
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు
పాక్ పై ఆపరేషన్ సింధూర్ మొదలైంది. ఇప్పటికి 30 మంది చనిపోయారు.
భారత సాయుధ దళాలు బుధవారం (మే 7, 2025) తెల్లవారుజామున పాకిస్తాన్ పై 'ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాయి. పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయని ప్రభుత్వం ప్రకటించింది.
"పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై కేంద్రీకృత దాడులు జరిగాయి. ఇవి సరిహద్దు ఉగ్రవాద ప్రణాళిక మూలాలను లక్ష్యంగా చేసుకున్నాయి" అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సోషల్ మీడియా ఎక్స్ (X) లో తెలిపారు.
పాకిస్తాన్ సైన్యం పూంచ్, రాజౌరిలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న గ్రామాల వెంబడి పెద్దఎత్తున ఆయుధాలతో మోహరించి ఉన్నట్టు సమాచారం. రాజౌరి జిల్లాలోని పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మంకోట్, లామ్, మంజాకోట్, గంబీర్ బ్రాహ్మణ నుండి బాంబు దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని విమాన రవాణా సర్వీసులను నిలిపివేశారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం (మే 6, 2025) పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి సన్నాహాలను సమీక్షించారు. వీటిలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లపై మాక్ డ్రిల్‌లు నిర్వహించడం, "శత్రు దాడి" జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌరులకు శిక్షణ ఇవ్వడం, బంకర్‌లు, కందకాలను శుభ్రపరచడం వంటివి ఉన్నాయి.
ఇంతలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చర్చించింది. ఇక్కడ రాయబారులు ఉద్రిక్తతలను తగ్గించడానికి పిలుపునిచ్చారు.
యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఇలా...
జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనను యావత్ భారతదేశంతో పాటు పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు సరైన సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా హెచ్చరించారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్‌పై ఊహించని విధంగా భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి. పీవోకేలో 9 ప్రాంతాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. పీఓకేతో పాటు పాకిస్తాన్‌లో మౌలిక సదుపాయాలను కూడా భారత దళాలు ధ్వసం చేశాయి. ఈ దాడిలో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మృతిచెందగా పలువురు గాయపడినట్లు సమాచారం.
అర్థరాత్రి 1.44 గంటలకు దాడి...
మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశ వ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ‘భారత్ మాతా కీ జై’ పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Next Story