బోర్డర్- గవాస్కర్ ట్రోఫి: తొలి టెస్టు పై పట్టు బిగించిన టీమిండియా
x

బోర్డర్- గవాస్కర్ ట్రోఫి: తొలి టెస్టు పై పట్టు బిగించిన టీమిండియా

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో తొలి రోజు తడబడిన భారత్ రెండో ఇన్సింగ్స్ ల పుంజుకుంది. ఆసీస్ ను తొలి ఇన్సింగ్స్ లో 104 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ..


పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ సిరీస్ తొలి టెస్టు పై టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన బౌలర్లు, రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కు 171 పరుగులు జోడించారు.

మొదటి ఇన్సింగ్స్ ఆధిక్యంతో కలుపుకుంటే టీమిండియా లీడ్ 218 పరుగులకు చేరింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ పర్యటనలో 20 సంవత్సరాల తరువాత భారత ఒపెనర్లు తొలిసారి వంద పరుగులు, అంతకుమించి తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు. జైస్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేయగా, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు. 2003 -04 లో వీరేంద్ర సెహ్వగ్- ఆకాశ్ చోప్రా జోడి వంద పరుగులు తొలి వికెట్ కు జోడించారు.

ఆసీస్ ఢమాల్..
తొలి రోజు భారత జట్టును కేవలం 150 పరుగులకు ఆలౌట్ చేసిన కంగారు జట్టు, తన తొలి ఇన్సింగ్స్ లో కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొదటి రోజు 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్,రెండో రోజు ప్రారంభంలోనే అలెక్స్ కేరీ వికెట్ కోల్పోయింది.
కెప్టెన్ బుమ్రా సంధించిన బంతి కాస్త బౌన్స్ అవడంతో కీపర్ పంత్ కి క్యాచ్ ఇచ్చి కేరి వెనుదిరిగాడు. ఈ వికెట్ తో బుమ్రా ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మిచెల్ స్టార్క్ ఇతర టెయిలెండర్ల సహకారంతో స్కోర్ బోర్డుపై వంద పరుగులు దాటించాడు. ఈ క్రమంలో ఆసీస్ టెయిలెండర్లు దాదాపు గంటన్నర సేపు భారత బౌలర్లను విసిగించారు.
రెండో ఇన్సింగ్స్ లో బ్యాట్స్ మెన్ భళా..
ఆసీస్ ఆలౌట్ కాగానే భారత్ ఓపెనర్లు బ్యాటింగ్ కు దిగి ఆచితూచి బ్యాటింగ్ చేశారు. దూకుడుగా ఆడే జైస్వాల్ కూడా చాలా నిదానంగా మంచి షాట్ సెలక్షన్ తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఇరువురు హఫ్ సెంచరీలు సాధించారు. హఫ్ సెంచరీ దాటాక జైస్వాల్ వేగంగా ఆడే ప్రయత్నం చేసి కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. ముఖ్యంగా నాథన్ లియన్ బౌలింగ్ ముందుకు వచ్చి బాదిన సిక్స్ వంద మీటర్ల దూరం వెళ్లింది.వీరి ఒపెనింగ్ ఆసీస్ గడ్డపై భారత్ తరఫున రెండో అత్యుత్తమ ఒపెనింగ్ భాగస్వామ్యం అందించారు.
Read More
Next Story