ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడినా.. కొత్త రికార్డు నెలకొల్పిన ధోని
x
ఎంఎస్ ధోని

ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడినా.. కొత్త రికార్డు నెలకొల్పిన ధోని

అత్యధిక పరుగులు సాధించిన సీఎస్కే బ్యాట్స్ మెన్ గా రికార్డు, రెండో స్థానంలో సురేష్ రైనా


చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్కే, ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత రెండో సారి చెన్నైని దాని సొంతగడ్డపై ఆర్సీబీ ఓడించింది.

ఇది తమిళ అభిమానులకు మింగుడు పడని అంశమే అయినా.. వారి అభిమాన బ్యాట్స్ మెన్ ‘తలా’ ఎంఎస్ ధోని మాత్రం కొత్త రికార్డు సృష్టించి వారికి కాస్త ఆనందం పంచాడు.

గత మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు వచ్చిన కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అప్పటికే మ్యాచ్ దాదాపు ముగిసిసోవడంతో ‘తలా’ బ్యాటింగ్ విన్యాసాలు చూసే అవకాశం వారికి రాలేదు.
కానీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోని వారి కోరిక నెరవేర్చాడు. ఈ సందర్భంగా ధోని కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉండటం చెన్నై అభిమానులు ఆకాశాన్ని అంటేలా సంబరాలు చేసుకునేలా చేసింది.
సీఎస్కే అప్పటికే పరాజయం ఖరారు చేసుకున్నప్పటికీ ధోని బ్యాటింగ్ కు వస్తాడని చాలా మంది అభిమానులు స్టేడియంలోనే వేచి ఉన్నారు. వారికి పూర్తి ధోని పూర్తి వినోదాన్ని అందించాడు.
అలాగే ఈ మ్యాచ్ లో ధోని సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి అగ్రస్థానం లో చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 176 మ్యాచ్ లు ఆడి 171 ఇన్సింగ్స్ లలో 4,687 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్ లో ధోని 4,699 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కానీ ధోని 236 మ్యాచ్ 204 ఇన్సింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. కాగా ఈ మ్యాచ్ లో సీఎస్కే 50 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ గా భారీగా కోల్పోయినట్లయింది.
అదే స్పీడ్ తో స్టంప్ అవుట్..
గత మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ను మెరుపుకంటే వేగంగా స్టంప్ అవుట్ చేసిన ధోని.. ఈ మ్యాచ్ లో అదే సీన్ ను అంతకంటే వేగంగా రీపిట్ చేశాడు. నూర్ అహ్మాద్ బౌలింగ్ లో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతిని ఎదుర్కోవడానికి క్రీజులో కాలు పైకిఎత్తి, కిందికి దించే సమయానికి ధోని బంతిని అందుకోవడం, బెయిల్స్ ను గిరాటేయడం మైక్రో సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది.
ఐపీఎల్ లో సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు..
ఎంఎస్ ధోని- 4,699 పరుగులు(236 మ్యాచ్ లు)
సురేష్ రైనా - 4,687(176)
ఫాఫ్ డు ప్లెసిస్- 2,271(92)
రుతురాజ్ గైక్వాడ్ - 2,433(68)
రవీంద్ర జడేజా- 1,939(174)
అంబటి రాయుడు- 1,932(90)
Read More
Next Story