ఆటగాళ్లంతా ఇక నుంచి డొమెస్టిక్ లో ఆడాల్సిందే: బీసీసీఐ
x

ఆటగాళ్లంతా ఇక నుంచి డొమెస్టిక్ లో ఆడాల్సిందే: బీసీసీఐ

స్టార్ సంస్కృతికి దూరం పెడుతూ కఠిన నిర్ణయం తీసుకున్న బోర్డు


భారత క్రికెట్ లో చాలాకాలంగా కొనసాగుతున్న స్టార్ కల్చర్ సంస్కృతికి బీసీసీఐ తెరదించింది. క్రికెట్ నియంత్రణ మండలి కొత్తగా ఓ పాలసీ డాక్యుమెంట్ ను గురువారం విడుదల చేసింది. ఆటగాళ్ల క్రమశిక్షణ, ఐక్యమత్యంగా ఉండేందుకు గాను 10 నిబంధనలు అందులో పొందుపరిచింది.

ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే.. ఇక నుంచి ఆటగాళ్లు కచ్చితంగా రంజీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లను ఆడాల్సిందే అని నిబంధన అమల్లోకి రానుంది. అలాగే తమ కుటుంబ సభ్యులతో గడిపే విషయంతో పాటు వ్యక్తిగత మేనేజర్లు, కమర్షియల్ ఎండార్స్ మెంట్లు విషయంలో కూడా ఇప్పుడున్న విపరీతమైన స్వేచ్ఛ లో బోర్డు కోత విధించింది. ఈ నిబంధనలు పాటించే విషయంలో ఏ ఆటగాడైన విఫలమయితే జరిమానాలు ఉంటాయని బీసీసీఐ హెచ్చరించింది.
గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో జరిగిన రెండు సిరీస్ ల్లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్ ఆటగాళ్ల వ్యవహర శైలిపై బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో ఆటగాళ్ల విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరించిందని తెలుస్తోంది.
ఈ పది నిబంధనలు ఏంటంటే..
1. డెమోస్టిక్ మ్యాచ్ లు ఆడాల్సిందే: ఇక నుంచి జాతీయ జట్టుకు ఎంపిక దీనినే ప్రమాణంగా తీసుకుంటారు. అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కూడా డెమోస్టిక్ ఆటను ప్రమాణంగా తీసుకుంటామంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సీనియర్ల ఆటగాళ్లతో వర్థమాన క్రికెటర్లు ఆడటం వల్ల వారి ప్రతిభ మెరుగవుతుందని బీసీసీఐ అభిప్రాయపడింది. అలాగే ఆటగాళ్ల ఫిట్ నెస్ మెరుగుపడటానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. డెమోస్టిక్ విధానం కూడా బలపడుతుంది. ఏదైనా ఆటగాడికి మినహాయింపు ఇవ్వాలంటే ముందుగా సెలక్షన్ కమిటీకి చెప్పాలని, మినహాయింపులో న్యాయబద్ధత ఉంటే వారు ఆమోదిస్తారు.
2. కచ్చితంగా కలిసే ప్రయాణం చేయాలి: ఇంతకుముందు ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ప్రయాణించేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఆటగాళ్లు ఒకే టీమ్ బస్సులో ప్రయాణించాలి. ఆటగాళ్లంతా తమది ఒకే జట్టు అన్న భావం కలిగించడం, క్రమశిక్షణ తో వ్యవహరించడం ముఖ్యం. ఏదైన మినహాయింపులు ఉంటే ముందస్తుగా హెడ్ కోచ్, సెలక్షన్ కమిషన్ చీఫ్ ల ఆమోదం అవసరం.
3. లగేజీ విషయంలో..: ఇక నుంచి ఆటగాళ్ల లగేజీ విషయంలో కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఆటగాడికి కేవలం 150 కిలోల వరకూ కేవలం పరిమితి. అంతకుమించితే ఆటగాళ్లే తమ లగేజీకి డబ్బులు కట్టుకోవాలి.
లగేజీ పాలసీ
ఏదైన టూర్ 30 రోజులకు మించితే..
