హష్ మనీ కేసులో ట్రంప్ శిక్షార్హుడే అన్న అమెరికా జడ్జి
అమెరికా కాబోయో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో శిక్షార్హుడని ఖరారయింది.
అమెరికా కాబోయో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో శిక్షార్హుడని ఖరారయింది.
జనవరి 10న శిక్ష ఏమిటో వెల్లడిస్తానని జడ్డి యువాన్ మేర్చాన్ తెలిపారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడానికి 10 రోజుల ముందు ట్రంపు శిక్ష ఎదర్కోబోతున్నారు.
ఆ రోజు ట్రంపు స్వయంగానైనా కోర్టు కు హాజరుకావచ్చు లేదా ఆన్ లైన్ లో హాజరుకావచ్చు అని జడ్డి తెలిపారు. కేసుకు వ్యతిరేకంగా ట్రంపు న్యాయవాదులు చేసిన వాదనలను జడ్జి తిరస్కరించారు.
ఒక అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇలా శిక్ష పడటం ఇదే మొదటి సారి.
2016 ఎన్నికల ప్రచార సమయంలో అడల్ట్ పోర్న్ స్టార్ స్టోమి డేనియల్స్ కు $130,000 లంచం ఇచ్చి ఆమె నోరెత్తకుండా చేసిన కేసే హష్ మానీ కేసు. తన న్యాయవాది ద్వారా ట్రంప్ ఆమెకు ఈడబ్బు చెల్లించారన్నది ఆరోపణ.
తనతో ట్రంపు లైంగిక సంబంధం పెట్టుకున్నట్లుడేనియల్స్ ఆరోపించారు. తరువాత, ఆమె ఆ విషయం మీద గోల చేయకుండా ఉండేందుకు డబ్బు ఎరవేశారు.
కానీ, కేసులో తీర్పు చెబుతున్నా ఆరోజు ఆయనను జైలుకు పంపించక పోవచ్చు. బేషరతుగా కేసునుంచి విముక్తి కూడా కల్గించవచ్చునని న్యాయమూర్తి చెప్పారు. ఏమయినా శిక్షార్హుడిగా వైట్ హౌస్ లోకి ప్రవేశిస్తున్న తొలి దేశాధ్యక్షుడిగా ట్రంపు చరిత్రలో మిగిలిపోతారు.
ఇదంతా కుట్ర అని ట్రంపు వ్యాఖ్యానించారు. తీర్పును తప్పుపట్టారు.