x

షమ్మీకపూర్, షారుక్ పాటలతో డాన్సులు చేసిన ముకేష్ అంబానీ దంపతులు !

“రాజు తలుచుకుంటే…” అని ఏదో అన్నట్లుగా ఉంది అంబానీ కొడుకు పెళ్ళి. 2022 డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైన అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్ళి వేడుకలు దాదాపు సంవత్సరమున్నరపాటు సాగుతూ, వచ్చే శుక్రవారం జరిగే పెళ్ళితో ముగియనున్నాయి.


షమ్మీకపూర్, షారుక్ పాటలతో డాన్సులు చేసిన ముకేష్ అంబానీ దంపతులు

“రాజు తలుచుకుంటే…” అని ఏదో అన్నట్లుగా ఉంది అంబానీ కొడుకు పెళ్ళి. 2022 డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైన అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్ళి వేడుకలు దాదాపు సంవత్సరమున్నరపాటు సాగుతూ, వచ్చే శుక్రవారం జరిగే పెళ్ళితో ముగియనున్నాయి.

నిన్న జరిగిన సంగీత్ వేడుకకోసం ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌ను అక్షరాలా కోటి డాలర్లు, రూపాయలలో 80 కోట్లు ఇచ్చి పిలిపించారు. మరోవైపు ఈ సంగీత్ వేడుకలో ముకేష్, అతని భార్య నీతా… షమ్మీకపూర్, షారుక్ పాటలకు నాట్యం చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. బ్రహ్మచారి చిత్రంలోని షమ్మీకపూర్ పాట “చక్కేపే చక్కా”కు ఆ దంపతులు తమ మనవళ్ళు, మనవరాళ్ళతో కలిసి పెదవులు కదిపారు. మరోవైపు ఓమ్ శాంతి ఓమ్ సినిమాలో షారుక్ పాట ‘దీవానిగీ దీవానిగీ’కి ముకేష్, నీతా నాట్యం కూడా చేశారు.

ఈ సంగీత్ కార్యక్రమం ముంబైలోని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. పెళ్ళి కార్యక్రమం ఈ నెల 12 నుంచి 14 దాకా ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగబోతోంది.

Read More
Next Story