
సీఎస్కే, ఎంఐ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు
వచ్చే సీజన్ కు అందుబాటులో ఉంటా: ధోని
చెన్నైకి ఉత్తమమైన ఎలెవన్ ను తీసుకురావడమే ముఖ్యమన్న సీఎస్కే సారథి
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ లో తాను ఆడబోతున్నానని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత సీఎస్కే సారథి ఎంఎస్ ధోని సూచన ప్రాయంగా చెప్పాడు. వాంఖడే లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోయిన అనంతరం ధోని మాట్లాడారు.
వచ్చే సీజన్ లో సురక్షితమైన ఎలెవన్ ను తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. 2025 సీజన్ మాత్రమే ధోని కనిపిస్తాడని చాలారకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే మాజీ సారథి వీటికి అన్నింటికి నిన్న జరిగిన మ్యాచ్ తో చెక్ పెట్టాడు.
పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై..
ఐదుసార్లు ఛాంఫియన్ అయిన సీఎస్కే ఎనిమిది మ్యాచ్ లు కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ జట్టుకు మరో ఆరు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. అన్ని మ్యాచ్ లు వరుసగా గెలిచిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం కనిపించడం లేదు.
వాంఖడే స్టేడియంలో ఎంఐ జట్టు సీఎస్కేని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడారు. ‘‘మనం సరైన ఫార్మాట్లాలో క్రికెట్ ఆడుతున్నామో లేదో చూడాలి’’ అని వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది పెద్దగా మార్పులు ఉండవు..
ఆటగాళ్లు అనుకున్నంతగా కృషి చేయడం లేదని ధోని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదికి కోర్ టీమ్ ను గుర్తించే పనికి దగ్గరగా ఉన్నామని కూడా చెప్పాడు. ‘‘మన ముందు గెలవాల్సిన అన్ని ఆటలతో, మనం ఒక్కొక్క ఆటను మాత్రమే ఆడుతుంటాము, కొన్నింటిని ఓడిపోయినప్పటికీ వచ్చే ఏడాదికి సరైన జట్టును పొందడం మాకు ముఖ్యం’’ అని ధోని అన్నాడు.
‘‘చాలామంది ఆటగాళ్లను మార్చకూడదనుకున్నాము. అర్హత సాధించడానికి ప్రయత్నించడం ముఖ్యం. కాకపోతే వచ్చే ఏడాదికి సురక్షితమైన 11 మందిని గుర్తించాలి’’ అని ధోని చెప్పాడు.
‘‘మనం మంచి క్రికెట్ ఆడటం వల్లే విజయాలు సాధించాము. అదే సమయంలో మనం మంచి క్రికెట్ ఆడనప్పుడూ దాని గురించి ఎక్కువగా భావోద్వేగానికి గురికాకుండా ఉండటం, అదే సమయంలో, ఆచరణాత్మకంగా ఉండాలనుకోవడం ముఖ్యం’’ అని జార్ఖండ్ డైనమెట్ వ్యాఖ్యానించారు.
రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన తరువాత తిరిగి చెన్నై పగ్గాలు చేపట్టిన ధోని అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదు. చెన్నై చివరిగా సారిగా 2023 టైటిల్ ను గెలుచుకుంది.
Next Story