా అభివర్ణించారు. అయితే చర్చల సమయంలో గ్రీన్ ల్యాండ్ పై డానిష్ సార్వభౌమాధికారం గురించి చర్చే జరగలేదని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తెలిపారు. వాస్తవానికి, మాటలకు మధ్య అంతరం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనిని మార్కెట్లు గుర్తించాయి.
గందరగోళం.. బ్యాక్ టూ హోమ్..
దావోస్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్ మధ్య తేడాలను గుర్తించలేకపోయాడు. గ్రీన్ ల్యాండ్ ను పదే పదే ఐస్ లాండ్ గా సంభోదించారు. ఐరాస స్థానంలో శాంతిమండలి అనే దానిని తీసుకొస్తానన్నాడు.
నాటో ఆర్టికల్ 5 నిబంధనపై తనకు గౌరవం లేదన్నారు. ఇదంతా గందరగోళంగా ఉంది. అయితే మార్కెట్లకు దాని ముందున్న గందరగోళం కంటే తిరోగమనం ముఖ్యమైనవి. పెట్టుబడిదారులు ఈ విరామాన్ని స్వాగతిస్తున్నారు.
మార్కెట్ ఏం చెబుతుంది..
వాల్ స్ట్రీట్ నుంచి ప్రపంచ రాజధానుల వరకూ ఒక పాఠం స్పష్టంగా ఉంది. ట్రంప్, సుంకాల వ్యూహం దీర్ఘకాలిక వాణిజ్య పున: నిర్మాణం గురించి తక్కువగా కనిపిస్తుంది. స్వల్పకాలిక మార్కెట్ మనస్తత్వం గురించి ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ విధానం అందరికి అర్థం అయింది. ఇక నుంచి భయం ఆధిపత్యం వహించదు. తదుపరి సుంకాలు వచ్చినప్పుడూ పెట్టుబడిదారులకు ఎలా చేయాలో బాగా తెలుసు. వారు విరామం కోసం ఎదురు చూస్తారు.
Read More
Next Story