గంభీర్ తో రో-కో సంబంధాలు సరిగా లేవా?
x
రాంఛీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

గంభీర్ తో రో-కో సంబంధాలు సరిగా లేవా?

సీనియర్లతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న అగార్కర్, కోచ్


సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో టీమిండియా కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్ కు సరైన సంబంధాలు లేవా అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ఇద్దరి మధ్య కనీస మాటలు కూడా లేవని ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ వార్తా కథానాన్ని ప్రసారం చేసింది.

రాంఛీలో నిన్న జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ రికార్డు స్థాయిలో 52 వ వన్డే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం కోచ్, సీనియర్ ఆటగాళ్ల మధ్య సంబంధాలు కాస్త కుదురుకున్నట్లు ఒక నివేదిక బయటకు వచ్చింది. కొన్ని రోజుల క్రితమే టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రో-కో ద్వయం నిష్క్రమించింది.

ఇద్దరు ఆటగాళ్లు కేవలం వన్డే జట్టులో మాత్రమే కొనసాగుతున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు సాధించారు. రోహిత్ 51 బంతులలో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 349/8 పరుగులు సాధించింది. తుది వరకూ పోరాడిన సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది.

కరచాలనం చేసుకున్న గంభీర్- కోహ్లీ
మ్యాచ్ లో సెంచరీ సాధించి ఔట్ అయిన కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లగా, గంభీర్ కరచాలనం చేసి, హత్తుకున్నట్లు కనిపించింది. అయితే ఇంతకుముందు ఇద్దరి మధ్యసరిగా సంబంధాలు లేవు. రోహిత్, కోహ్లీతో సరైన సంబంధాలు లేకపోవడంతో బీసీసీఐ కూడా గంభీర్ పై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
‘‘గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ల మధ్య సంబంధాలు బాగా లేవు. ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్ పై సమావేశం నిర్వహించడానికి రాయ్ పూర్, విశాఖపట్నం ను ఎంచుకోనున్నారు. ఇవి రెండు, మూడో వన్డే మ్యాచ్ వేదికలు’’ అని జాగరణ్ బీసీసీఐ మూలాన్ని ఉటంకిస్తూ వార్తలు ప్రసారం చేసింది.
‘‘ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లోనూ రోహిత్, అగార్కర్ మధ్య మాటలు లేవు. అప్పటి నుంచి నేటీ వరకూ కోహ్లీ- గంభీర్ మధ్య కూడా పెద్దగా మాటలు లేవు. అంతేకాకుండా కోహ్లీ- రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో గంభీర్ పై చేస్తున్న విమర్శల విధానం బీసీసీఐని కలవరపెట్టింది’’ అని ఓ నివేదిక బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ సద్దుమణిగినట్లు అంతా భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 3న రాయ్ పూర్ లో రెండో వన్డే, డిసెంబర్ ఆరున విశాఖపట్నంలో మూడో వన్డే జరగనుంది. డిసెంబర్ 9 నుంచి 19 వరకూ ఐదు టీ20 లు జరగనున్నాయి.
Read More
Next Story