
ఐపీఎల్ క్రికెట్ ఈనెల 13 తర్వాత పునఃప్రారంభం
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందంతో- అర్థంతరంగా ఆగిన ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది.
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందంతో- అర్థంతరంగా ఆగిన ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. మే 13 తర్వాత ఎప్పుడైనా ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. దేశంలోని భద్రతా పరిస్థితులు నిలకడగా మారుతున్న వేళ, ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఇచ్చిన మౌఖిక సూచనల మేరకు మే 13 లోగా పంజాబ్ కింగ్స్ మినహా మిగిలిన అన్ని జట్ల ఆటగాళ్లు తమ తమ హోం వేదికల్లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. విదేశీ ఆటగాళ్ల రాకకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాల్సిందిగా బీసీసీఐ కోరినట్లు సమాచారం.
ఐపీఎల్ మళ్లీ ప్రారంభించేందుకు కొత్త షెడ్యూల్ రూపకల్పన జరగనుందని, అయితే ప్రారంభ తేది కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. మే 15 లేదా 16 తేదీల్లో ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది.
బీసీసీఐ ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, మిగిలిన 12 లీగ్ మ్యాచ్‌లను డబుల్ హెడర్‌లుగా నిర్వహించి, మే 25 నాటికి టోర్నీని ముగించాలన్న ఉద్దేశం ఉంది. పంజాబ్ కింగ్స్‌కు తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించేందుకు యోచన సాగుతున్నా, ఆ వేదికను ఇంకా ఖరారు చేయలేదు.
ఐపీఎల్ అభిమానుల్లో మరోసారి క్రికెట్ పండుగకు రంగం సిద్ధమవుతోంది. భద్రతా పరిస్థితులు అనుకూలిస్తే, బలమైన క్రికెట్ ఉత్సవాన్ని తిరిగి చూడబోతున్నామని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Next Story