దైవాలగూడలో రక్తాపాతం..ఆరుగురిని నరికి చంపిన రాజ్ కుమార్
x

దైవాలగూడలో రక్తాపాతం..ఆరుగురిని నరికి చంపిన రాజ్ కుమార్


రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున (జూలై 11, 2026) జరిగిన దారుణ నరమేధం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కేవలం కక్షసాధింపు ధోరణితో 28 ఏళ్ల రాజ్‌కుమార్ అనే ఉన్మాది ఒకే రాత్రి తన భార్యాపిల్లలతో సహా మొత్తం ఆరుగురిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. మృతుల్లో నిందితుడి భార్య సరిత, వారి మూడేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకుతో పాటు పక్కింట్లో నివసించే 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మ ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో ఉన్మాది జరిపిన ఈ ఘాతుకం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

గతంలో బాలికను ప్రేమ పేరుతో వేధించిన రాజ్‌కుమార్‌పై మే 16న బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో షాబాద్ పోలీసులు పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు. ఈ కేసులో మే 26న అరెస్ట్ అయిన నిందితుడు, ఇటీవలె బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తనపై కేసు పెట్టి జైలుకు పంపారనే పగతో రగిలిపోయిన రాజ్‌కుమార్, అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కా ప్లాన్‌తో పక్కింటి బాలిక కుటుంబంపై దాడి చేసి ముగ్గురిని హతమార్చాడు. ఆ తర్వాత తన నేరాన్ని ఎక్కడ అడ్డుకుంటారో అనే భయంతో లేదా ఉన్మాదంతో తన సొంత భార్యను, ఇద్దరు పసిపిల్లలను కూడా దారుణంగా నరికి చంపాడు.


Read More
Next Story