యాషెస్: 15 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో గెలిచిన ఇంగ్లాండ్
x
వికెట్ తీసిన ఆనందంలో ఆటగాళ్లు

యాషెస్: 15 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో గెలిచిన ఇంగ్లాండ్

బాక్సింగ్ డే టెస్ట్ కు పోటెత్తిన అభిమానులు, కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్ట్


ఆస్ట్రేలియా లో వరుసగా 18 టెస్ట్ ల్లో ఓడిన ఇంగ్లాండ్ తమ అపజయాల పరంపరకు ముగింపు పలికింది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంతకుముందు జరిగిన మూడు టెస్టుల్లోనే ఆసీస్ గెలిచి, యాషెష్ ను దక్కించుకుంది. అయితే మెల్ బోర్న్ టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.

పెర్త్, బ్రిస్బేన్, అడిలైట్ లో జరిగిన టెస్టుల్లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఒక్క టెస్టుల్లోనూ ఇంగ్లీష్ జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. పెర్త్ టెస్ట్ కూడా కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. 129 సంవత్సరాలలో ఒకే సిరీస్ లో రెండు టెస్ట్ లు రెండు రోజుల్లోనే ముగియడం ఇదే మొదటిసారి.
2013-14 యాషెస్ సిరీస్ నుంచి ఇంగ్లాండ్ విజయాల పరంపర కొనసాగింది. ఆ సిరీస్ లో ఆస్ట్రేలియా 5-0 తో గెలిచింది. 2010-11 యాషెస్ ను ఇంగ్లాండ్ 3-1 తో గెలిచింది. తరువాత జరిగిన 15 సంవత్సరాల కాలంలో ఇంగ్లాండ్ 18 టెస్ట్ మ్యాచ్ లు ఇక్కడ ఆడితే 16 మ్యాచ్ లలో ఓడిపోగా, మరో రెండు టెస్ట్ లను డ్రా చేసుకోగలిగింది.
రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లీష్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ‘‘ఇప్పటి వరకూ ఇది కఠినమైన పర్యటన’’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నారు. ‘‘కానీ మేము దీన్ని చేసిన విధానం బాగుంది. ధైర్యంగా ఆడాము.’’ అని స్టోక్స్ చెప్పారు.
ఛేజింగ్ లో ఇంగ్లాండ్ మొదటి పది ఓవర్లలో 70 పరుగులు సాధించింది. బెన్ డకెట్ 34, బ్రైడాన్ కార్స్ వికెట్లను కోల్పోయి టీ విరామానికి వెళ్లింది. తరువాత మరో ఒపెనర్ జాక్ క్రాలీ(37), ఓలీ పోప్ స్థానంలో ఆడిన జాకబ్ బెతెల్(40) జట్టును విజయపథంలో నడిపారు. తరువాత బ్యాటింగ్ వచ్చిన జేమీ స్మిత్, హ్యరీ బ్రూక్ జట్టును విజయపథంలో నడిపారు. జనవరి 4న సిడ్నీలో ఐదో, చివరి టెస్ట్ జరుగుతుంది.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 132 పరుగులకే ఆలౌట్ అయింది. పేస్ బౌలర్లకు ఎంసీజీ మంచి సహకారం అందించింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (46) ఒక్కడే పోరాడాడు. ఒకదశలో ఆస్ట్రేలియా 82-3 నుంచి 88-6 కి పడిపోయింది. ఇంగ్లీష్ బౌలర్ బ్రైడన్ కార్స్ 4-34 మంచి ప్రదర్శన చేశాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులు చేసిన ఆసీస్, ఇంగ్లీష్ జట్టును 110 పరుగులకే కట్టడి చేసింది. దీనితో కంగారు జట్టుకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్ నీసర్ తన కెరీర్ లో ఉత్తమ గణాంకాలు (5/45) ఈ టెస్ట్ లో నమోదు చేశాడు.
రెండో ఇన్నింగ్స్ లో మరో 50 లేదా 60 పరుగులు సాధిస్తే పరిస్థతి మరోలా ఉండేదని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నారు. ఈ మ్యాచ్ కు ఎంసీజీకి 92,045 మంది హజరయ్యారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టేడియం. బాక్సింగ్ డే తొలి రోజున 94,199 మంది ప్రేక్షకులు హజరయ్యారు. మూడో రోజుకు కూడా 90 వేల టికెట్లు అమ్ముడు పోయాయి.
Read More
Next Story