
ఈ ఎడిషన్ లో అయినా చెన్నైపై ఆర్సీబీ గెలుస్తుందా?
గత కొన్ని ఎడిషన్ లలో వరుసగా చెన్నై చేతిలో ఓడిపోతున్న ఆర్సీబీ
ఐపీఎల్ రేపు ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సీఎస్కేతో ఆర్సీబీ తలపడబోతోంది. ఇది బెంగళూర్ కు శక్తికి మించిన పని. గత తొమ్మిది ఎడిషన్ లలో చెన్నై వేదికగా జరిగిన ఒక మ్యాచ్ లో కూడా ఆర్సీబీ గెలవలేదు.
చివరిగా 2008 లో తొలి ఎడిషన్ లో ప్రారంభ మ్యాచ్ లో మాత్రమే ఒక్కసారిగా గెలిచింది. అప్పుడూ, ఇప్పుడూ జట్టులో ఉన్న ఏకైక వ్యక్తి విరాట్ కోహ్లి మాత్రమే. రేపటి మ్యాచ్ లో కూడా ఆర్సీబీ గెలవడం కష్టమే.
ముంబాయితో ఇప్పటికే జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఇటూ ఆర్సీబీ కూడా తన తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతాకు షాక్ ఇచ్చింది.
చెన్నైలో స్పిన్ ట్రాక్..
చెన్నై పిచ్ ఎప్పటిలాగే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సీఎస్కేకు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అశ్విన్, జడేజా తో పాటు నూర్ అహ్మాద్, రచిన్ రవీంద్ర వంటి బౌలర్లు ఉన్నారు.
గత ఏడాది జరిగిన మెగా వేలంలో అశ్విన్ ను తిరిగి తీసుకున్నాక ఆ జట్టు బౌలింగ్ బలం పెరిగింది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో వీరు చాలా బాగా బౌలింగ్ చేయగలిగారు.
మొత్తం 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసి, కేవలం 70 పరుగులు మాత్రమే ఇచ్చారు. గత మ్యాచ్ లో లాగే ఈసారి కూడా ఇదే స్పిన్ తంత్రాన్ని బెంగళూర్ పై ప్రయోగించే అవకాశం ఉంది.
కోహ్లి, ఆర్సీబీ బ్యాటింగ్ పై దృష్టి..
సీఎస్కే బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఆర్సీబీ చాలా శ్రమించాల్సి ఉంది. ఈ బాధ్యతను కోహ్లి ముందుండి తీసుకోవాల్సి ఉంటుంది. గత కొంతకాలం క్రితం వరకూ కోహ్లి బ్యాటింగ్ లో బలమైన అనుకున్నంత విధంగా ఫామ్ లో లేడు.
ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం లో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ బలహీనతలను అధిగమించి పరుగులు రాబట్టడానికి కోహ్లి ఎక్కువగా శ్రమిస్తున్నాడు.
ఇప్పుడు కోహ్లితో పాటు ఫిల్ సాల్ట్ తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్, లియామ్ లివింగ్ స్టన్, జితేశ్ శర్మవంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. వారి ఈ మ్యాచ్ లో రాణిస్తే కనీసం 170 పరుగులు సాధించడం కష్టమే కాదు.
ధోని బ్యాటింగ్ కు వస్తాడా?
చెపాక్ పిచ్ ను పరిశీలించాక ఆర్సీబీ తన తుది జట్టులోకి ఇంగ్లండ్ ఆల్ రౌండర్లు జాకబ్ బెథెల్ ను తీసుకునే అవకాశం కూడా ఉంది. టిమ్ డేవిడ్ స్థానంలో బెథెల్ వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా కేకేఆర్ తొలి మ్యాచ్ కు దూరమైన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్ నెస్ సాధిస్తే తుది జట్టులోకి రావచ్చు.
మరో వైపు గత మ్యాచ్ లో శివమ్ దూబే, దీపక్ హుడా, సామ్ కర్రాన్ ముంబైతో జరిగిన మ్యాచ్ లో విఫలమవడంతో సూపర్ కింగ్స్ తమ మిడిల్ ఆర్డర్ క్లిక్ కావాలని ఆశిస్తోంది.
గత మ్యాచ్ లో రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ రాణించడంతో జట్టు విజయం సాధించింది. అయితే అభిమానులకు నిరాశ కలిగించిన అంశం ఏంటంటే.. తలా ‘ధోని’ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం. మ్యాచ్ పూర్తి అయ్యే చివరకు బ్యాటింగ్ వచ్చాడు.
ముంబైతో జరిగిన మ్యాచ్ లో తుది జట్టుకు దూరమైన మతిషా పతిరానా ఫిట్ నెస్ సాధిస్తే సీఎస్కే నిశితంగా ఉంటుంది. ఇదే జరిగితే నాథన్ ఎలిస్ తుది జట్టుకి దూరంగా ఉండవచ్చు.
ఈ మ్యాచ్ రేపు రాత్రి 7.30కి ప్రారంభం అవుతుంది.
Next Story