అహ్మాదాబాద్ టీ20: ఓటమి అంచున టీమిండియా
x
భారత ఆటగాళ్లు

అహ్మాదాబాద్ టీ20: ఓటమి అంచున టీమిండియా

క్రీజులో నిలబడటానికే ఇబ్బంది పడ్డ భారత బ్యాట్స్ మెన్


సూపర్ ఎయిట్ పోరులో భాగంగా దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. పది ఓవర్లలో కేవలం 51 పరుగులే చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది.

ప్రోటీస్ జట్టుకు ఆదిలోనే బూమ్రా షాక్ ఇచ్చాడు. ఫామ్ లో ఉన్న డికాక్ ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ సాధించాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ కూడా పెవిలియన్ చేరాడు. తరువాత ఓవర్లో మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రికిల్ టన్ కూడా బూమ్రా పెవిలియన్ పంపాడు. దీనితో దక్షిణాఫ్రికా 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 20/3 తో నిలిచింది.

అయితే క్రీజులో కుదురుకున్న బ్రెవిస్(45) కు తోడుగా మిల్లర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరు ఎడాపెడా బౌండరీలు బాది ఐదో వికెట్ కు ఏకంగా 97 పరుగులు జోడించి సౌతాఫ్రికాను సురక్షిత స్థానానికి చేర్చారు. ముఖ్యంగా మిల్లర్(63) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్లు ఎవరనేది చూడకుండా బౌండరీలు సాధించాడు. బ్రెవిస్ కూడా భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జంటను దూబె విడదీశాడు. తరువాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్(44) కూడా భారీ షాట్లు ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది.

భారత బౌలర్లలో జస్పీత్ బూమ్రా ఒక్కడే తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. వరుణ్ చక్రవర్తి, హర్డిక్ పాండ్యా, శివమ్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
188 పరుగుల ఛేజింగ్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు తొలి ఓవర్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మార్క్రమ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి మిడ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చాడు. తరువాత ఓవర్ లో తిలక్ ను యన్ సేన్ వెనక్కి పంపాడు. ప్రారంభ ఓవర్లలో ప్రోటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పరుగులు సాధించడం కష్టంగా మారింది. పవర్ ప్లే ముగిసే నాటికి భారత్ కేవలం 30 పరుగులు మాత్రమే సాధించిందంటే వారు ఎలా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
భారత్ ఏ దశలోనూ ఛేజింగ్ చేస్తున్నట్లు కనిపించలేదు. అభిషేక్, వాషింగ్టన్ అయితే బ్యాట్ ఊపే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు.


Read More
Next Story