ఆటగాళ్లు- 5 బ్యాగులు( 3 సూట్ కేసులు+ 2 కిట్ బ్యాగులు) లేదా 150 కేజీలు
సపోర్ట్ స్టాప్ - 2 పీసేస్ లు( 2 బ్యాగులు+ 1 చిన్న సూట్ కేసులు) లేదా 80 కేజీలు
ముప్పై రోజుల కంటే తక్కువ టూర్లు
ఆటగాళ్లు - 4 పీసులు( 2 సూట్ కేసులు + 2 కిట్ బ్యాగులు) లేదా 120 కేజీలు
సపోర్టు స్టాప్- 2 ( 2 సూట్ కేసులు లేదా 60 కేజీలు)
హోమ్ సిరీస్ లు
ఆటగాళ్లు 4 ( 2 రెండు సూట్ కేసులు + 2 కిట్ బ్యాగులు) లేదా 120 కేజీలు
సపోర్ట్ స్టాప్ - 2 రెండు బ్యాగులు లేదా 60 కేజీలు
4. వ్యక్తిగత సిబ్బంది విషయంలో : వ్యక్తిగత సహయకుల విషయంలో కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పర్సనల్ మేనేజర్లు, చెఫ్ లు, సెక్యూరిటీ విషయంలో కూడా ఇక నుంచి బీసీసీఐ అనుమతి అవసరం. ఇక నుంచి బయటకు విషయాలపై దృష్టి కేంద్రీకృతం కాకుండా ఇవన్నీ సాయపడతాయి.
5. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ: ఇక నుంచి ఆటగాళ్లు ఏదైన వస్తువులను పంపే విషయంలో కచ్చితంగా మేనేజ్ మెంట్ తో ఆటగాళ్లు సమన్వయం చేసుకోవాలి. అలాగే బెంగళూర్ లోని ఎక్స్ లెన్సీకి పంపే విషయంలో కూడా ఇలాగే వ్యవహరించాలి. ఏదైన ఎక్స్ ట్రా వస్తువులు పంపితే దానికి ఆటగాళ్లే బాధ్యత వహించాలి.
6. ప్రాక్టీస్ సెషన్ లకు హజరుకాకపోతే: ఆటగాళ్లు కచ్చితంగా షెడ్యూల్ చేసిన విధంగా ప్రాక్టీస్ సెషన్ కు రావాలి. హోటల్ నుంచి ప్రాక్టీస్ సెషన్ కు కూడా ఒకే ట్రావెల్ బస్సులో రావాలి. క్రికెట్ బాధ్యతలు కచ్చితంగా నెరవెర్చాలి.
7. పర్సనల్ షూట్: ఆటగాళ్లు ఎండార్స్ మెంట్ల షూటింగ్ లు సిరీస్ ల మధ్య షూట్ చేయడానికి వీలులేదు. సిరీస్ మధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు.
8. ఫ్యామిలి ట్రావెల్ పాలసీ:
టీమ్ కమిట్ మెంట్స్ విషయంలో ఫ్యామిలీ, ఆటను సమన్వయం చేసుకోవాలి. ఏదైన టూర్ 45 రోజులు మించితే ఫ్యామిలితో గడపడానికి అవకాశం ఉంది. అలాగే విజిటర్స్ కలవడంలో కూడా జట్టుకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి.
9. బీసీసీఐ ఆఫిషియల్ షూట్స్ : ఆటగాళ్లు బీసీసీఐ కి సంబంధించిన అధికారిక షూట్ లకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ప్రమోషనల్ ఆక్టివిటీస్, ఫంక్షన్ లకు హజరుకావాలి. ఇవీ బీసీసీఐ ప్రమోటర్లకు, ఆట పురోగతి సాధించడానికి అవసరం. కాబట్టి ఆటగాల్లు నిరాకరించడానికి వీలులేదు.
10. సిరీస్ లు ముందుగానే ముగిసినా: ఏదైన పర్యటనలో, లేదా మ్యాచ్ లో అనుకున్న సమయం కంటే ముందే ముగిసినా ఆటగాళ్లు కలిసే ఉండాలి. అదే టీమ్ బాండింగ్ ను పెంచుతుంది. ఏదైన మినహయింపు కావాలంటే కచ్చితంగా సెలక్షన్ కమిటీ చైర్మన్, హెడ్ కోచ్ అనుమతి అవసరం.
ఈ నిబంధనలు అన్ని కచ్చితంగా ఆటగాళ్లు పాటించాల్సిందే అని బోర్డు స్పష్టం చేసింది. ఎవరికి మినహయింపులు ఉండవని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే జరిమానా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read More
Next Story