
ఈ సారి ఐపీఎల్‌లో 15 మంది తెలుగు కామెంటేటర్లు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో 170 మంది క్రికెట్ నిపుణులను రంగంలో దించారు.ఐపీఎల్ మ్యాచ్ లపై 15 మంది తెలుగు కామెంటేటర్లు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు.
తెలుగు భాషలో ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఇతర మాజీ క్రికెటర్లు వ్యవహరించనున్నారు. మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఈ సారి తన కామెంట్రీతో ప్రేక్షకులను అలరించనున్నారు. తెలుగు భాషలో మహిళా క్రికెటర్ మిఠాలీరాజ్,అంబటి రాయుడు, హనుమా విహారి, ఎంఎస్ కే ప్రసాద్, ఆర్ శ్రీధర్, టి సుమన్, కల్యాణ్ కృష్ణ, ఆశిష్ రెడ్డి, అక్షత్ రెడ్డి, ఎన్సీ కౌశిక్, కె కొల్లారాం, వీజే శశి, వింధ్య, నందు, ప్రత్యూషలు క్రికెట్ కామెంట్రీ చేయనున్నారు. పంజాబీ, తమిళ్, కన్నడ, మళయాళం, హర్యాన్వీ, బెంగాలీ, భోజ్ పురి, గుజరాతీ, మరాఠీ భాషల్లోనూ వ్యాఖ్యతలు ఐపీఎల్ మ్యాచ్ సందడి గురించి ప్రేక్షకులను కనువిందుచేయనున్నారు.
170 మంది రంగంలో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో మొదటిసారి 170 మంది క్రికెట్ నిపుణులను రంగంలో దించారు. ఈ ఐపీఎల్ మ్యాచ్ లపై జియోస్టార్ లీనియర్ టీవీ, డిజిటల్ లో 12 భాషల్లో 25 ఫీడ్ల ద్వారా క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు. టీవీలో ఇంగ్లీష్ ఫీడ్‌తో పాటు, నెట్‌వర్క్ జియోస్టార్ అంతటా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కవరేజీని అందించనున్నారు. డిజిటల్‌లో 18వ సీజన్ 16 ఫీడ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, హర్యాన్వీ, బెంగాలీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ భాషల్లో క్రికెట్ సమాచారం అందించనున్నారు.
ఎందరో మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాతలుగా...