మెరుగైన ఆటతో.. ఇంగ్లాండ్ గెలిచింది..
మొదట్లో బాగానే ఉన్నా.. చివరకు ఢీలా పడిన ఇండియా
ఈ సిరీస్ లో ఇది మూడో మ్యాచ్. ఇంగ్లాండ్ కి అత్యంత కీలకమైనది. ఇది ఓడిపోతే సీరిస్ పోయినట్లే. సిరీస్ ని కాపాడుకోవడంతోపాటు, మొదటి విజయం కోసం ఈ మ్యాచ్ గెలవడం ఇంగ్లాండ్ కు చాలా అవసరం…. ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో భారత జట్టు కన్నా మెరుగ్గా ఆడింది.. గెలిచింది.. భారత్ ను సిరీస్ గెలవకుండా ఆపింది. మిగతా రెండు మ్యాచ్ లపై ప్రేక్షకుల ఆసక్తిని నిలిపింది.
అంతగా ఆసక్తి కలిగించని భారత బ్యాటింగ్
రాజ్ కోట్ లో ఈరోజు (28.01.24) జరిగిన మూడో వన్డే లో భారత జట్టుపై ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉందని చెప్పలేము గాని, మొదటి రెండు మ్యాచ్ లలో అలవోకగా గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ అలా ఆడలేదు. ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనపడిన విషయం ఏంటంటే.. మూడుసార్లు టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్, భారత జట్టు కోసం మ్యాచ్ గెలిపించలేకపోయాడు.
మూడుసార్లు ఫెయిల్ అయిన సూర్యకుమార్
ముచ్చటగా మూడోసారి సూర్య కుమార్ యాదవ్, బ్యాటింగ్ లో ఫెయిల్ అయినప్పటికీ టాస్ గెలిచడంలో మాత్రం సఫలమయ్యాడు. ఇంగ్లాండ్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో భారత్, ఈ మ్యాచ్ గెలిచి , బోణీ చేసి ముందుకు వెళ్లాలన్న కృత నిశ్చయంతో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టగానే, మొదటి రెండు మ్యాచ్లలో మాదిరి, యధాప్రకారం బట్లర్ రెండవ ఓవర్ లోనే బ్యాటింగ్ కు రావాల్సి వచ్చింది. మొదటి రెండు ఓవర్లలో మంచి రన్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు డకెట్ నాలుగో ఓవర్ లో నాలుగు బౌండరీలు సాధించడంతో స్కోరు పరుగులు తీసింది. అలా 5 ఒవర్ లలో 49 పరుగులు చేసింది.
రాణించిన డకెట్- ఇంగ్లాండ్ మెరుగైన స్కోర్
మొదటి రెండు మ్యాచ్లలో బ్యాటింగ్ బాధ్యతలు తీసుకొని పరుగు సాధించిన బట్లర్, డకెట్ బ్యాటింగ్ ను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆరు ఓవర్ల పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు 52 పరుగులు చేసి ఒక మాదిరి పెద్ద స్కోరు వైపుకి పరుగులు తీసింది. బిష్నోయ్ బౌలింగ్లో ఒక సిక్స్ కొట్టి జట్టు కెప్టెన్ బట్లర్ తాను కూడా ఉన్నానని చూపించాడు. 8 వ ఓవర్ లో అక్షర పటేల్ అంతా ప్రభావ వంతంగా అనిపించలేదు. 9 పరుగులు ఇచ్చాడు. 2 మ్యాచ్ లలో బౌలింగ్ తో ఆకట్టుకున్న వరుణ్ కూడా అంత ప్రభావంతంగా అనిపించలేదు. అయితే తర్వాతి ఓవర్ లో పటేల్ బట్లర్ ను అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్ డకెట్ 26 పరుగుల్లో తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కానీ మరుక్షణమే అక్షర పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండు 10 ఒవర్ లు పూర్తయ్యే సమయానికి 87 పరుగులు చేసింది. భారత జట్టు వైస్ కెప్టెన్ అక్షర పటేల్ మరో సారి ప్రభావాన్ని చూపించాడు. పటేల్ దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాటింగ్ జోరు కొంచెం తగ్గింది.
తర్వాత లివింగ్ స్టోన్ ఒక సిక్సర్ కొట్టి తన ఆగమనాన్ని తెలియజేశాడు. రవి బౌలింగ్ కూడా అంతగా ప్రభావం చూపలేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లివింగ్ స్టోన్ ను బోల్ట్ చేసి ఇంగ్లాండ్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. 14 ఓవర్లో వరుణ్ చక్రవర్తి వరుసగా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టాడు.
వరుణ్ దెబ్బకి- ఇంగ్లాండ్ గిలగిల
వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను ఎదుర్కోవడం లో ఇంగ్లాండ్ జట్టు ఇబ్బంది పడింది. ముగ్గురు స్పిన్నర్లు ఉన్నట్టుండి తమ ప్రభావాన్ని చూపించారు.15 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి న ఇంగ్లాండ్ జట్టుకి 124 పరుగులు మాత్రమే వచ్చాయి. లివింగ్ స్టన్ ఒంటరి పోరాటం చేశాడు కాని, తర్వాతి ఓవర్ లో హార్దిక్ పాండ్యా లివింగ్ స్టన్ ను ఔట్ చేసి మ్యాచ్ ను కొంత మలుపు తిప్పాడు. ఆర్చర్ ను బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి.. 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్ళు చల్లాడు. లివింగ్ స్టన్, రవి బిష్ణోయి బౌలింగ్ లో 2 సిక్స్ లు కొట్టి ఇంగ్లాండ్ జట్టులో కొంత ఉత్సాహాన్ని నింపాడు. రవి బౌలింగ్ లో వచ్చిన 19 పరుగులు మ్యాచ్ ను ఒక మలుపు తిప్పాయి. తర్వాతి ఓవర్ లో హార్దిక్ పాండ్యా లివింగ్ స్టన్ ను ఔట్ చేసి మ్యాచ్ ను కొంత మలుపు తిప్పాడు. వరుణ్ ఇంగ్లాండ్-ఇండియా సిరిస్ లలో 5 వికెట్లు తిసిన మొదటి బౌలర్ అయ్యాడు.ఈ సిరిస్ లో మొదటి సారి అడిన షమి అంతగా ప్రభావం చూపలేదు 3 ఓవర్ లలో 25 పరుగులు ఇచ్చాడు. షమీ బౌలింగ్లో ఆ వాడి కనిపించలేదు. ఇంగ్లాండ్ జట్టు చివరికి 171 పరుగులు చేసింది. చెన్నైలో జరిగిన మ్యాచ్ కన్నా ఇది కొంచెం మెరుగైన, గెలవగల స్కోర్ గా అనిపించింది.
మొదట్లో బాగానే ఉన్నా.. చివరకు ఢీలా పడిన బ్యాటింగ్
భారత జట్టు బ్యాటింగ్ మొదటి ఓవర్ లోనే ధాటిగా ప్రారంభించింది. ఆ ఓవర్ లో 15 పరుగులు వచ్చాయి కానీ, జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ శామ్సన్ వికెట్ కోల్పోయింది. అంత వరకు ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ ఆర్చర్ పట్టిన ఒక సూపర్ క్యాచ్ తో అవుట్ కావడం కావడంతో ఇంగ్లాండ్ జట్టులో కొంచెం ఉత్సాహం వచ్చింది.
మొదటి రెండు మ్యాచ్ లలో విఫలమైన జుట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒక సిక్స్ కొట్టి తన పరుగుల ఖాతా ప్రారంభించాడు. రెండు వికెట్లు పోయినప్పటికీ భారత జట్టు 5 ఓవర్లు పూర్తయిసరికి 48 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు జవాబు ఇచ్చింది. అయితే అట్టహాసంగా తన బ్యాటింగ్ ను ప్రారంభించిన సూర్య కుమార్ యాదవ్ ఇంగ్లాండ్ జట్టు బౌలర్ వుడ్ వేసిన మొదటి బంతికే అవుట్ కావడంతో కాస్త రసవత్తరంగా మారింది.
ప్రేక్షకులను కాసింత నిరాశపరిచిన.. తిలక్ వర్మ
తిలక్ వర్మ బ్యాటింగ్ కి రాగానే గ్రౌండ్ లో ఉత్సాహం పెరిగింది. చెన్నైలో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ 72 ఇన్నింగ్స్ ను ప్రేక్షకులు మర్చిపోలేదు. మరోసారి జట్టు కొంచెం తడ బడి నందువల్ల ఈసారి కూడా తిలక్ వర్మ బ్యాటింగ్ మీద భారత్ జట్టు ఆధారపడింది. గత మ్యాచ్ లాగానే ఈసారి కూడా తిలక్ వర్మ ఆడాలని ప్రేక్షకులు భావించడం సహజం. అయితే ప్రేక్షకులను, తిలక్ వర్మను నిరాశపరిచాడు ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ ఆఫ్ స్టంప్ అవతలపడి ఎల్ షేప్ లో పంపు తిరిగిన ఒక అద్భుతమైన బంతితో తిలక్ ను క్లీన్ బౌల్డ్ చేయడం తో మైదానంలో కొంతసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఈ స్థితిలో మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉత్పన్నమైంది. మ్యాచ్ ఫైనల్ ఓవర్ థ్రిల్లర్ గా మారవచ్చునని అనిపించింది.
ఇక మ్యాచ్ ను గెలిపించే బాధ్యత హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ ల పైన పడింది. మ్యాచ్ కొంచెం రసకందాయంలో పడింది 10 ఓవర్ల తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ సాధించిన స్కోర్ కన్నా కొంచెం వెనకబడి ఉంది. ఈ పరిస్థితిలో నువ్వా నేనా అన్నట్లుంది.
ఈ దశలో 55 మంత్రుల్లో బంతుల్లో 91 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు బౌలర్ జేమి ఒవెర్టన్ వాషింగ్టన్ సుందర్ ని అవుట్ చేయడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు ఒగ్గింది. 85 పరుగులకు ఐదు వికెట్లు, ఇంకా 47 బంతుల్లో 87 పరుగులు చేయాల్సిన పరిస్థితి. మూడవ వన్డే లో మొదటిసారి ఇంగ్లాండ్ ది పై చేయి అనిపించింది.
ఇంగ్లాండ్ బౌలర్ల మెరుగైన బౌలింగ్
30 బంతుల్లో 72 పరుగులు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ , ఇద్దరిలో ఎవరో ఒకరు గెలిపించే ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్ నెమ్మదిగా భారత్ చేతిలోంచి జారిపోయే పరిస్థితి ఏర్పడింది. బౌండరీలు సిక్సర్లు కరువయ్యాయి. స్కోరు ఒకటి రెండు పరుగులు తో ముందుకు వెళ్లడం మొదలైంది., ప్రేక్షకుల్లో నిరాశ వచ్చేసింది.
నాలుగు ఓవర్లలో 64 పరుగులు. ఇప్పుడు ఒక ఓవర్ కి 16 పరుగులు చేయవలసిన పరిస్థితి. కచ్చితంగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ మ్యాచ్ గెలిచే పరిస్థితి లేదు. 20 బంతులలో 54 పరుగులు చేయాల్సిన పరిస్థితి.
భారత్ పేలవమైన బ్యాటింగ్
చివరగా 18 బంతుల్లో అర్థ శతకం చేయాల్సిన పరిస్థితి. అక్షర పటేల్ ఆర్చర్ బౌలింగ్లో పాయింట్లో ఉన్న ఆదిల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరి రెండు ఒవర్ ల లో 41 పరుగులు చేయాలి. హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో ప్రేక్షకుల్లో జట్టులో నిరాశ నిస్సృహలు. చివరి పదివంతుల్లో బ్యాట్స్మెన్ కొట్టిన ప్రతి బంతి గీత నైనా దాటాలి, గీత అవతల అన్న పడాలి అన్న పరిస్థితిలో చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడుతున్న షమీ ఒక సిక్స్ కొట్టి ప్రేక్షకులను అలరించాడు కానీ, మ్యాచ్ గెలవడం దాదాపు అసాధ్యంగా మారింది. చివరికి ఆరు బంతులు..32 పరుగులు. చేతిలో ఒక వికెట్ ఉంది. ప్రతి బంతిని సిక్స్ గా మలిచినా మ్యాచ్ గెలవలేరు.
చివరికి ఇంగ్లాండ్ భారత్ కన్నా కొంచెం మెరుగ్గా ఆడింది... మ్యాచ్ గెలిచింది. భారత జట్టు 9 వికెట్ ల నష్టానికి 145 పరుగులు చేసింది . ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.
స్కోర్ బోర్డ్:
ఇంగ్లాండ్ బ్యాటింగ్:
171 పరుగులు/09 వికెట్లు (20 ఓవర్లు)
బట్లర్ 24 పరుగులు (22 బంతులు)
బెన్ డక్కెట్ 51 పరుగులు (28 బంతులు)
లివింగ్స్టన్ 43 పరుగులు (24 బంతులు)
భారత్ బౌలింగ్:
హార్దిక్ పాండ్య 2 వికెట్లు (4 ఓవర్లు)
వరున్ చక్రవర్తి 5 వికెట్లు (4 ఓవర్లు)
అక్సర్ పటేల్ 1 వికెట్ (3 ఓవర్లు)
బిష్నోయ్ 1 వికెట్ (4 ఓవర్)
భారత్ బ్యాటింగ్:
145 పరుగులు/ 9 వికెట్లు (20 ఓవర్లు)
అభిషేక్ శర్మ 24 పరుగులు (14 బంతులు)
హార్దిక్ పాండ్యా 40 పరుగులు (35 బంతులు)
ఇంగ్లాండ్ బౌలింగ్:
ఆర్చర్ 2 వికెట్లు (4 ఓవర్లు)
ఆదిల్ రషిద్ 1 వికెట్ (4 ఓవర్లు)
బ్రైడన్ కార్సె 2 వికెట్లు (4 ఓవర్లు)
మార్క్ ఉడ్ 1 వికెట్ (3 ఓవర్లు)
జేమి ఒవెర్టన్ 3 వికెట్లు (4 ఓవర్లు)
లివింగ్స్టన్ 0 వికెట్ (1 ఓవర్)