పారాలింపిక్స్ లో సత్తా చాటిన క్రీడాకారులు
x
పారిస్ పారాలింపిక్స్ 2024లో సత్తాచాటిన భారత జావెలిన్ త్రోయర్లు అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్

పారాలింపిక్స్ లో సత్తా చాటిన క్రీడాకారులు

పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. అద్భుత ప్రదర్శనతో 20 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు) సాధించారు.


పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. 3 ఏళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో సాధించిన రికార్డును (19 పతకాలు; 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) అధిగమించి అద్భుత ప్రదర్శనతో 20 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు) సాధించారు.

భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు వరుసగా రెండో రోజు ఐకానిక్ స్టేడ్ డి ఫ్రాన్స్‌లో తమ సత్తాను ప్రదర్శించారు. ఐదు పతకాలు (రెండు రజతం, మూడు కాంస్యం) సాధించండంతో భారత్ 17వ స్థానంలో నిలిచింది.

జావెలిన్ త్రోలో 2 పతకాలు:

జావెలిన్ త్రోయర్లు అజీత్ సింగ్ ప్రపంచ రికార్డు సాధించిన సుందర్ సింగ్ గుర్జార్ ఎఫ్ 46 విభాగంలో వరుసగా 65.62 మీ, 64.96 మీటర్లు విసిరి రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

హైజంప్ క్రీడాకారులు శరద్ కుమార్‌, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత మారియప్పన్ తంగవేలు (T63 వర్గం) ఫైనల్‌లో వరుసగా 1.88 మీటర్లు, 1.85 మీటర్ల జంప్‌లతో రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

అంతకుముందు మహిళల 400 మీటర్ల (టి20) ఈవెంట్‌లో ప్రపంచ ఛాంపియన్ స్ప్రింటర్ దీప్తి జీవన్‌జీ (20) భారత్‌కు మరో కాంస్య పతకాన్ని ఖాయం చేశారు. ఉక్రెయిన్ క్రీడాకారిణి యులియా షులియార్ (55.16 సెకన్లు) మొదటి స్థానంలో నిలవగా, ప్రపంచ రికార్డు హోల్డర్ టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.23 సెకన్లు) రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమార్తె జీవన్‌జీ పాఠశాల స్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో సత్తాచాటారు. అంగవైకల్యం కారణంగా గ్రామస్తులు మొదట్లో జీవన్‌జీ హేళన చేశారు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, మేలో జరిగిన పారా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత అదే గ్రామస్థులు ఆమెపై ప్రశంశలు కురిపించారు. ఈమెకు గతంలో నాగపురి రమేష్, ప్రస్తుతం జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సహకరిస్తున్నారు.

2వ పతకాన్ని కోల్పోయిన అవని:

మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 ప్లేస్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌ ఫైనల్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఏస్ షూటర్ అవని లేఖరా (22) రెండో పతకాన్ని కోల్పోయింది. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో పక్షవాతానికి గురైన ఈమె ఎనిమిది మంది ప్రపంచ స్థాయి క్రీడాకారిణులతో పోటీపడి 420.6 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన నటాస్చా హిల్‌ట్రాప్ స్వర్ణం (456.5 పాయింట్లు), స్లోవేకియాకు చెందిన వెరోనికా వడోవికోవా రజతం (456.1 పాయింట్లు), చైనాకు చెందిన జాంగ్ కాంస్యం (446.0 పాయింట్లు) గెలుచుకున్నారు.

భాగ్యశ్రీ 5వ స్థానం:

మహిళల షాట్‌పుట్‌ ​​(ఎఫ్‌34)లో భాగ్యశ్రీ జాదవ్‌ ఐదో స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన లిజువాన్ జౌ 9.14 మీటర్లతో స్వర్ణం కైవసం చేసుకోగా, పోలాండ్‌కు చెందిన లూసినా కర్నోబిస్ 8.33 మీటర్లతో రజతం కైవసం చేసుకుంది.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన జాదవ్ (39) 2006లో ప్రమాదంలో కాళ్లు కోల్పోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో పారాఅథ్లెట్‌గా రాణించాడు.

ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత పూజా జత్యాన్ (27) మహిళల ఓపెన్ ఆర్చరీ ఈవెంట్‌లో టర్కీకి చెందిన యగ్మూర్ సెంగుల్‌ను వరుస సెట్లలో ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అయితే 8వ రౌండ్‌లో టోక్యో పారాలింపిక్స్ కాంస్య పతక విజేత చైనాకు చెందిన వు చున్యాన్ చేతిలో ఓడిపోయాడు.

Read More
Next Story