
సెకండాఫ్ లో మ్యాచ్ ను మా నుంచి దూరమైపోయింది: రహానే
లోయర్ ఆర్డర్ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయిందన్న కేకేఆర్ కెప్టెన్
ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచులో ఢిపెండిగ్ ఛాంపియన్ కోల్ కత నైడ్ రైడర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మధ్య ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడం మ్యాచ్ మొత్తం మలుపు తిరగడానికి కారణమైందని కెప్టెన్ రహానే అభిప్రాయపడ్డారు.
‘‘13 ఓవర్ వరకు మాత్రమే మేము బాగానే ఉన్నామని నేను అనుకున్నాను. కానీ రెండు లేదా మూడు వికెట్లు ఈ ఊపును మార్చాయి. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లు తిరిగి తమ వంతు ప్రయత్నం చేశారు.
కానీ అది ఫలించలేదు. వెంకీ( వెంకటేష్ అయ్యర్), నేడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200-210 సాధించవచ్చని చర్చించుకున్నారు. కానీ ఆ వికెట్లు స్కోర్ బోర్డుకు బ్రేకులు వేశాము’’ అని రహానే మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించారు.
బ్యాట్ తో పవర్ ప్లే..
ఆరంభంలోనే కేకేఆర్ క్వింటాన్ డికాక్ వికెట్ కోల్పోయింది. కానీ మరో ఒపెనర్ సునీల్ నరైన్ తో జత కలిసిన రహానే బౌలర్లకు ఎదురుదాడి ప్రారంభించాడు. ముఖ్యంగా రహానే ప్రతి బాల్ ను టైమింగ్ తో బాదిన తీరు అద్బుతం.
మొదటి పది ఓవర్లలో జట్టు స్కోర్ వంద దాటింది. కానీ రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ రావడంతో ఈ జట్టు తప్పటడుగులు వేసింది. ముఖ్యంగా కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయడంతో జట్టు స్కోర్ 145/5 తో తడబడింది. దీనినే రహానే ఒప్పుకున్నారు. ఈ కారణంగానే కేకేఆర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.
‘‘కొంచెం మంచు కురిసింది. కానీ వారు బ్యాటింగ్ లో చాలా మంచి పవర్ ప్లేను ప్రదర్శించారు. అది అంతగా లేదు. మేము 200 కంటే ఎక్కువ స్కోర్ కోసం చూస్తున్నాము. ఈ ఆట గురించి మేము ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేదు. కానీ అదే సమయంలో కొన్ని రంగాలలో మెరగ్గా ఉండటానికి ప్రయత్నించాలి’’ అని రహానే చెప్పారు.
కేకేఆర్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆ లక్ష్యం ఏ మాత్రం సరిపోలేదు. తొలి వికెట్ కు వీరు 95 పరుగుల ఒపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరకు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు.
Next Story