
తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీతో ఎన్డీఏ నేతలు
మోదీ ప్రసంగంలో ఉత్సాహం ఎందుకు తగ్గింది?
వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి ఆరోపణలు కొత్త సీసాలో పాత సారాల ఉందన్న విశ్లేషకులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పడిన ఎన్డీఏ తరఫున ప్రారంభమైన ఎన్నికల ర్యాలీలో ప్రధాన నరేంద్ర మోదీ హజరై ప్రసంగించారు. ఇందులో కూటమి ఐక్యంగానే ఉందన్న సందేశం ఇవ్వడానికి మోదీ గట్టి ప్రయత్నమే చేశారు.
ఆయన తన ప్రసంగంలో కార్యకర్తలకు కొత్త సందేశం ఇవ్వడంలో విఫలం అయ్యారని, వారిని ఉత్తేజపరచలేపోయారని రాజకీయ విశ్లేషకులు విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పాలనలో కుటంబ పాలన, అవినీతి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి పాత ఆరోపణలే మరోసారి పునరావృతం చేశారని అభిప్రాయపడ్డారు.
మోదీ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడానికి, నినాదాలు చేయడానికి చాలామందికి బీజేపీ రిహర్సల్స్ ఇచ్చినప్పటికీ చాలామంది కార్యకర్తలు సరైన సందర్భంలో స్పందించలేదు. చివరికి నిర్వాహకులు తమ మొబైల్ ఫోన్లను ఎత్తి ఫ్లాష్ లైట్ల ద్వారా కూటమికి మద్దతు తెలపాలని కోరారు.
రెండుసార్లు మాత్రమే..
సభకు భారీ జనసమూహం వచ్చినప్పటికీ కేవలం రెండు సందర్భాలలో మాత్రమే వారిలో జోష్ కనిపించింది. టీటీవీ దినకరన్ స్టేజీపై కనిపించి, తాను స్థాపించిన ఏఎంఎంకే, అన్నాడీఎంకే మధ్య సరైన సంబంధాలు లేవని అంగీకరిస్తూనే, తమిళ ప్రజల సంక్షేమం, డీఎంకేను అధికారంలోకి తొలగించడానికి తాను ఎన్డీఏలోకి చేరినట్లు చెప్పారు. పళని స్వామి దినకరన్ పేరు ప్రస్తావించిన సందర్భంలో కూడా సభలో జోష్ కనిపించింది.
కొత్త సీసాలో పాత వైన్..
చెన్నై దక్షిణ శివారు ప్రాంతంలో మధురాంతకంలో జరిగిన సభలో బీజేపీ కోర్ ఐడియా అయిన హిందూత్వం గురించి మాట్లాడలేదని రాజకీయ విశ్లేషకుడు ఆర్. రంగరాజ్ ‘ది ఫెడరల్’ తో చెప్పారు. ఆయన ప్రసంగాన్ని కొత్తసీసాలో పాత వైన్ గా అభివర్ణించారు.
‘‘మదురాంతకం ర్యాలీలో మోదీ ఉత్సాహంగా కనిపించలేదు. ఆయన నిగ్రహంగా, సంయమనంతో వ్యవహరించారు. డీఎంకే పాలనలో అవినీతి, తమిళ సంస్కృతిని ప్రొత్సహించడం వంటి అంశాలకే పరిమితమయ్యారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడే అలవాటు ఉన్నందున ఆయన సనాతన ధర్మం గురించి హిందూ వ్యతిరేక అంశాల గురించి మాట్లాడలేదు. ఈ సభలో కొత్త ఎన్నికల సంకేతం లేదు’’ అని రంగరాజ్ అన్నారు.
అవినీతి, వంశపారంపర్య పాలనపై పదేపదే ఆరోపణలను ఓటర్లు అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టాలి మక్కల్ కట్చి నాయకుడు అన్బుమణి రామదాస్ వేదికను పంచుకున్నాడు. అయితే బ్యానర్ లో పీఎంకే అయిన మామిడి చిహ్నం ఎందుకు ఉపయోగించారని ఆయన తండ్రి, సీనియర్ నాయకుడు ఎస్ రామదాస్ చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి.
మోదీ మద్దతుదారులు విఫలం..
యూపీఏ పాలనకంటే తమ హయాంలోనే ఎక్కువ నిధులు వచ్చాయనే చెప్పడం తమిళ ప్రజలు హర్షించరని చెప్పారు. తమిళనాడు నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయిలో కేవలం 29 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి. ఇదే వాదనతో డీఎంకే 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిందని రంగరాజ్ చెప్పారు. తన మొదటి ర్యాలీలో కార్యకర్తలు, ప్రజలను ఉత్సాహపరచడంలో ఎన్డీఏ విఫలమైందని చెప్పారు.
మోదీని తిరస్కరించారు
గత రెండు ఎన్నికలలో తమిళనాడును మోదీ ఎన్నోసార్లు సందర్శించారని కానీ ప్రజలు ఆయనకు ఎలాంటి మద్దతును అందించలేదని ఆయన ది ఫెడరల్ తో అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం ద్రవిడ మోడల్ నుంచి సంక్షేమ పథకాలు పొందుతున్నాయని, ప్రజలు ద్రవిడ మోడల్ 2.0 నుంచి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
డీఎంకే వంశపారంపార్యం పాలన ఆరోపణలను మోదీ ప్రస్తావించడంపై ఆయన మాట్లాడారు. ‘‘పీయూష్ గోయల్ ఎవరూ? ఆయన తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్(వాజ్ పేయ్) కేంద్ర మంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు పీయూశ్ కూడా కేంద్రమంత్రి. ప్రస్తుత బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ కూడా ఒకప్పుడు బీజేపీ నాయకుడు నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. వారి వంశపారంపర్య రాజకీయాలు కూడా ప్రశ్నలు ఎదుర్కొంటాయి. ఉదయనిధి స్టాలిన్ ప్రజలచేత ఎన్నుకోబడ్డాడు. తరువాత మంత్రి అయ్యాడు. ఇది అనవసర వాదన’’
మోదీ తమిళాన్ని..
కాశీ వీధుల్లో తమిళ్ మాట్లాడే పిల్లలను తాను చూసినట్లు మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో 2021 లో ఇది సుబ్రమణ్య భారతీ ద్వారా స్థాపించబడింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తమిళాన్ని ప్రొత్సహిస్తుందని కూడా ఆయన తన ప్రసంగంలో చెప్పారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఇది సరిగా పనిచేయడం లేదని రచయిత ఏ జీవకుమార్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
బనారస్ లోని వారితో మాట్లాడానికి ది ఫెడరల్ ప్రయత్నించింది. ఇక్కడ దీనికి పూర్తి స్థాయి ప్రొఫెసర్ లేరని యూనివర్శిటీ కూడా ధృవీకరించింది.
‘‘ఈ చైర్ ను 2021 లో స్థాపించారు. నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్, ఒక రీసెర్చ్ స్కాలర్, ఒక అసిస్టెంట్ ఉండాలి. అయితే ఈ ప్రొఫెసర్ ఇప్పటిదాకా రాలేదు. ఇటీవల దీనికోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రొఫెసర్ జీతం విషయంలో యూజీసీ, యూనివర్శిటీకి మధ్య వివాదాలు ఉన్నాయి. దీనివల్ల నియామకం ఆలస్యం అయింది’’ అని సదరు వర్గాలు తెలిపాయి. ఇక్కడ కొన్ని ఉపన్యాసాలు, సెమినార్లు మాత్రమే జరిగాయని, సిబ్బంది కొరత కారణంగా పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగడం లేదని చెప్పారు.
Next Story

