
బాబర్, షాహీన్ ఆఫ్రిదిలపై వేటు
నమీబియాతో జరిగే మ్యాచ్ లో వేరే ఆటగాళ్లకు చోటు
కొలంబో వేదిక భారత్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు షాహీన్ ఆఫ్రిదీ, బాబర్ ఆజమ్ విఫలమయ్యారు. దీనితో వచ్చే మ్యాచ్ లో ఈ ఇద్దరిపై వేటు పడనుంది.
నమీబియాతో జరిగే తదుపరి T20 ప్రపంచ కప్ మ్యాచ్‌కు పాకిస్తాన్ వారిని తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ జట్టు మేనేజ్‌మెంట్ వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 16) జాతీయ మీడియాకి తెలిపాయి.
భారత్‌తో జట్టు 61 పరుగుల తేడాతో ఓడిపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు మేనేజర్ నవేద్ అక్రమ్ చీమాకు తన అసంతృప్తిని తెలియజేశారని ఆ వర్గాలు తెలిపాయి.
నిన్న జరిగిన మ్యాచ్ లో రెండు ఓవర్లు వేసిన షాహీన్ ఆఫ్రిది 30 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అక్షర్ పటేల్ వికెట్ మాత్రమే సాధించాడు. అతని బౌలింగ్ లో ఎలాంటి పస కనిపించలేదు. మరోవైపు సీనియర్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం సైతం ఘోరంగా విఫలమయ్యాడు. ఏడు బంతుల్లో ఐదు పరుగులే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

